9 ఫ్రాంఛైజీలకు ఆడాడు! ఒక్కరైనా రిటైన్ చేసుకున్నారా... అదీ అతని ఆట! ఆరోన్ ఫించ్‌ని ట్రోల్ చేసిన...

Published : Mar 24, 2023, 01:52 PM IST

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఫ్రాంఛైజీలకు ఆడిన ప్లేయర్ ఆసీస్ మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్. 2010లో రాజస్థాన్ రాయల్స్ తరుపున ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన ఆరోన్ ఫించ్, ఆ తర్వాత ఢిల్లీ, పూణే వారియర్స్, సన్‌రైజర్స్, ముంబై, గుజరాత్ లయన్స్, పంజాబ్ కింగ్స్, బెంగళూరు, కోల్‌కత్తా... ఇలా సీఎస్‌కే తప్ప దాదాపు అన్ని టీమ్స్ తరుపున ఆడేశాడు...

PREV
15
9 ఫ్రాంఛైజీలకు ఆడాడు! ఒక్కరైనా రిటైన్ చేసుకున్నారా... అదీ అతని ఆట! ఆరోన్ ఫించ్‌ని ట్రోల్ చేసిన...

ఢిల్లీ క్యాపిటల్స్‌, గుజరాత్ జెయింట్స్ తరుపున రెండు సీజన్లు ఆడిన ఆరోన్ ఫించ్, ఆ తర్వాత ఏ టీమ్‌లోనూ రెండేళ్లు ఆడలేకపోయాడు. 2022లో కేకేఆర్ తరుపున ఆడిన ఆరోన్ ఫించ్, అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నాడు..

25

టీ20ల్లో ఆరోన్ ఫించ్‌కి ఘనమైన రికార్డు ఉంది. ఆస్ట్రేలియా తరుపున 76 టీ20 మ్యాచులు ఆడిన ఆరోన్ ఫించ్, 40 మ్యాచులు గెలిచాడు. ఫించ్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా, 2021 టీ20 వరల్డ్ కప్ కూడా గెలిచింది..

35

అంతర్జాతీయ క్రికెట్‌లో 103 టీ20 మ్యాచులు ఆడిన ఆరోన్ ఫించ్, 2 సెంచరీలతో 3120 పరుగులు చేశాడు. జింబాబ్వేతో జరిగిన టీ20 మ్యాచ్‌లో 172 పరుగులు చేసిన ఆరోన్ ఫించ్, పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ప్లేయర్‌గానూ రికార్డు క్రియేట్ చేశాడు...

45

‘ఆరోన్ ఫించ్ 9 ఫ్రాంఛైజీల తరుపున ఆడాడు. అంతకంటే అద్భుతమైన విషయం ఏంటంటే ఒక్క టీమ్ కూడా అతన్ని రిటైన్ చేసుకోలేదు. అతను అంత బాగా ాడాడు మరి...’ అంటూ కామెంట్ చేశాడు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ పాల్ కాలింగ్‌వుడ్..

55

 ఈ వ్యాఖ్యలపై అక్కడే ఉన్న ఆరోన్ ఫించ్ ముసిముసి నవ్వులు నవ్వాడు.. ‘అవును.. అవును.. నాకు తెలుసు.. ’ అంటూ నవ్వుతూ సమాధానం చెప్పాడు ఆరోన్ ఫించ్. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్న ఆరోన్ ఫించ్, ఐపీఎల్ 2023 సీజన్‌లో కామెంటేటర్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు..

click me!

Recommended Stories