ఇకపై పిచ్చిపిచ్చి ప్రయోగాలు ఏమీ చెయ్యం! ఆసియా కప్ 2023లో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ ఇదే.. - రోహిత్ శర్మ

Published : Aug 22, 2023, 09:50 AM IST

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో టీమిండియా ఓటమికి ప్రధాన కారణం బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రయోగాలే. నాకౌట్ స్టేజీకి వెళ్లాలంటే తప్పక గెలవాల్సిన న్యూజిలాండ్‌తో మ్యాచ్‌‌లో రోహిత్ శర్మను వన్‌డౌన్‌లో పంపండి, బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేయడం భారత జట్టు ఓటమికి కారణమయ్యాయి..  

PREV
16
ఇకపై పిచ్చిపిచ్చి ప్రయోగాలు ఏమీ చెయ్యం! ఆసియా కప్ 2023లో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ ఇదే.. - రోహిత్ శర్మ

వెస్టిండీస్ టూర్‌లోనూ బ్యాటింగ్ ఆర్డర్‌లో రకరకాల మార్పులు చేసింది టీమిండియా. వెస్టిండీస్‌తో తొలి వన్డేలో రోహిత్ శర్మ ఏకంగా ఏడో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చాడు. అక్షర్ పటేల్‌కి ప్రమోషన్ ఇవ్వడం, సంజూ శాంసన్‌కి ఫినిషర్‌గా ట్రై చేయడం వంటివి పెద్దగా వర్కవుట్ కాలేదు..

26

అయితే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి రెండు నెలల సమయం మాత్రమే ఉండడంతో ఇకపై బ్యాటింగ్ ఆర్డర్‌లో ఇలాంటి చెత్త ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకోమని క్లియర్ చేసేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ...
 

36

‘ఓపెనర్లు ఇద్దరూ తమ పొజిషన్‌లో బ్యాటింగ్ చేస్తారు. నెం.3లో విరాట్ కోహ్లీ స్పాట్ ఫిక్స్. కెఎల్ రాహుల్ ఐదో స్థానంలో ఆడతాడు. గాయం తర్వాత రీఎంట్రీ ఇస్తున్నా అతని బ్యాటింగ్ పొజిషన్‌లో మార్పు ఉండదు. 

46

హార్ధిక్ పాండ్యా ఆరో స్థానంలో, రవీంద్ర జడేజా ఏడో స్థానంలో బ్యాటింగ్ చేస్తారు. నాలుగు- ఐదు బ్యాటింగ్ పొజిషన్లలో మాత్రం అటు ఇటు మార్పులు ఉండొచ్చు..

56

అది పెద్ద సమస్య కాదు, టీమ్‌కి అనుగుణంగా మార్పులు చేస్తాం. వన్డే టీమ్‌లో కుర్రాళ్లకు ఇంకా ఫిక్స్‌డ్ బ్యాటింగ్ పొజిషన్లు లేవు. నా కెరీర్ ఆరంభంలో కూడా ఇలాగే జరిగింది. టాపార్డర్ నుంచి లోయర్ ఆర్డర్ దాకా అన్ని పొజిషన్లలోనూ బ్యాటింగ్ చేశాను. ప్రతీ యంగ్‌స్టర్‌‌కి కెరీర్ మొదట్లో ఇలాంటి అనుభవం తప్పనిసరి..

66

అలాగని ఓపెనర్లను 8వ స్థానంలో పంపించాలని అనుకోవడం లేదు. ఇకపై అలాంటి పిచ్చి ప్రయోగాలు చేయం. అయితే టీమ్ కాంబినేషన్ కోసం కొన్ని చిన్న చిన్న మార్పులు మాత్రం అవసరం..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ..

Read more Photos on
click me!

Recommended Stories