భారత్ తరఫున అరుణ్ లాల్ 16 టెస్టులు, 16 వన్డేలు ఆడాడు. 1982-89 మధ్యకాలంలో జాతీయ జట్టుకు ఆడిన అరుణ్ లాల్.. టెస్టులలో 729 పరుగులు చేశాడు. వన్డేలలో 122 రన్స్ మాత్రమే నమోదు చేశాడు. జాతీయ జట్టులో పెద్దగా రాణించలేకపోయినా ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో మాత్రం అరుణ్ లాల్ మెరుగ్గా ఆడాడు. 156 మ్యాచులాడి.. 10,421 పరుగులు సాధించాడు.