బుమ్రా లేడు! సున్నాలు చుడుతున్న సూర్య, ఫామ్‌లో లేని ఇషాన్... ముంబై ఇండియన్స్‌కి ఈసారి కూడా కష్టమే...

Published : Mar 24, 2023, 03:04 PM IST

ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్ ముంబై ఇండియన్స్. 2013లో రోహిత్ శర్మ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాక 8 సీజన్లలో ఐదుసార్లు టైటిల్స్ గెలిచింది ముంబై ఇండియన్స్.. అయితే గత రెండు సీజన్లలో ముంబై ఫెయిల్ అయ్యింది...

PREV
19
బుమ్రా లేడు! సున్నాలు చుడుతున్న సూర్య, ఫామ్‌లో లేని ఇషాన్... ముంబై ఇండియన్స్‌కి ఈసారి కూడా కష్టమే...
Mumbai Indians

2021 సీజన్‌లో నెట్ రన్ రేట్ కారణంగా ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించలేకపోయిన ముంబై ఇండియన్స్, 2022 సీజన్‌లో అట్టర్ ఫ్లాప్ పర్ఫామెన్స్ ఇచ్చింది. 14 మ్యాచుల్లో 4 విజయాలే అందుకున్న ముంబై, 10 మ్యాచుల్లో చిత్తుగా ఓడి... పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది...

29
Image credit: IPL

ఐపీఎల్ 2022 సీజన్‌ మెగా వేలంలో స్టార్ ప్లేయర్లను కొనుగోలు చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు ముంబై ఇండియన్స్. ఇది టీమ్ పర్ఫామెన్స్‌ని తీవ్రంగా దెబ్బ తీసింది.. 

39

ఐపీఎల్ 2023 సీజన్‌లో జోఫ్రా ఆర్చర్ వస్తుండడం ముంబై ఇండియన్స్‌కి కలిసి వచ్చే విషయం. అయితే అతను రెండేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తుండడంతో మునుపటిలా మెరుస్తాడా? లేదా? చెప్పడం కష్టం. ఒక్క మంచి జరిగితే, నాలుగైదు చెడులు కలిసి వచ్చినట్టు... ముంబై ఇండియన్స్‌కి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది...

49
Image credit: PTI

ముంబై ఇండియన్స్‌కి కీ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్. ఐపీఎల్ 2022 సీజన్‌లో సూర్య గాయంతో బాధపడుతూ 6 మ్యాచులు ఆడలేదు. ఇది టీమ్ పర్పామెన్స్‌ని తీవ్రంగా దెబ్బ తీసింది. ఈసారి సూర్య ఫిట్‌గా ఉన్నా, ఫామ్‌లో లేదు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో వరుసగా మూడు మ్యాచుల్లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు సూర్యకుమార్ యాదవ్..
 

59

ముంబై బ్యాటర్ ఇషాన్ కిషన్ కూడా ఫామ్‌లో లేడు. ఈ ఏడాది ఇషాన్ కిషన్ సగటు 20 లోపే ఉంది. ఇషాన్ కోసం రూ.16 కోట్లు పెట్టిన ముంబై ఇండియన్స్, గత సీజన్‌లో అతను ఫామ్‌లో లేక కొన్ని మ్యాచుల్లో ఆడించలేదు...
 

69

ముంబై ఇండియన్స్‌కి మ్యాచ్ విన్నర్‌లాంటి కిరన్ పోలార్డ్, రిటెన్షన్‌లో చోటు దక్కలేదని రిటైర్మెంట్ తీసుకున్నాడు. కనీసం కెప్టెన్ రోహిత్ శర్మ అయినా ఫామ్‌లో ఉన్నాడా అంటే అతను కూడా 30-40 చేసి అవుటై పోతున్నాడు...
 

79

అనుభవం ఉన్న ఓవర్‌సీస్ బౌలర్ కానీ, పెద్దగా అనుభవం ఉన్న భారత బౌలర్ కానీ ముంబై ఇండియన్స్ టీమ్‌లో లేడు. జస్ప్రిత్ బుమ్రాతో పాటు జే రిచర్డ్‌సన్ కూడా గాయంతో ఐపీఎల్ 2023 సీజన్‌కి దూరమయ్యాడు...

89

ఇన్ని ఇబ్బందుల మధ్య ముంబై ఇండియన్స్, ఐపీఎల్ 2023 సీజన్ టైటిల్ గెలవాలంటే మ్యాజిక్ జరగాల్సిందే. టీమిండియా కెప్టెన్ అయ్యాక ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై అట్టర్ ఫ్లాప్ అయ్యింది...

99

 ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్‌ 2022లోనూ అదే సీన్ రిపిట్ అయ్యింది. ఈసారి ముంబై ఇండియన్స్, ఐపీఎల్‌లో సక్సెస్ అయితే ఆ జోష్... ఆ తర్వాత జరిగే ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్, 2023 వన్డే వరల్డ్ కప్‌లోనూ కనిపించొచ్చు.. మొత్తానికి 2023 సీజన్ రోహిత్ శర్మ కెప్టెన్సీకి అసలు సిసలైన పరీక్ష.. 

click me!

Recommended Stories