ధోనీకి అవార్డు ఇచ్చారు కానీ అసలు మ్యాన్ ఆఫ్ ది ఫైనల్ అతను... గౌతమ్ గంభీర్ కామెంట్స్..

First Published | Oct 16, 2023, 8:33 PM IST

గౌతమ్ గంభీర్ ఆటగాడిగా తెచ్చుకున్న గుర్తింపు కంటే, 2011 వన్డే వరల్డ్ కప్‌ విజయంలో ధోనీకి దక్కిన క్రెడిట్ గురించి మాట్లాడిన క్రికెటర్‌గానే ఎక్కువ మందికి గుర్తుంటాడేమో. ఎందుకంటే 2011 వన్డే వరల్డ్ కప్ ప్రస్తావన వచ్చిన ప్రతీసారీ మాహీని పరోక్షంగా ట్రోల్ చేస్తూనే ఉంటాడు గంభీర్..
 

వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్ త్వరత్వరగా అవుటైన తర్వాత విరాట్ కోహ్లీతో కలిసి ఇన్నింగ్స్ నిర్మించాడు గౌతమ్ గంభీర్. కోహ్లీ అవుటయ్యాక ఎమ్మెస్ ధోనీతో కలిసి భారత జట్టును విజయతీరాలకు చేర్చాడు..

97 పరుగులు చేసిన గౌతమ్ గంభీర్, సెంచరీకి 3 పరుగుల దూరంలో అవుట్ అయ్యాడు. 91 పరుగులు చేసిన మహేంద్ర సింగ్ ధోనీ, హెలికాఫ్టర్ సిక్సర్‌తో మ్యాచ్‌ని ముగించి... ‘మ్యాన్ ఆఫ్ ది ఫైనల్’ అవార్డు గెలిచాడు...


‘2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఎమ్మెస్ ధోనీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చారు. కానీ నా ఉద్దేశంలో జహీర్ ఖాన్ నిజమైన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్.. శ్రీలంక ఈజీగా 350కి పైగా పరుగులు చేసి ఉండేది...

జహీర్ ఖాన్ అద్భుతమైన స్పెల్ కారణంగానే వాళ్లను 280 పరుగులకి నియంత్రించగలిగాం. చాలామంది ధోనీ కొట్టిన సిక్స్ గురించి, నేను చేసిన 97 పరుగుల గురించి మాట్లాడతారు.. కానీ జహీర్ బౌలింగ్ గురించి మాత్రం మాట్లాడడు...’ అంటూ కామెంట్ చేశాడు గౌతమ్ గంభీర్..

శ్రీలంకతో జరిగిన 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో వరుసగా 3 మెయిడిన్ ఓవర్లు వేసిన జహీర్ ఖాన్, ఏడో ఓవర్‌లో ఉపుల్ తరంగను అవుట్ చేశాడు. మొదటి 5 ఓవర్లలో 6 పరుగులే ఇచ్చిన జహీర ఖాన్, మొత్తంగా 10 ఓవర్లలో 2 వికెట్లు తీసి 60 పరుగులు ఇచ్చాడు..
 

Latest Videos

click me!