టీమిండియాతో ఫైనల్ మ్యాచ్‌కి ముందు న్యూజిలాండ్ జట్టు... స్వదేశంలో శ్రీలంక, పాకిస్తాన్ జట్లతో టీ20, టెస్టు సిరీస్ ఆడింది. ఆ ఆ సిరీసులను క్లీన్‌స్వీప్ చేసి ఆత్మవిశ్వాసంతో ఇంగ్లాండ్ గడ్డ మీద అడుగుపెట్టింది...
ఆ తర్వాత స్టార్లు లేని ఇంగ్లాండ్ జట్టును వారి గడ్డ మీదే ఓడించి, రెట్టింపు ఆత్మవిశ్వాసంతో డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో బరిలో దిగింది. ఇప్పుడు ఇంగ్లాండ్ జట్టు కూడా ఇదే ఫార్ములాను అనుసరిస్తోంది...
టీమిండియాతో ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌కి ముందు శ్రీలంక, పాకిస్తాన్‌లతో టీ20, వన్డే సిరీస్‌లను ఆడబోతోంది ఇంగ్లాండ్ జట్టు. స్వదేశంలో జరిగే సిరీసులు కాబట్టి ఈ మ్యాచుల్లో విజయం సాధించడం వారికి చాలా తేలిక.
ఇప్పటికే శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది ఇంగ్లాండ్ జట్టు. తొలి టీ20 మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఇంగ్లాండ్, రెండో టీ20లో 5 వికెట్లు తేడాతో విజయం సాధించింది...
నిన్న జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టుకి 89 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం దక్కింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది...
డేవిడ్ మలాన్ 48 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 76 పరుగులు చేయగా బెయిర్ స్టో 51 పరుగులు చేశాడు. 181పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన శ్రీలంక జట్టు 91 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఫెర్నాండో తప్ప ఇంగ్లాండ్ జట్టులో ఎవ్వరూ 20 పరుగులు కూడా చేయలేకపోయారు...
జూన్ 29 నుంచి మూడు వన్డేల సిరీస్‌లో పాల్గొనే శ్రీలంక, జూలై 4న ఇంగ్లాండ్ టూర్ ముగించుకుని స్వదేశానికి తిరిగి వెళ్తుంది. స్వదేశంలో శిఖర్ ధావన్ కెప్టెన్సీలోని భారత జట్టుతో కలిసి వన్డే, టీ20 సిరీస్ ఆడనుంది శ్రీలంక...
శ్రీలంక, పాకిస్తాన్ జట్లపై ఇంగ్లాండ సాధించే విజయాలు... టీమిండియాతో టెస్టు సిరీస్‌కి బెస్ట్ టీమ్‌ని ఎంపిక చేసేందుకు కూడా ఉపయోగించబోతోంది....
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కి బెస్ట్ ప్లేయర్లను పక్కనబెట్టి భారీ మూల్యం చెల్లించుకున్న ఇంగ్లాండ్ జట్టు, ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ ముందు జరిగే ఈ టెస్టు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి విజయోత్సాహం పొందాలని చూస్తోంది.
మరోవైపు డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఓటమి నుంచి తేరుకుని, ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ను గెలవాలని భావిస్తోంది టీమిండియా. టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు కౌంటీ జట్లతో రెండు ప్రాక్టీస్ మ్యాచులు ఆడేందుకు చర్చలు సాగిస్తోంది భారత జట్టు.