ఆస్ట్రేలియాకి మరో దెబ్బ! జోష్ హజల్‌వుడ్‌కి గాయం! మొదటి రెండు టెస్టులకు దూరం...

First Published Feb 5, 2023, 11:27 AM IST

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియా జట్టుకి ఊహించని షాక్ తగిలింది. గాయంతో ఆసీస్ స్టార్ పేసర్ జోష్ హజల్‌వుడ్, తొలి రెండు టెస్టులకు దూరం కానున్నాడు. ఇప్పటికే మిచెల్ స్టార్క్, గాయంతో తొలి టెస్టులో ఆడడం అనుమానంగా మారింది. ఇప్పుడు ఈ లిస్టులో జోష్ హజల్‌వుడ్ కూడా చేరిపోయాడు..

ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ చేతికి గాయం కావడంతో అతను బౌలింగ్ చేయడం అనుమానమే. మిచెల్ స్టార్క్, జోష్ హజల్‌వుడ్ కూడా గాయపడడంతో ఆస్ట్రేలియా బౌలింగ్ విభాగం కాస్త బలహీనంగా మారింది. అయితే ప్యాట్ కమ్మిన్స్‌తో పాటు స్కాట్ బోలాండ్, లాన్స్ మోరిస్ వంటి ఫాస్ట్ బౌలర్లు ఆస్ట్రేలియాకి అందుబాటులో ఉన్నారు.
 

Josh Hazlewood

భారత్‌లో పిచ్‌లు స్పిన్‌కి చక్కగా అనుకూలిస్తాయి. అందుకే ఆస్ట్రేలియ కూడా భారత బ్యాటర్లపై స్పిన్ అస్త్రాన్ని సంధంచాలని చూస్తోంది. ఇందుకోసం సీనియర్ నాథన్ లియాన్‌తో పాటు మాథ్యూ రెంషా, అస్టన్ అగర్, మిచెస్ స్వీప్సన్, టాడ్ ముర్ఫీ వంటి స్పిన్నర్లకు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 టోర్నీలో అవకాశం ఇచ్చింది ఆసీస్.. 
 

Image credit: Getty

భారత జట్టును కూడా గాయాల బెడద వెంటాడుతోంది. స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా గాయం కారణంగా ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడు. బుమ్రా ఫిట్‌గా ఉన్నానని ప్రకటించినా, రిస్క్ చేయడం ఇష్టం లేక తొలి రెండు టెస్టులకు అతన్ని దూరం పెట్టింది బీసీసీఐ...
 

జస్ప్రిత్ బుమ్రా దూరం కావడంతో భారత ఫాస్ట్ బౌలింగ్ విభాగాన్ని మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయ్‌దేవ్ ఉనద్కట్ నడిపించబోతున్నారు... స్పిన్నర్లుగా రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాలకు ఈ సిరీస్‌లో చోటు దక్కింది...

Image credit: PTI

మొదట రవీంద్ర జడేజాని తొలి రెండు టెస్టులకు ఎంపిక చేయకపోయినా ఫిట్‌నెస్ నిరూపించుకున్న జడ్డూ, టీమ్‌తో కలిశాడు. తొలి టెస్టులో జడ్డూ ఆడడం ఖాయం కాగా గాయం కారణంగా శ్రేయాస్ అయ్యర్ టీమ్‌కి దూరమయ్యాడు...

తొలి రెండు టెస్టులకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్, శుబ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ (తొలి టెస్టు నుంచి అవుట్), కెఎస్ భరత్, ఇషాన్ కిషన్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్,జయ్‌దేవ్ ఉనద్కట్, సూర్యకుమార్ యాదవ్...

ఆస్ట్రేలియా జట్టు: ప్యాట్ కమ్మిన్స్ (కెప్టెన్), అస్టన్ అగర్, స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, కామెరూన్ గ్రీన్, పీటర్ హ్యాండ్స్‌కోంబ్, జోష్ హజల్‌వుడ్, ట్రావిడ్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, నాథన్ లియాన్, లాన్స్ మోరిస్, టాడ్ ముర్ఫీ, మాథ్యూ రెన్షా, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మిచెల్ స్వీప్సన్, డేవిడ్ వార్నర్

click me!