రూ.16.25 కోట్లు పెట్టి కొని, బెన్ స్టోక్స్‌ని వదిలించుకుంటున్న చెన్నై సూపర్ కింగ్స్... ఆ బౌలర్‌పై కన్ను...

First Published Aug 20, 2023, 8:35 PM IST

ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్‌ని రూ.16 కోట్ల 25 లక్షల రికార్డు ధరకు కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. అయితే 2023 సీజన్‌లో బెన్ స్టోక్స్ ఆడింది రెండంటే రెండే మ్యాచులు. అందులో బౌలింగ్ చేసింది ఒకే ఓవర్. బ్యాటింగ్‌లో చేసింది 8 పరుగులే..

Image credit: PTI

గాయంతో ఐపీఎల్ 2023 సీజన్‌లో రెండే మ్యాచులు ఆడిన బెన్ స్టోక్స్, మెజారిటీ మ్యాచులకు దూరంగా ఉన్నాడు. ధోనీ రిటైర్మెంట్ తర్వాత బెన్ స్టోక్స్, సీఎస్‌కే కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని వార్తలు వచ్చాయి..

అయితే వన్డే రిటైర్మెంట్ వెనక్కి తీసుకుని, 2023 వరల్డ్ కప్ ఆడబోతున్నాడు బెన్ స్టోక్స్. వచ్చే ఏడాది ఐపీఎల్ 2024 సీజన్‌కి దూరంగా ఉండాలని బెన్ స్టోక్స్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీంతో అతన్ని విడుదల చేయడమే బెటర్ అని భావిస్తోందట సీఎస్‌కే మేనేజ్‌మెంట్..

Latest Videos


సీఎస్‌కే ఫ్యూచర్ కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ రేసులోకి రావడంతో ఆడతాడో లేదో తెలియని బెన్ స్టోక్స్‌కి రూ.16.25 కోట్లు చెల్లిస్తూ అట్టిపెట్టుకోవడం అనవసరమని ఫిక్స్ అయ్యిందట చెన్నై సూపర్ కింగ్స్... 

బెన్ స్టోక్స్ స్థానంలో ఆస్ట్రేలియా టెస్టు, వన్డే కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్‌ని కొనుగోలు చేయాలని చెన్నై సూపర్ కింగ్స్ భావిస్తున్నట్టు సమాచారం. బెన్ స్టోక్స్‌తో పోలిస్తే ప్యాట్ కమ్మిన్స్‌కి ఐపీఎల్‌లో మంచి రికార్డే ఉంది...

ఐపీఎల్ 2020 సీజన్‌లో రూ.15.50 కోట్లకు ప్యాట్ కమ్మిన్స్‌ని కొనుగోలు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్. 2020 సీజన్‌లో 12 వికెట్లు తీసిన కమ్మిన్స్, 2021 సీజన్‌లో 7 మ్యాచులు ఆడి 9 వికెట్లు తీశాడు. 2022 సీజన్‌లో ప్యాట్ కమ్మిన్స్ 5 మ్యాచులు మాత్రమే ఆడి 7 వికెట్లు తీశాడు..

ఐపీఎల్ 2022 సీజన్‌లో రూ.7.25 కోట్లకు కమ్మిన్స్‌ని తిరిగి కొనుగోల చేసింది కేకేఆర్. అయితే ఎక్కువ మ్యాచుల్లో రిజర్వు బెంచ్‌కే పరిమితం కావడంతో 2023 సీజన్‌లో ఆడలేదు ప్యాట్ కమ్మిన్స్.  ఈ సారి వేలంలో కమ్మిన్స్‌ని కొనుగోలు చేయడానికి సీఎస్‌కే గట్టిగా ప్రయత్నించబోతున్నట్టు సమాచారం..
 

click me!