Abhishek Sharma
అభిషేక్ శర్మ : ఇతడు చూసేందుకు పాలబుగ్గల కుర్రాడిలా ఉంటాయి ... కానీ ఆట అరాచకం. బ్యాట్ పట్టుకుని మైదానంలోకి వెళ్లి చిన్న యుద్దమే చేస్తాడు. ఒక్కోసారి బలాన్నంతా ఉపయోగించి బంతిని బాదితే అది వెళ్లి బౌండరీ అవతల పడుతుంది... మరోసారి బంతిని చాలా టెక్నిక్ గా బౌండరీ దాటిస్తాడు... ఎలా ఆడినా బంతిని బౌండరీ దాటించడమే అతడి లక్ష్యం. ఇలా మరో ఓపెనర్ హెడ్ తో కలిపి ప్రత్యర్థులకు ఎన్నోసార్లు హెడెక్ తెప్పించే ఇన్నింగ్స్ ఆడాడు అభిషేక్. అతడు క్రీజులు కుదురుకుని ఆడుతుంటే ఇక ప్రత్యర్థి బౌలర్లు షేక్ కావాల్సిందే.
సన్ రైజర్స్ హైదరాబాద్ కు దక్కిన వరం అభిషేక్ శర్మ అని చెప్పవచ్చు. ఐపిఎల్ అతడి ధనాధన్ బ్యాటింగ్ కు భారత సెలెక్టర్లు కూడా ఫిదా అయ్యారు. అందువల్లే టీమిండియాలో చోటు కల్పించారు. మరి ఫ్యాన్స్ ఫిదా కాకుండా ఉంటారు... అదీ మన హైదరాబాద్ టీం తరపును ఆడుతుంటే. అతడిని నెత్తినపెట్టుకుని చూసుకుంటున్నారు తెలుగు ఫ్యాన్స్.
Indian Premier League 2025
అభిషేక్ ఆడితే అట్లుంటది...
గత ఐపిఎల్ సీజన్ లో ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన అభిషేక్ ఈసారి కూడా అదేస్థాయిలో ఆడేందుకు సిద్దమయ్యాడు. మాస్ హిట్టింగ్ ను, క్లాస్ బ్యాటింగ్ ను లోడ్ చేసుకుని వచ్చాడు. గ్రౌండ్ లో వాటిని డెలివరీ చేయనున్నారు. అన్నీ కుదిరితే అభిషేక్ నుండి అదిరిపోయే ఇన్నింగ్స్ లు చూస్తాం.
అభిషేక్ శర్మను తెలుగు క్రికెట్ ఫ్యాన్స్ తమవాడిగా భావిస్తారు. 'అత్తాపూర్, అంబర్ పేట్, అమీర్ పేట్ అభిషేక్' అంటూ ముద్దుగా పిలుచుకుంటారు. ఈసారి అతడినుండి బుల్లెట్ వేగంతో దూసుకెళ్లే షాట్లు ఇంకా బాకీ ఉన్నాయి. అతడు శివాలెత్తినట్లు ఆడే ఇన్నింగ్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఫ్యాన్స్ కోరిక ఏమోగాని అభిషేక్ ఒక్కసారి జూలు విధిస్తే ప్రత్యర్థి బౌలర్లు భయంతో వణికిపోవాల్సిందే. 'వీడు మనిషా... మానవ మృగమా' అన్నట్లుంది అభిషేక్ రెచ్చిపోతే.
IPL 2025
అభిషేక్ ఐపిఎల్ కెరీర్ :
అభిషేక్ శర్మ ఐపిఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్. హెడ్ తో కలిసి బ్యాటింగ్ ను ప్రారంభిస్తాడు. ఇతడు 2018 లో ఐపిఎల్ లో ఆరంగేట్రం చేసాడు... అయితే తన కెరీర్ లోనే అత్యుత్తమ గణాంకాలను గతేడాది నమోదుచేసుకున్నాడు. ఐపిఎల్ 2024 లో 16 మ్యాచులాడిన ఈ 25 ఏళ్ల కుర్రాడు మూడు హాఫ్ సెంచరీలతో 484 పరుగులు చేసాడు. ఈ సీజన్ లో హయ్యెస్ట్ పరుగులు సాధించిన ఆటగాళ్ళలో ఇతడు ఒకడు.
మొత్తం ఇప్పటివరకు ఐపిఎల్ లో 1,401 పరుగులు పూర్తిచేసుకున్నాడు అభిషేక్. ఇతడు ఇప్పటికే 133 బౌండరీలు, 73 సిక్సర్లు బాదాడు. ఈ ఐపిఎల్ 2025 లో కూడా మరోసారి విధ్వంసకర బ్యాటింగ్ తో అదరగొడతాడని సన్ రైజర్స్ ఫ్యాన్స్ అభిషేక్ శర్మపై నమ్మకం పెట్టుకున్నారు.