అవసరమైతే కోహ్లీ, శర్మ, వన్డే వరల్డ్ కప్‌లో బౌలింగ్ చేస్తారు... ఆసియా కప్‌ ప్రెస్ మీట్‌లో రోహిత్ శర్మ కామెంట్..

Published : Aug 22, 2023, 09:25 AM IST

రోహిత్ శర్మ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత చెప్పుకోదగ్గ ఒక్క విజయం కూడా అందుకోలేకపోయాడు. పార్ట్‌టైం కెప్టెన్‌గా ఆసియా కప్ 2018 టైటిల్ గెలిచిన రోహిత్ శర్మ, ఫుల్ టైమ్ కెప్టెన్‌గా ఆసియా కప్ 2022, టీ20 వరల్డ్ కప్ 2022, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2023 టోర్నీల్లో ఓడాడు..

PREV
19
అవసరమైతే కోహ్లీ, శర్మ, వన్డే వరల్డ్ కప్‌లో బౌలింగ్ చేస్తారు... ఆసియా కప్‌ ప్రెస్ మీట్‌లో రోహిత్ శర్మ కామెంట్..

ఐపీఎల్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మకు ఆసియా కప్ 2023, వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలు చాలా కీలకంగా మారబోతున్నాయి. ఈ రెండు టోర్నీల్లో టీమిండియా టైటిల్ గెలవకపోతే, రోహిత్ శర్మ కెప్టెన్‌గా కొనసాగడం కష్టమే...

29

ఆసియా కప్ 2023 టోర్నీకి జట్టు ప్రకటించిన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫిరెన్స్‌లో రోహిత్ శర్మ కొన్ని ఆసక్తికర కామెంట్లు చేశాడు. ‘2011 వన్డే వరల్డ్ కప్‌ టీమ్‌లో ప్రతీ ఒక్కరూ బ్యాటింగ్, బౌలింగ్ రెండూ చేసేవాళ్లు... ఇప్పుడు మా టీమ్‌కి ఆ వెసులుబాటు లేదు..
 

39
Yuvraj Singh

అయితే ఉన్నంతలో బౌలింగ్ వనరులను వాడుకోవడానికి ప్రయత్నిస్తాం. ఎవరైతే బాగా ఆడతారో వారికే ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఒక్క రోజులో బ్యాటర్‌ని బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా మార్చలేం. టీమ్‌లో ఉన్న కొందరు స్పెషలిస్ట్ బ్యాటర్లు. వాళ్ల బ్యాటింగ్ టాలెంట్ వల్లే టీమ్‌లోకి వచ్చారు..

49
Virat Kohli and Rohit Sharma

బ్యాటర్లు అందరూ కచ్ఛితంగా బౌలింగ్ చేయాల్సిందేనని డిమాండ్ చేయలేం. అయితే ఈ వన్డే వరల్డ్ కప్‌లో శర్మ, ఇంకా కోహ్లీ కొన్ని ఓవర్లు బౌలింగ్ చేస్తారని అనుకుంటున్నా... ’ అంటూ నవ్వేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. 

59
Rohit Sharma

దీనికి కౌంటర్‌గా బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, ‘మేం వారిని బౌలింగ్ చేసేందుకు ఒప్పించాం...’ అంటూ సమాధానం ఇచ్చాడు. 2011 వన్డే వరల్డ్ కప్‌లో టైటిల్ గెలిచిన టీమిండియా, 12 ఏళ్ల తర్వాత మళ్లీ స్వదేశంలో వన్డే ప్రపంచ కప్ ఆడనుంది. 

69

అప్పటి టీమ్‌లో సురేష్ రైనా, వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్ వంటి పార్ట్‌టైమ్ స్పిన్నర్లు పుష్కలంగా ఉన్నారు. ముఖ్యంగా యువీ, 2011 వన్డే వరల్డ్ కప్‌లో 362 పరుగులు చేయడమే కాకుండా బౌలింగ్‌లో 15 వికెట్లు తీసి టీమిండియాకి అసలైన మ్యాచ్ విన్నర్‌గా మారాడు..

79

యువీ రిటైర్మెంట్ తర్వాత సరైన ఆల్‌రౌండర్లుగా ఎంపిక చేయడంలో పూర్తిగా విఫలమైంది భారత జట్టు. రోహిత్ శర్మ కెరీర్ ఆరంభంలో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా టీమ్‌లోకి వచ్చినా, ఓపెనర్‌గా మారిన తర్వాత పూర్తిగా బౌలింగ్ చేయడమే మానేశాడు..

89
Kohli

విరాట్ కోహ్లీ కెరీర్ ఆరంభంలో పార్ట్ టైం ఫాస్ట్ బౌలర్‌గా కొన్ని మ్యాచుల్లో బౌలింగ్ చేసినా, అతను కూడా 2016 తర్వాత బౌలింగ్ చేయడం మానేశాడు. టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో వికెట్ తీసిన ఆఖరి భారత బౌలర్ విరాట్ కోహ్లీయే కావడం విశేషం...

99

2022 ఆసియా కప్ సమయంలో విరాట్ కోహ్లీ బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో కూడా విరాట్ కోహ్లీ బౌలింగ్ చేయబోతున్నట్టు ప్రచారం జరిగింది. అయితే ఇంగ్లాండ్ సెమీ ఫైనల్‌లో ఫుల్ టైమ్ బౌలర్లు వికెట్ తీయలేక ఇబ్బందిపడుతున్న సమయంలోనూ పార్ట్ టైమ్ బౌలర్లను తీసుకురావడానికి ఆసక్తి చూపించలేదు కెప్టెన్ రోహిత్ శర్మ.. 

Read more Photos on
click me!

Recommended Stories