ఎమ్మెస్ ధోనీ సడెన్‌గా వచ్చి ఓపెనింగ్ చేస్తానన్నాడు... నెమ్మదిగా ఆడమని చెప్పి పంపితే...

First Published May 5, 2022, 5:40 PM IST

ఐపీఎల్ 2022 సీజన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఆఖరి సీజన్ కావచ్చని టాక్ బలంగానే వినబడుతోంది. రెండు సీజన్ల నుంచి మాహీ రిటైర్మెంట్ గురించి వార్తలు వస్తున్నా, ఈ సారి స్వయంగా వచ్చే ఏడాది గురించి ఇప్పుడే చెప్పలేనని ప్రకటించాడు. ఈసారి మాహీని టాపార్డర్‌లో కూడా చూసే అవకాశం దొరికింది...

అంతర్జాతీయ కెరీర్ ఆరంభంలో ఓపెనర్‌గానూ వచ్చిన ఎమ్మెస్ ధోనీ, వన్‌డౌన్, టూ డౌన్ ప్లేయర్‌గానూ రాణించాడు. ఐదో స్థానంలో అదరగొట్టి, ఆరో స్థానంలో ప్రత్యర్థి బౌలర్లను ఆరేసిన మాహీ... ఏడో స్థానంలో ఫినిషన్‌గా ఎనలేని కీర్తిని ఘడించాడు...

2004లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన ఎమ్మెస్ ధోనీ, ఆ సమయంలో వివేక్ రాజ్‌దాన్ కెప్టెన్సీలో దులీప్ ట్రోఫీ మ్యాచులు ఆడాడు. ఆ సమయంలో మాహీ యాటిట్యూడ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు వివేక్...

Latest Videos


‘మేం ఆ సమయంలో దులీప్ ట్రోఫీ ఆడుతున్నాం. మ్యాచుల మధ్య ఖాళీ దొరకడంతో సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు వచ్చాడు ధోనీ. ఆ మ్యాచ్‌కి నేనే కెప్టెన్...

టాస్ గెలిచిన వెంటనే బౌలింగ్ ఎంచుకున్నాం. పిచ్ బౌలర్లకు బాగా సహకరించేలా ఉందని అర్థమైంది, పచ్చికతో ఎలా స్పందింస్తుందో కూడా అర్థం కాలేదు.. కొన్ని ఓవర్ల తర్వాత పిచ్ ప్రమాదకరంగా ఉందని తెలిసొచ్చింది.

ప్రమాదకర బౌన్సర్లు, లో బాల్స్‌తో ఏ సమయంలో ఎలాంటి బంతి వస్తుందో అర్థం కాని పరిస్థితి. ప్రత్యర్థి జట్టు ఎలాగోలా 40 ఓవర్లలో 150-55 పరుగుల స్కోరు చేయగలిగింది...

అప్పుడు క్లబ్స్‌కి డ్రెస్సింగ్ రూమ్‌లు లేవు. టెంట్ల కింద కూర్చొనేవాళ్లం. సీనియర్ ప్లేయర్ ఓపెనింగ్ చేస్తాడని అనుకుంటున్నాం. కానీ సడెన్‌గా ధోనీ లేచి, నేను ఓపెనింగ్ చేయాలనుకుంటున్నా, వెళ్లనా? అని అడిగాడు...

పిచ్‌ పరిస్థితిని చూసిన తర్వాత కూడా ఓపెనింగ్ చేయాలని కోరుకున్న అతని నమ్మకాన్ని చూసి షాక్ అయ్యాం. నేను మరేం ఆలోచించకుండా వెళ్లమని చెప్పా. కొంతమంది ఛాలెంజ్‌లు తీసుకోవడానికి భయపడతారు, మరికొంత మంది ఛాలెంజ్‌లు స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు. మాహీ రెండో రకం...

పిచ్ బాగోలేదు కాబట్టి నెమ్మదిగా జాగ్రత్తగా బ్యాటింగ్ చేయాలని మేం అనుకున్నాం. అయితే మాహీ మ్యాచ్‌ వేరేలా ఆలోచించాడు. జడేజాతో కలిసి ఓపెనింగ్ వికెట్‌కి 120 పరుగులు జోడించాడు. అందులో మాహీ చేసిందే 93 పరుగులు...

ప్రమాదకరంగా ఉన్న పిచ్‌పై ఎంతో ఈజీగా బౌండరీలు బాదాడు, 15 ఓవర్ల పాటు క్రీజులో కుదురుకొమ్మంటే, మ్యాచ్‌నే ఫినిష్ చేసేశాడు... మాహీ ఆడుతున్న విధానం చూసి అంతా షాక్ అయ్యారు. 

‘ఎవరీ కుర్రాడు’ అంటూ అడిగాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా మాహీ ఏం మారలేదు...’ అంటూ చెప్పుకొచ్చాడు వివేక్ రాజ్‌దాన్.. 

click me!