Nitish Kumar Reddy : మన రెడ్డిగారు రెచ్చిపోయారో ... బౌలర్లకు దబిడిదిబిడే
Indian Premier League 2025 : మన తెలుగు క్రికెట్ నితీష్ కుమార్ రెడ్డి మన తెలుగు టీం కీలక ఆటగాడిగా మారిపోయాడు. ఈ ఐపిఎల్ లో కూడా అతడు రెచ్చిపోతే ప్రత్యర్థి బౌలర్లకు దబిడిదిబిడే.
Indian Premier League 2025 : మన తెలుగు క్రికెట్ నితీష్ కుమార్ రెడ్డి మన తెలుగు టీం కీలక ఆటగాడిగా మారిపోయాడు. ఈ ఐపిఎల్ లో కూడా అతడు రెచ్చిపోతే ప్రత్యర్థి బౌలర్లకు దబిడిదిబిడే.
నితీష్ కుమార్ రెడ్డి : తెలుగోడి సత్తాను ప్రపంచానికి చాటిచెప్పిన యువ సంచలనం ... గత ఐపిఎల్ సీజన్ లో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్ప్ లు ఆడి సన్ రైజర్స్ హైదరాబాద్ కు అద్భుత విజయాలు అందించాడు. దీంతో ఒక్కసారిగా నితీష్ రెడ్డి స్టార్ అయిపోయాడు... ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది అవార్డ్ ను అందుకున్నాడు.
ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా జట్టును గెలిపించుకోగలనని నితీష్ నిరూపించాడు. అతడి ధనాధన్ బ్యాటింగ్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది... ఇక మన తెలుగోడే కాబట్టి నితీష్ పై కొంచెం అభిమానం ఎక్కువుంటుంది. అభిమానులు 'నిజాంపేట్ నితీష్' అని ముద్దుగా పిలుచుకుంటారు.
తెలుగోడి ఆటంటే ఆమాత్రం ఉంటుంది...
అతడు క్రీజులో కుదురుకుని అలవోకగా బౌండరీలు బాదుతుంటే మెల్లిగా మ్యాచ్ ప్రత్యర్థుల చేతిలోంచి జారిపోతుంది. ఇక నితీష్ పూనకం వచ్చినట్లు ఆడాడో అంతే సంగతి... గ్రౌండ్ చిన్నబోవడం, ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు కనిపించడం ఖాయం.
విశాఖపట్నం గల్లీల్లో ఆడిన నితీష్ రెడ్డి ఇప్పుడు అంతర్జాతీయ క్రికెటర్ గా ఎదగడం తెలుగోళ్ళు సంబరపడే విషయం. నితీష్ ఆట చూసినవారు భవిష్యత్ లో స్టార్ క్రికెటర్ అవుతాడని అంటుంటారు. తన ఇంతటి గుర్తింపుఇచ్చిన సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకు ఈసారి ఎలాగైన ఐపిఎల్ ట్రోఫీ అందించాలనే పట్టుదలతో నితీష్ ఉన్నాడు.
నితీష్ రెడ్డి ఐపిఎల్ కెరీర్ :
మన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి తెలుగు టీం సన్ రైజర్స్ హైదరాబాద్ లో కీలక ఆటగాడిగా మారాడు. గత ఐపిఎల్ లో అద్భుత ప్రదర్శనతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు నితీష్. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన అతడు విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో అతడి ఈసారి వేలంలోకి వదిలిపెట్టకుండా భారీ మొత్తం చెల్లించి రిటైన్ చేసుకుంది సన్ రైజర్స్ టీం.
గతేడాది ఐపిఎల్ లో ఆరంగేంట్రం చేసిన నితీష్ కుమార్ 13 మ్యాచులాడి 303 పరుగులు చేసాడు. ఇందులో 21 ఫోర్లు 15 సిక్సర్లు ఉన్నాయి. ఐపిఎల్ లో అతడి హయ్యెస్ట్ స్కోర్ 76 నాటౌట్. ఇలా ఇతడి ఐపిఎల్ కెరీర్ లో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆల్ రౌండర్ అయినప్పటికీ బౌలింగ్ లో పెద్దగా ప్రభావం చూపించలేదు... గత సీజన్ లో కేవలం 3 వికెట్లు మాత్రమే పడగొట్టాడు.