ఐపీఎల్ 2024: ముంబై ఇండియన్స్ జట్టుకు హార్ధిక్ పాండ్యా కెప్టెన్ వెనుక వ్యూహమిదీ..

First Published | Dec 17, 2023, 10:36 AM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్  2024 సీజన్ లో  ముంబై ఇండియన్స్ జట్టుకు రోహిత్ శర్మ స్థానంలో హార్ధిక్ పాండ్యాను జట్టు మేనేజ్ మెంట్ నిర్ణయం తీసుకుంది. దీని వెనుక  జట్టు కీలక వ్యూహం ఉంది.

ఐపీఎల్ 2024: ముంబై ఇండియన్స్ జట్టుకు హార్ధిక్ పాండ్యా కెప్టెన్ వెనుక వ్యూహమిదీ..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 (ఐపీఎల్ 2024 ) సీజన్ లో  ముంబై ఇండియన్స్ జట్టుకు  హర్ధిక్ పాండ్యాను కెప్టెన్ గా  టీమ్ మేనేజ్ మెంట్ నిర్ణయం తీసుకుంది. ముంబై ఇండియన్స్ జట్టుకు  కీలక విజయాలు అందించిన  రోహిత్ శర్మ స్థానంలో  హర్ధిక్ పాండ్యాకు  ఆ జట్టు యాజమాన్యం కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది. 

ఐపీఎల్ 2024: ముంబై ఇండియన్స్ జట్టుకు హార్ధిక్ పాండ్యా కెప్టెన్ వెనుక వ్యూహమిదీ..

ముంబై ఇండియన్స్ జట్టు  ఐదు ఐపీఎల్ టైటిల్స్ గెలుచుకుంది.ఈ విజయాల్లో రోహిత్ శర్మ పాత్రను కాదనలేం. ముంబై ఇండియన్స్  కెప్టెన్ గా  రోహిత్ శర్మ తప్పుకోవడంతో   ఐపీఎల్ లో  ఒక శకం ముగిసింది. 

ఐపీఎల్ 2024: ముంబై ఇండియన్స్ జట్టుకు హార్ధిక్ పాండ్యా కెప్టెన్ వెనుక వ్యూహమిదీ..

2013లో  ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ గా రోహిత్ శర్మ బాధ్యతలు చేపట్టారు.  2013, 2015,  2017, 2019, 2020లలో  ముంబై ఇండియన్స్ జట్టు  టైటిల్ ను కైవసం చేసుకుంది.ఐపీఎల్ 2024 సీజన్ లో  ముంబై ఇండియన్స్ జట్టుకు హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా నియమిస్తూ  ఆ జట్టు నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు  రెండు రోజుల క్రితం  ఆ జట్టు తన నిర్ణయాన్ని తెలిపింది.

ఐపీఎల్ 2024: ముంబై ఇండియన్స్ జట్టుకు హార్ధిక్ పాండ్యా కెప్టెన్ వెనుక వ్యూహమిదీ..

ముంబై ఇండియన్స్ క్రికెట్ జట్టును రోహిత్ శర్మ  విజయాల బాటలో నడిపించాడు. ఎం.ఎస్. ధోని చెన్నై సూపర్ కింగ్స్ ను  విజయాలబాటలో ఎలా నడిపాడో , ముంబై ఇండియన్స్ జట్టును  కూడ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ జట్టును  విజయాల వైపు నడిపించాడు.

ఐపీఎల్ 2024: ముంబై ఇండియన్స్ జట్టుకు హార్ధిక్ పాండ్యా కెప్టెన్ వెనుక వ్యూహమిదీ..

అంతర్జాతీయ క్రికెట్ లోని అన్ని ఫార్మెట్లకు  ఎం.ఎస్. ధోని  కెప్టెన్సీని  వదులుకున్న తర్వాత  కూడ  చెన్నై సూపర్ కింగ్స్ కు  ధోని  కెప్టెన్ గా వ్యవహరించాడు.  హిట్ మ్యాన్ గా  రోహిత్ శర్మకు పేరుంది.   ఇటీవల జరిగిన  ప్రపంచకప్ క్రికెట్ పోటీల్లో  భారత జట్టు అన్ని మ్యాచుల్లో విజయం సాధించింది. అయితే ఒక్క ఫైనల్ మ్యాచ్ లో అస్ట్రేలియా చేతిలో  భారత జట్టు ఓటమి పాలైంది.  టైటిల్ ఫేవరేట్ గా భారత జట్టు ఫైనల్ మ్యాచ్ లో దిగింది.

ఐపీఎల్ 2024: ముంబై ఇండియన్స్ జట్టుకు హార్ధిక్ పాండ్యా కెప్టెన్ వెనుక వ్యూహమిదీ..

గత ఏడాది ఐసీసీ ఈవెంట్‌లో భారత కెప్టెన్  ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే నమోదు చేశాడు. 2023  ప్రపంచకప్ నుండి భారత క్రికెట్ జట్టు  వైదొలిగిన తర్వాత  టీ20 వన్‌డే మ్యాచ్ ల గురించి  స్పష్టత ఇవ్వలేదు.  దక్షిణాఫ్రికాతో జరిగే  టెస్ట్ సిరీస్ కు  రోహిత్ శర్మ నాయకత్వం వహించనున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగే   వైట్ బాల్ పోటీలకు  రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకున్నాడు.  

ఐపీఎల్ 2024: ముంబై ఇండియన్స్ జట్టుకు హార్ధిక్ పాండ్యా కెప్టెన్ వెనుక వ్యూహమిదీ..

హార్ధిక్ పాండ్యా  గత 25 టీ 20 మ్యాచుల్లో భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు.  రోహిత్ శర్మ స్థానంలో  హార్ధిక్ పాండ్యాను బీసీసీఐ  భావిస్తుంది.  ముంబై ఇండియన్స్ జట్టు రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యాను  కెప్టెన్ గా ఎంపిక చేసింది. 
 
ఐపీఎల్ 2024: ముంబై ఇండియన్స్ జట్టుకు హార్ధిక్ పాండ్యా కెప్టెన్ వెనుక వ్యూహమిదీ..

గుజరాత్ టైటాన్స్ జట్టు నుండి  హార్ధిక్ పాండ్యా ఇటీవలనే ముంబై ఇండియన్స్ జట్టులోకి వచ్చాడు. టీ 20 క్రికెట్ చరిత్రలో  అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లలో  రోహిత్ శర్మ రికార్డు సాధించాడు. అయితే  2022లో ఐపీఎల్ లో చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు.  2008లో  రోహిత్ శర్మ అరంగేట్రం చేసిన తర్వాత అత్యంత చెత్త రికార్డు ఇదే.

ఐపీఎల్ 2024: ముంబై ఇండియన్స్ జట్టుకు హార్ధిక్ పాండ్యా కెప్టెన్ వెనుక వ్యూహమిదీ..

2002 సీజన్ లో రోహిత్ శర్మ ఒక్క అర్ధ సెంచరీ కూడ నమోదు చేయలేదు.  ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ గా  14 ఇన్నింగ్స్ లలో  268 పరుగులు చేశారు. ఐపీఎల్  2022 సీజన్ లో  19.14 సగటుతో  10వ స్థానంలో  హార్ధిక్ పాండ్యా నిలిచాడు.  అదే సీజన్ గా గుజరాత్ టైటాన్స్ జట్టు  టాపర్ గా నిలిచిన విషయం తెలిసిందే.

ఐపీఎల్ 2024: ముంబై ఇండియన్స్ జట్టుకు హార్ధిక్ పాండ్యా కెప్టెన్ వెనుక వ్యూహమిదీ..

ముంబై ఇండియన్స్ జట్టు  గత సీజన్ లో  ప్లేఆఫ్స్ నకు చేరుకుంది.  గత సీజన్ లో  ముంబై ఇండియన్స్ జట్టు సభ్యుడైన సూర్యకుమార్ యాదవ్ వంటి వారి కంటే  రోహిత్ శర్మ వెనుకంజలో ఉన్నారు. ఈ సీజన్ లో  రోహిత్ శర్మ 332 పరుగులు మాత్రమే చేశాడు.

ఐపీఎల్ 2024: ముంబై ఇండియన్స్ జట్టుకు హార్ధిక్ పాండ్యా కెప్టెన్ వెనుక వ్యూహమిదీ..

ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ గా 158 మ్యాచులు ఆడిన రోహిత్ శర్మ ఆడాడు. ఇందులో  87 మ్యాచుల్లో ముంబై ఇండియన్స్ జట్టు గెలుపొందింది.  67 దఫాలు ఈ జట్టు ఓటమి పాలైంది.  

Latest Videos

click me!