Rohit Sharma: హిట్ మ్యాన్ రోహిత్ శర్మ లేకుండా ముంబై ఇండియన్స్ లేదు అంటూ హర్దిక్ పాండ్యాను జట్టు కెప్టెన్ నియమించిన ప్రకటనపై క్రికెట్ ప్రియులు స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే ముంబై జట్టును ఏకంగా నాలుగు లక్షల మందికి పైగా ఫాలోవర్లు అన్ ఫాలో చేశారు.
Mumbai Indians-Rohit Sharma: గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యను జట్టులోకి తీసుకోవడం, ఆ తర్వాత హిట్ మ్యాన్ రోహిత్ శర్మను జట్టు కెప్టెన్ గా తొలగించడం సంచలనంగా మారింది. అయితే, రోహిత్ శర్మను ముంబయి జట్టు కెప్టెన్ తొలగించడంపై సోషల్ మీడియా, క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ఇంకా చర్చ సాగుతూనే ఉంది. అయితే, రోహింత్ శర్మను జట్టు కెప్టెన్ గా తొలగించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఎక్కువ మంది మాత్రం ముంబై ఫ్రాంచైజీది తొందరపాటు నిర్ణయంగా పేర్కొంటున్నారు.
25
Rohit Sharma and Hardik Pandya
ఇక సోషల్ మీడియాలో అయితే, ఈ విషయంపై కామెంట్ల వర్షం కురుస్తోంది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ లేకుండా ముంబై ఇండియన్స్ లేదు అంటూ క్రికెట్ ప్రియులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ముంబై జట్టును ఏకంగా నాలుగు లక్షల మందికి పైగా ఫాలోవర్లు దూరమయ్యారు. తాజాగా ఆ జట్టు మాజీ ప్లేయర్, భారత క్రికెట్ స్టార్ ప్లేయర్ వసీం జాఫర్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు.
35
Rohit Sharma and Hardik Pandya
ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తొలగించడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అన్నాడు. ఇంత హడావుడిగా రోహిత్ శర్మను మార్చాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. 'రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాను జట్టులోకి తీసుకోవడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది త్వరితగతిన తీసుకున్న నిర్ణయం ఎందుకని' పేర్కొన్నాడు.
45
Rohit Sharma
హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ తిరిగి జట్టులోకి తీసుకున్నప్పుడు, రాబోయే సీజన్ కు అతన్ని కెప్టెన్ గా చేయవచ్చని చెప్పి ఉండవచ్చని అన్నారు. అలాగే, ఈ విషయాన్ని వారు రోహిత్ శర్మకు చెప్పారా? ముందే అనే విషయాన్ని లేవనెత్తారు. హార్దిక్ ను జట్టులోకి తీసుకునే ముందు ముంబై జట్టు కెప్టెన్ గా మరికొంత మంది పేర్లు కూడా వినిపించాయనీ, వారిలో ప్రస్తుతం భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్న సూర్యకుమార్ యాదవ్ అనీ, కెప్టెన్ గా అతడికి ఇది గొప్ప ప్రదర్శనగా చెప్పారు.
55
Rohit Sharma-Ricky Ponting
'టెస్టుల్లో భారత్ కు నాయకత్వం వహించిన జస్ప్రీత్ బుమ్రా పేరు కూడా వినిపించింది. అయితే, పాండ్యా రాక గురించి అందరితో మాట్లాడం కనిపించలేదు. కానీ ఈ సీజన్లోనే ప్రత్యక్ష మార్పు రావడం ఆశ్చర్యంగా ఉంది' అని జాఫర్ అన్నాడు.