కోహ్లీ, రోహిత్ ఆడకుంటే స్పాన్సర్లు ఎలా!... ఆసియా కప్ వేదికపై పట్టువదలని పాక్! మార్చిలో మరోసారి...

First Published Feb 5, 2023, 9:34 AM IST

ఆసియా కప్ 2023 టోర్నీ గురించి ఏడాదిగా చర్చ జరుగుతూనే ఉంది. ఈ ఏడాది ఆసియా కప్ ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ సొంతం చేసుకుంది. అయితే పాక్‌లో అడుగుపెట్టేందుకు భారత జట్టుకు అనుమతి లేదు. ఇదే పీసీబీ, బీసీసీఐ మధ్య విభేదాలను మరింత పెంచుతోంది...
 

Image credit: Wikimedia Commons

న్యాయబద్ధంగా ఆసియా కప్ 2023 టోర్నీ నిర్వహణకు సంబంధించిన హక్కులు సొంతం చేసుకున్నామని, ఇప్పుడు భారత జట్టు పాక్‌కి రాబోమని చెబితే మాకు తీవ్ర నష్టం జరుగుతుందని వాదిస్తోంది పాక్ క్రికెట్ బోర్డు... ప్రస్తుతం పాక్‌లో తలెత్తిన ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ఈ టోర్నీ సాయపడుతుందని వాదిస్తోంది పీసీబీ..

పాక్‌లో అడుగుపెట్టేందుకు ఫారిన్ కోచ్‌లు భయపడుతుండడంతో ఆన్‌లైన్‌ కోచ్‌ని నియమించుకునేందుకు ఆలోచనలు చేస్తున్న పీసీబీ, ఆసియా కప్ 2023 వేదిక మారితే పాకిస్తాన్‌లో పర్యటించడానికి ఏ జట్టూ ముందుకు రాదని ఆవేదన వ్యక్తం చేస్తోంది...

అయితే పాక్‌లో అడుగుపెట్టేందుకు భారత జట్టుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం జరగదు. కేంద్రాన్ని కాదని, పాక్‌లో ఎలా పర్యటించగలమని వాదిస్తోంది బీసీసీఐ. కావాలంటే భారత జట్టు లేకుండా ఆసియా కప్ 2023 టోర్నీని జరుపుకోవాలని తేల్చి చెప్పేస్తోంది..

Image credit: Getty

‘విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి ప్లేయర్లు ఆడకపోతే స్పాన్సర్లు ముందుకు రారు. భారత జట్టు ఆడుతుందంటే కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు స్పాన్సర్లు క్యూ కడతారు. అది అందరికీ తెలుసు. అయినా పీసీబీ ఇలా పట్టుబట్టడం కరెక్ట్ కాదు...’ అంటూ కామెంట్ చేశాడు ఓ బీసీసీఐ అధికారి...
 

ఆసియా కప్ 2023 వేదికపై నిన్న బెహ్రాయిన్‌లో సమావేశమైంది ఏసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ). ఈ సమావేశంలో పీసీబీ ఛైర్మెన్ నజం సేథీ, బీసీసీఐ సెక్రటరీ, ఏసీసీ ఛైర్మెన్ జై షా పాల్గొన్నారు. అయితే పీసీబీ ఎంతకూ తగ్గకపోవడంతో మరోసారి మార్చిలో సమావేశం నిర్వహించబోతున్నారు...
 

Image credit: Getty

ఆసియా కప్ 2023 టోర్నీ యూఏఈకి మారడం దాదాపు కన్ఫార్మ్ అయిపోయినట్టే. పాక్‌ నుంచి టోర్నీని వేరే దేశానికి తరలించినందుకు నష్టపరిహారంగా కొంత మొత్తం కోరుతోంది పీసీబీ. దీని గురించి మరోసారి ఏసీసీ సమావేశంలో చర్చించబోతున్నారు.. 

click me!