మూడేళ్ల తర్వాత మళ్లీ సెలబ్రిటీ క్రికెట్ లీగ్... ఫిబ్రవరి 18 నుంచి అఖిల్ అక్కినేని కెప్టెన్సీలో వారియర్స్...

Published : Feb 05, 2023, 10:13 AM IST

సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) మూడేళ్ల బ్రేక్ తర్వాత మళ్లీ ప్రారంభం కానుంది. 2019లో చివరిగా సీసీఎల్ టోర్నీ జరిగింది. కరోనా లాక్‌డౌన్ కారణంగా గత మూడు సీజన్లలో సెలబ్రిటి క్రికెట్ లీగ్ జరగనుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 18 నుంచి సీసీఎల్ సీజన్ 9 ప్రారంభం కానుంది...

PREV
16
మూడేళ్ల  తర్వాత మళ్లీ సెలబ్రిటీ క్రికెట్ లీగ్... ఫిబ్రవరి 18 నుంచి అఖిల్ అక్కినేని కెప్టెన్సీలో వారియర్స్...

గత మూడు సీజన్ల మాదిరిగానే ఈసారి 8 జట్లు సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో పాల్గొనబోతున్నాయి. బెంగాల్ టైగర్స్, భోజ్‌పూరీ దబాంగ్స్, చెన్నై రైనోస్, కర్ణాటక బుల్‌డోజర్స్, కేరళ స్ట్రైయికర్స్, ముంబై హీరోస్, పంజాద్ దే షేర్‌తో పాటు తెలుగు వారియర్స్ టీమ్... సీసీఎల్‌ 2023 సీజన్‌లో ఆడబోతున్నాయి...

26

అఖిల్ అక్కినేని కెప్టెన్సీలో తెలుగు వారియర్స్ జట్టు మూడు సార్లు సీసీఎల్ టైటిల్ గెలిచింది. 2011, 2012 సీజన్‌లో చెన్నై రైనోస్ జట్టు టైటిల్ గెలవగా ఆ తర్వాత రెండు సీజన్లు కర్ణాటక బుల్‌డోజర్స్ టైటిల్ సాధించింది. 2015, 2016, 2017 సీజన్లలో తెలుగు వారియర్స్ టైటిల్ సాధించింది. గత సీజన్‌ 2019లో ముంబై హీరోస్‌, మొదటిసారి సెలబ్రిటీ క్రికెట్ లీగ్ గెలిచింది...

36

సీసీఎల్ 2023 కర్టన్‌రైజర్‌లో తెలుగు వారియర్స్ టీమ్ కెప్టెన్ అఖిల్ అక్కినేని, సుధీర్ బాబు, సుశాంత్, ప్రిన్స్, అశ్విన్ బాబు పాల్గొన్నారు. కోలీవుడ్ టీమ్ చెన్నై రైనోస్‌కి ఆర్య కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు...

46

పంజాబ్ దే షేర్ టీమ్‌కి సోనూ సూద్, ముంబై హీరోస్ టీమ్‌కి రితేశ్ దేశ్‌ముఖ్ , కేరళ స్టైయికర్స్ టీమ్‌కి కుంచకో బోబన్, కర్ణాటక బుల్‌డోజర్స్ టీమ్‌కి సుదీప్, భోజ్‌పురీ దబాంగ్స్ టీమ్‌కి మనోజ్ తివారి, బెంగాల్ టైగర్స్ టీమ్‌కి జిస్సూ కెప్టెన్సీ చేయబోతున్నారు.. 
 

56

ఫిబ్రవరి 18న తమ మొదటి మ్యాచ్‌లో తెలుగు వారియర్స్ టీమ్, కేరళ స్ట్రైయికర్స్‌తో తలబడుతుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 25న చెన్నై రైనోస్, తెలుగు వారియర్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది...

66

మార్చి 4న తెలుగు వారియర్స్, బెంగాల్ టైగర్స్‌తో తలబడుతుంది. మార్చి 12న పంజాబ్ ది షేర్‌తో మ్యాచ్‌తో గ్రూప్ మ్యాచులు ముగుస్తాయి. మార్చి 18న సెమీ ఫైనల్స్, మార్చి 19న ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయి..

click me!

Recommended Stories