బాబర్ ఆజమ్ ఉత్తి పిరికివాడు! టీమ్ కంటే నీ హాఫ్ సెంచరీ ముఖ్యమా... గౌతమ్ గంభీర్ కామెంట్స్..

First Published | Oct 16, 2023, 8:06 PM IST

అవతలివాళ్లు ఎవరు, ఏమనుకుంటారు? అనే వాటిని పట్టించుకోకుండా, తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పేస్తుంటాడు టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. ఈ యాటిట్యూడ్ కారణంగా చాలామంది క్రికెట్ ఫ్యాన్స్‌కి గంభీర్ నచ్చడు.. తాజాగా పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌ని ట్రోల్ చేశాడు గౌతీ..

మొదటి రెండు వరల్డ్ కప్ మ్యాచుల్లో స్వల్ప స్కోర్లకే అవుటైన బాబర్ ఆజమ్, నెం.1 వన్డే బ్యాటర్ ర్యాంకును కోల్పోయే ప్రమాదంలో పడ్డాడు. సరిగ్గా ఇదే సమయంలో టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ బాదాడు..

ఇమామ్ ఉల్ హక్‌తో కలిసి రెండో వికెట్‌కి 32 పరుగుల భాగస్వామ్యం జోడించిన బాబర్ ఆజమ్, మహమ్మద్ రిజ్వాన్‌తో కలిసి మూడో వికెట్‌కి 72 పరుగల భాగస్వామ్యం జోడించాడు. 58 బంతుల్లో 7 ఫోర్లతో 50 పరుగులు చేసి అవుట్ అయ్యాడు బాబర్..
 

Latest Videos


‘బాబర్ ఆజమ్ చాలా పిరికివాడిలా ఆడుతున్నాడు. ఓ భాగస్వామ్యం నిర్మించేటప్పుడు ఇద్దరిలో ఓ బ్యాటర్ దూకుడుగా ఆడాలి. ఛాన్సులు తీసుకుని స్కోరు వేగం పెంచాలి. నాకైతే బాబర్ ఆజమ్‌లో అలాంటి ఆలోచన కనిపించలేదు..

బాబర్ ఆజమ్ ఎప్పుడూ ఫిఫ్టీ చేయాలని, సెంచరీ కోసం ఆడుతున్నట్టు కనిపించింది. వ్యక్తిగత రికార్డుల కోసం ఆడితే ఇలాంటి ఫలితాలే వస్తాయి... కెప్టెన్ ఎప్పుడూ టీమ్ కోసమే ఆడాలి..

Rohit Sharma-Babar Azam

బాబర్ ఆజమ్ ఎప్పుడూ తన కోసమే ఆడుతున్నట్టు కనిపించింది. పాక్ చరిత్ర చూసుకుంటే దూకుడుగా ఆడే బ్యాటర్లు టాపార్డర్‌లో ఆడేవాళ్లు. షాహిద్ ఆఫ్రిదీ, ఇమ్రాన్ నజీర్, టోఫిక్ ఉమర్ మిడిల్ ఆర్డర్‌లో వేగంగా పరుగులు చేసేవాళ్లు..

Babar Azam

టాప్‌ 3లో ఏ బ్యాటర్ కూడా సింగిల్ బ్యాటర్ కూడా దూకుడుగా ఆడాలని ప్రయత్నించినట్టు కనిపించలేదు. బాబర్ ఆజమ్ అవుటైన షాట్ కూడా చాలా బ్యాడ్ షాట్. వరల్డ్ క్లాస్ బ్యాటర్ ఇలా అవుట్ అవ్వడం కరెక్ట్ కాదు...

60 బంతులు ఆడి 50 పరుగులు చేసి అవుట్ అయ్యాడు, అది కూడా బ్యాటింగ్‌కి చక్కగా అనుకూలిస్తున్న పిచ్ మీద.. బాబర్ ఆజమ్ ఆలోచనా విధానం మారనంత కాలం పరుగులు చేయొచ్చేమో కానీ, టీమ్‌ అయితే గెలిపించలేడు..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ బ్యాటర్ గౌతమ్ గంభీర్...
 

click me!