10 రోజుల్లో 3 సార్లు నిర్ణయం మార్చుకున్న బీసీసీఐ... ప్లేయర్ల విషయంలో ఆ మాత్రం క్లారిటీ లేకపోతే ఎలా?...

First Published Jan 9, 2023, 4:54 PM IST

ఎన్ని విమర్శలు వస్తున్నా బీసీసీఐ తీరు మారడం లేదు. 10 ఏళ్లుగా ఐసీసీ టైటిల్ గెలవకపోయినా టాప్ టీమ్స్‌లో ఒకటిగా నెట్టుకొస్తున్న టీమిండియా...గత ఏడాది న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లతో వన్డే సిరీస్‌లు ఓడిపోయింది. ఈ ఏడాది బీసీసీఐ తీసుకున్న నిర్ణయాలపై తీవ్రమైన ట్రోలింగ్ వస్తోంది...

Image credit: Getty

డిసెంబర్ 27న శ్రీలంకతో సిరీస్‌కి జట్టును ప్రకటించింది బీసీసీఐ. గాయం నుంచి పూర్తిగా కోలుకోని జస్ప్రిత్ బుమ్రాకి ఈ సిరీస్‌లో చోటు దక్కలేదు. అయితే వారం రోజులకు బుమ్రా ఫిట్‌గా ఉన్నాడని, అతన్ని వన్డే సిరీస్‌ జట్టులో చోటు కల్పిస్తున్నట్టు ప్రకటించింది...
 

Image credit: Getty

దాదాపు నాలుగు నెలల తర్వాత జస్ప్రిత్ బుమ్రా రీఎంట్రీ ఇవ్వబోతున్నాడని అభిమానులు సంతోషించారు. ఎన్‌సీఏలో ఫిట్‌నెస్ నిరూపించుకున్న జస్ప్రిత్ బుమ్రా... వన్డే సిరీస్‌లో ఆడబోతున్నాడని అధికారికంగా ప్రకటించింది బీసీసీఐ. సరిగ్గా వన్డే సిరీస్ ఆరంభానికి ఒక్క రోజు ముందు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది...

Jasprit Bumrah

జస్ప్రిత్ బుమ్రా గాయం నుంచి కోలుకున్నా అతనికి కాస్త సమయం ఇవ్వాలనే ఉద్దేశంతో వన్డే సిరీస్ నుంచి తప్పిస్తున్నట్టు ప్రకటించింది బీసీసీఐ. డిసెంబర్ 27 నుంచి జనవరి 9 మధ్య 13 రోజుల గ్యాప్‌లో మూడు సార్లు నిర్ణయాన్ని మార్చుకుంది బీసీసీఐ..

bumrah

జస్ప్రిత్ బుమ్రాని ఆడించే ఉద్దేశం లేకపోతే వన్డే సిరీస్‌లో చోటు కల్పించడం ఎందుకు? సరిగ్గా వన్డే సిరీస్ ఆరంభానికి ఒక్క రోజు ముందు తప్పిస్తున్నట్టు ప్రకటించడం దేనికి? బీసీసీఐకి ఆటగాళ్ల విషయంలో ఎంత అస్పష్టత ఉందో ఈ సంఘటన ద్వారా అర్థం అవుతోంది...

Image credit: Getty

బుమ్రా ఫిట్‌నెస్ సాధించిన వెంటనే వన్డే సిరీస్‌లో ఆడించాలని అనుకోవడం, ఆ తర్వాత నాలుగు రోజులకు మళ్లీ ఏదో గుర్తుకు వచ్చినట్టు అతన్ని తప్పించడం చూస్తుంటే టీమిండియాలో క్లారిటీ మిస్ అయినట్టు తెలుస్తోంది. మేనేజ్‌మెంట్‌కే ప్లేయర్ల గురించి క్లారిటీ లేకపోతే, ఇక ఎవరికి ఉంటుంది?...
 

CHETAN SHARMA

బీసీసీఐ చీఫ్ సెలక్టర్ విషయంలోనూ ఇదే ధోరణి కనిపించింది. చేతన్ శర్మ పనితీరు బాగోలేదని, బంగ్లా టూర్‌ నడుస్తున్న సమయంలో సెలక్షన్ కమిటీపై వేటు వేసింది బీసీసీఐ...

Image credit: Chetan SharmaInstagram

మళ్లీ ఏమైందో ఏమో కానీ చేతన్ శర్మనే బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌గా ఎంపిక చేసింది. అసలు వేటు వేయడానికి, మళ్లీ నియమించడానికి మధ్య ఏం జరిగింది? క్రికెట్ ఫ్యాన్స్‌కి అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది.. 

click me!