ఉమ్రాన్ మాలిక్ వారి తోక ముడిపించే బౌలర్! సరిగ్గా వాడుకోండి... అజయ్ జడేజా కామెంట్...

Published : Jan 09, 2023, 04:10 PM IST

ఐపీఎల్‌లో అదరగొట్టి టీమిండియా తరుపున అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ ఒకడు. పెద్దగా దేశవాళీ క్రికెట్ ఆడిన అనుభవం కూడా లేని ఉమ్రాన్ మాలిక్, 140-150 స్పీడ్‌తో బౌలింగ్ చేసి క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు...

PREV
15
ఉమ్రాన్ మాలిక్ వారి తోక ముడిపించే బౌలర్! సరిగ్గా వాడుకోండి... అజయ్ జడేజా కామెంట్...

శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో 155+కి.మీ.ల వేగంతో బౌలింగ్ చేసి, భారత జట్టు తరుపున అత్యంత వేగంగా బౌలింగ్ చేసిన బౌలర్‌గా బుమ్రా రికార్డును బ్రేక్ చేసేశాడు ఉమ్రాన్ మాలిక్... 

25
Umran Malik

శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో 7 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు ఉమ్రాన్ మాలిక్. ఈ జమ్ము కశ్మీర్ కుర్రాడిపై ప్రశంసల వర్షం కురిపించాడు భారత మాజీ కెప్టెన్ అజయ్ జడేజా...

35
Image credit: Getty

‘ఉమ్రాన్ మాలిక్, భారత క్రికెట్‌కి దొరికిన ఓ రేర్ టాలెంట్. చాలా ఏళ్ల తర్వాత ఇలాంటి బౌలర్‌ దొరికాడు. నా వరకూ జవగల్ శ్రీనాథ్ ఇలాంటి బౌలింగ్ వేసేవాడు. అతనిలో ఏదో స్పెషల్ ఉంది...

45

ఉమ్రాన్ మాలిక్ లాంటి ఆయుధాన్ని సరిగ్గా వాడుకోవడం తెలియాలి. ఉమ్రాన్ మాలిక్‌ని తీసుకొచ్చిన ప్రతీసారీ వికెట్ దక్కకపోవచ్చు. కానీ 8 సార్లు తీసుకొస్తే మూడు సార్లు వికెట్లు తీయగల సత్తా ఉమ్రాన్ మాలిక్‌కి ఉంది... ముఖ్యంగా టెయిలెండర్లు, ఉమ్రాన్ మాలిక్ స్పీడ్‌ని తట్టుకోలేరు...

55

మూడు నాలుగు వికెట్లు పడిన తర్వాత ఉమ్రాన్ మాలిక్‌ని తీసుకొస్తే కచ్ఛితంగా ఫలితం ఉంటుంది. టాపార్డర్‌లో ఎక్కువ పరుగులు ఇచ్చినా అతన్ని కొనసాగిస్తే బ్రేక్ అందించగలడు.. మాలిక్‌ని వాడుకోవడం కెప్టెన్‌పైనే ఆధారపడి ఉంది..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా...
 

click me!

Recommended Stories