IND vs PAK: పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్ ఊసే లేదు.. 2027 వరకు ఐసీసీ, ఏసీసీ టోర్నీలలోనే..!

Published : Oct 14, 2022, 10:52 AM IST

IND vs PAK T20: ఏడాదికోసారో, రెండేండ్లకోసారో జరిగే భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కోసం  ఇరు దేశాల క్రికెట్ అభిమానులతో పాటు ప్రజలు కూడా  ఆసక్తిగా ఎదురుచూస్తారు. కానీ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు ఇప్పట్లో లేవని  తేలిపోయింది. 

PREV
16
IND vs PAK: పాకిస్తాన్‌తో ద్వైపాక్షిక సిరీస్ ఊసే లేదు.. 2027 వరకు ఐసీసీ, ఏసీసీ టోర్నీలలోనే..!

టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్న తరుణంలో   చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ కోసం  ఇరు దేశాల క్రికెట్ అభిమానులే గాక ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులు  ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ ద్వారానే భారత్ ప్రపంచకప్ వేటను మొదలుపెట్టనుంది. 

26

ఇదిలాఉండగా ఇరు జట్ల మధ్య అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ), ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) తప్ప ద్వైపాక్షిక సిరీస్ లు నిర్వహించడం లేదు. రాజకీయ, సరిహద్దు వివాదాలతో 2013 నుంచి రెండు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. అయితే  వచ్చే ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ (ఎఫ్‌టీపీ) లో అయినా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు ఉంటాయని ఆశించిన క్రికెట్ అభిమానులకు నిరాశే ఎదురైంది. 

36

2023-2027 ఎఫ్‌టీపీ షెడ్యూల్ కు సంబంధించిన వివరాలను బీసీసీఐ.. రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ లకు పంపించింది. ఈ నాలుగేండ్ల కాలంలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ల ఊసే లేదు.  

46

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ లో వచ్చిన కథనం మేరకు.. అన్ని రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ లకు భారత్.. స్వదేశంతో పాటు విదేశాలలో ఆడే సిరీస్ లకు సంబంధించిన షెడ్యూల్ ను నోట్ లో పొందుపరిచారు. ఇందులో భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ లను  ‘ఖాళీగా’ వదిలేసింది.

56

 అయితే భారత్-పాక్ మధ్య సిరీస్ లు నిర్వహించేది తామే అయినా తుది నిర్ణయం మాత్రం కేంద్ర ప్రభుత్వానిదే అని  బీసీసీఐ ఇదివరకే  పలుమార్లు తెలిపింది. దీంతో బంతి తమ కోర్టులో లేదని, అది ప్రభుత్వం  నిర్ణయమని బీసీసీఐ చెప్పకనే చెప్పింది. 

66

ఈ ఎఫ్‌టీపీలో భారత్.. 38 టెస్టులు (20 స్వదేశంలో, 18 విదేశాలలో), 42 వన్డేలు (స్వదేశం, విదేశాలలో 21 చొప్పున),  61 టీ20 (31 భారత్ లో, 31 విదేశాలలో) ఆడనుంది. గత ఎఫ్‌టీపీ (2018-2022) తో పోలిస్తే రాబోయే నాలుగేండ్లలో భారత్ ఆడబోయే మ్యాచ్ ల సంఖ్య (గతంలో 163, ఇప్పుడు 141) తగ్గింది. అయితే భారత్ లో ఐపీఎల్ తో పాటు వివిధ దేశాలలో నిర్వహిస్తున్న ఫ్రాంచైజీ క్రికెట్ వల్ల అంతర్జాతీయ మ్యాచ్ ల సంఖ్య గణనీయంగా తగ్గింది.

click me!

Recommended Stories