KKRvsSRH: అదరగొట్టిన నితీశ్ రాణా, రాహుల్ త్రిపాఠి... సన్‌రైజర్స్ ముందు భారీ టార్గెట్...

First Published Apr 11, 2021, 9:14 PM IST

టాస్ ఓడి, తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 187 పరుగుల భారీ స్కోరు చేసింది. నితీశ్ రాణా 80 పరుగులు చేయగా రాహుల్ త్రిపాఠి మెరుపు హాఫ్ సెంచరీ చేశాడు...

నితీశ్ రాణా, శుబ్‌మన్ గిల్ కలిసి తొలి వికెట్‌కి 53 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 13 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 15 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్‌ను రషీద్ ఖాన్ క్లీన్‌బౌల్డ్ చేశాడు...
undefined
రాహుల్ త్రిపాఠి, నితీశ్ రాణా కలిసి సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. వరుస బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు...
undefined
రెండో వికెట్‌కి 93 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత 29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 పరుగులతో మెరుపు హాఫ్ సెంచరీ చేసుకున్న రాహుల్ త్రిపాఠీ, నటరాజన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 146 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది కేకేఆర్...
undefined
వస్తూనే బౌండరీ కొట్టిన ఆండ్రే రస్సెల్ 5 పరుగులకే రషీద్ ఖాన్ బౌలింగ్‌లో మనీశ్ పాండేకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...
undefined
ఆ తర్వాత కొద్దిసేపటికే 56 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 80 పరుగులు చేసిన నితీశ్ రాణా, మహ్మద్ నబీ బౌలింగ్‌లో విజయ్ శంకర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
undefined
గత ఆరు ఇన్నింగ్స్‌ల్లో మూడు సార్లు డకౌట్ అయిన నితీశ్ రాణా, మూడు ఇన్నింగ్స్‌ల్లో 80+ స్కోర్లు చేయడం విశేషం. 2019 నుంచి ఐపీఎల్‌లో 80+ స్కోరు చేయడం నితీశ్ రాణాకి ఇది నాలుగోసారి...
undefined
నితీశ్ రాణా అవుటైన తర్వాతి బంతికే భారీ షాట్‌కి ప్రయత్నించిన కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, అబ్దుల్ సమద్‌ బౌండరీ లైన్ దగ్గర గాల్లోకి ఎగురుతూ పట్టిన అద్భుతమైన క్యాచ్‌కి అవుట్ అయ్యాడు...
undefined
ఆఖరి ఓవర్‌లో దినేశ్ కార్తీక్ 9 బంతుల్లో ఓ సిక్స్, రెండు ఫోర్లతో 22 పరుగులు రాబట్టగా షకీబ్ అల్ హసన్ 3 పరుగులు చేసి భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు..
undefined
click me!