మాహీ కాదు, నేను చూసిన బెస్ట్ కెప్టెన్ అతనే... యువరాజ్ సింగ్ కామెంట్...

First Published Jun 27, 2021, 10:29 AM IST

టీమిండియా బెస్ట్ కెప్టెన్ ఎవరంటే... చాలా మంది చెప్పే పేరు మహేంద్ర సింగ్ ధోనీ. ధోనీ కెప్టెన్సీలో టీమిండియా మూడు ఐసీసీ టైటిల్స్ గెలిచింది. అయితే ధోనీ కంటే సౌరవ్ గంగూలీ బెస్ట్ అండ్ బెటర్ కెప్టెన్ అంటున్నాడు మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్.

సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన యువరాజ్ సింగ్... ఆ తర్వాత రాహుల్ ద్రావిడ్, మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో ఆడాడు.
undefined
భారత ప్రస్తుత సారథి విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో కూడా ఆడిన యువీ... తాను ఆడిన బెస్ట్ కెప్టెన్ మాత్రం సౌరవ్ గంగూలీయే అంటున్నాడు...
undefined
భారత మాజీ సారథి సౌరవ్ గంగూలీ, జట్టులోని ప్లేయర్లపై పూర్తి భరోసా ఇచ్చేవాడని... ఒకటి రెండు మ్యాచుల్లో విఫలమైనా ఆటగాడి మీద నమ్మకంతో మళ్లీ ఓ ఛాన్స్ ఇచ్చేవాడని... ఆటగాడిని ది బెస్ట్ పర్ఫామెన్స్ రాబట్టడంలో దాదాయే బెస్ట్ అంటూ కామెంట్ చేశాడు యువరాజ్ సింగ్.
undefined
ప్లేయర్లకి గంగూలీ ఇచ్చే భరోసా, సపోర్ట్ వెలకట్టలేనివని... తానైనా ధోనీ, ఇర్పాన్ పఠాన్, గంభీర్ లాంటి ప్లేయర్లు అయినా గంగూలీ కెప్టెన్సీలోనే వెలుగులోకి వచ్చినట్టు తెలిపాడు యువరాజ్ సింగ్.
undefined
మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కానీ, ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ కానీ తనకి ఎలాంటి సపోర్ట్ చేయలేదని... సౌరవ్ గంగూలీ ఇచ్చిన సపోర్ట్ వల్లే తాను క్రికెట్‌లో ఎదగగలిగానని చెప్పుకొచ్చాడు యువరాజ్ సింగ్..
undefined
క్రికెటర్ యువరాజ్ సింగ్ చేసిన కామెంట్లతో మరోసారి ధోనీకీ, యువీకి మధ్య ఉన్న మనస్పర్థలు, విభేదాల గురించి చర్చ బయటికి వస్తోంది...
undefined
2007 టీ20 వరల్డ్‌కప్ సమయంలో తనకి టీమిండియా కెప్టెన్సీ దక్కుతుందని ఆశించానని... అయితే ఆ సమయంలోనే ధోనీని భారత జట్టు కెప్టెన్‌గా ప్రకటించారని చెప్పిన యువీ, అతనికి పూర్తి సపోర్ట్ ఇచ్చానని తెలిపాడు...
undefined
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమిండియా ఓటమితో మరోసారి ధోనీ కెప్టెన్సీ గురించి చర్చ జరుగుతోంది. తాజాగా యువరాజ్ సింగ్ కామెంట్లతో ఈ చర్చ మరింత పెరిగే అవకాశం ఉంది...
undefined
యువీ కామెంట్లను సపోర్ట్ చేస్తున్న కొందరు అభిమనులు... మాహీ కెప్టెన్సీలో సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లీ, జహీర్ ఖాన్ వంటి మ్యాచ్ విన్నర్లు ఉండడం వల్లే గెలిచాడని కామెంట్లు చేస్తున్నారు...
undefined
2007 టీ20 వరల్డ్‌కప్ సమయంలో ఇర్ఫాన్ పఠాన్, యువరాజ్ సింగ్, 2011 వన్డే వరల్డ్‌కప్ సమయంలో విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ... టీమిండియా తరుపున అద్భుతంగా రాణించారని అయితే వారికి పెద్దగా గుర్తింపు దక్కకపోగా క్రెడిట్ అంతా మహేంద్ర సింగ్ ధోనీకి వెళ్లిందని అంటున్నారు...
undefined
click me!