ఆ రోజు ధోనీని రాహుల్ ద్రావిడ్ కోపడ్డాడు... షాకింగ్ విషయం బయటపెట్టిన వీరేంద్ర సెహ్వాగ్...

First Published Apr 11, 2021, 8:51 PM IST

టీమిండియా మాజీ క్రికెటర్ ‘ది వాల్’ రాహుల్ ద్రావిడ్ చాలా కూల్ అండ్ కామ్. రాహుల్ ద్రావిడ్ కోపడ్డడం, కోపంగా అరవడం చాలా అరుదుగా చూసి ఉంటారు అభిమానులు. అందుకే రాహుల్ ద్రావిడ్‌ను కోపిస్టుగా చూపిస్తూ చేసిన యాడ్‌కి విశేషమైన ఆదరణ వస్తోంది... 

మహేంద్ర సింగ్ ధోనీ టీమిండియాలోకి వచ్చిన కొత్తలో... రాహుల్ ద్రావిడ్‌ అతనిపై కోపడ్డాడని ఎవ్వరికీ తెలియని విషయాన్ని బయటపెట్టాడు టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్...
undefined
‘నేను రాహుల్ ద్రావిడ్ ఆగ్రహాన్ని ఇంతకుముందు కూడా చూశాను... మేం అప్పట్లో పాక్ పర్యటనకు వెళ్లాం. మహేంద్ర సింగ్ ధోనీ, అప్పుడే జట్టులోకి కొత్తగా వచ్చాడు...
undefined
పాక్ పర్యటనలో ధోనీ ఓ భారీ షాట్ ఆడబోయాడు. అయితే పాయింట్‌లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు మాహీ. దీంతో ధోనీపై రాహుల్ ద్రావిడ్ తీవ్ర ఆగ్రహం చూపించాడు..
undefined
‘‘ఇలాగేనా నువ్వు ఆడాల్సింది... నువ్వు క్రీజులో ఉండి, మ్యాచ్‌ను ముగించాలి...’’ అంటూ ఇంగ్లీషులో తిడుతూనే ఉన్నాడు రాహుల్ ద్రావిడ్... నాకు ద్రావిడ్ భాయ్ మాటల్లో సగం అర్థం కాలేదు కూడా...
undefined
ఆ రోజు తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్‌కి వచ్చినప్పుడు షాట్స్ ఆడకుండా, డిఫెన్స్ ఆడుతుండడం చూశా... ‘ఏమైంది... ఎందుకిలా ఆడుతున్నావు?’ అని అడిగాను..
undefined
దానికి ధోనీ... ‘మళ్లీ రాహుల్ భాయ్‌తో తిట్టు తినడం నాకు ఇష్టం లేదు... నేను చివరిదాకా ఉండి గేమ్‌ను ఫినిష్ చేస్తాను’’ అని చెప్పాడు. ఆ తర్వాత మాహీ ఆటలో మార్పు కూడా చూశాను’’ అంటూ చెప్పుకొచ్చాడు వీరేంద్ర సెహ్వాగ్...
undefined
భారత ప్రస్తుత సారథి విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రావిడ్ కోపిష్టిగా నటించిన యాడ్ చూసిన తర్వాత ‘రాహుల్ భాయ్‌లో ఈ యాంగిల్ నేనెప్పుడూ చూడలేదు’ అంటూ కామెంట్ చేసిన విషయం తెలిసిందే...
undefined
సౌరవ్ గంగూలీన కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించిన తర్వాత రాహుల్ ద్రావిడ్‌కి టీమిండియా కెప్టెన్సీ దక్కిన విషయం తెలిసిందే.. ద్రావిడ్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత ధోనీకి టీమిండియా సారథ్యం దక్కింది...
undefined
టీమిండియా మాజీ ప్లేయర్ దొడ్డ గణేశ్ కూడా రాహుల్ ద్రావిడ్ కోపాన్ని రియల్‌గా చూశానంటూ... 1997 నాటి వీడియోను పోస్టు చేశాడు. కర్ణాటక, హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పెవిలియన్ నుంచి ద్రావిడ్, క్రీజులో ఉన్న బ్యాట్స్‌మెన్‌కు కోపంగా అరుస్తూ బౌండరీ బాదమని చెప్పడం కనిపించింది.
undefined
బ్యాట్స్‌మెన్‌గా, కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా, కోచ్‌గా, మెంటర్‌గా, ఎన్‌సీఏ డైరెక్టర్‌గా నిరూపించుకున్న రాహుల్ ద్రావిడ్, తనలో మంచి నటుడు కూడా ఉన్నాడంటూ ఒక్క యాడ్‌తో ప్రపంచాన్ని ఆశ్చర్యపోయేలా చేశాడు.
undefined
click me!