TATA IPL 2022: టీమిండియా వెటరన్ వికెట్ కీపర్, ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్న వృద్ధిమాన్ సాహా.. తాను ఎవరి మెప్పు కోసమో మ్యాచులు ఆడనని అంటున్నాడు. అలా ఆడటం తనకు నచ్చదని చెప్తున్నాడు.
గత సీజన్ వరకు సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడి ఐపీఎల్-15లో గుజరాత్ టైటాన్స్ తో జట్టుకట్టాడు టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా.. తొలుత పలు మ్యాచులు ఆడకపోయినా తర్వాత అదిరిపోయే ఆటతీరుతో ఏకంగా ఇన్నింగ్స్ ఓపెన్ చేసే స్థాయికి వెళ్లాడు..
28
ఓపెనర్ గా దిగుతూ పవర్ ప్లేలో దుమ్ము రేపుతున్న సాహా.. తాను ఎవరి ముందు షో ఆఫ్ చేయడానికి ఆడనని, తన ధ్యాసంతా జట్టు విజయం కోసమే అని చెప్పుకొచ్చాడు.
38
తాజాగా ఓ క్రీడా ఛానెల్ తో మాట్లాడుతూ.. ‘నేను ఎవరి మెప్పు కోసం ఆడను. నేను గ్రౌండ్ లో అడుగుపెట్టినప్పుడు నా మైండ్ లో ఒకటే ఉంటుంది. నా జట్టును గెలిపించాలి. అంతే. అదే మైండ్ తో ఉంటా.
48
సన్ రైజర్స్ తో మ్యాచ్ సమయంలో మేము 200కు పైగా పరుగులు ఛేదించాలి. ఆ సమయంలో నెమ్మదిగా ఆడితే తర్వాత వచ్చే బ్యాటర్లకు కష్టమవుద్ది. అందుకే ధాటిగా ఆడా. పవర్ ప్లే లో వీలైనన్ని ఎక్కువ పరుగులు రాబట్టా.
58
ఇక నేను బ్యాటింగ్ కు వచ్చేప్పుడు స్పష్టమైన మైండ్ తో ఉంటా. ఈ బౌలర్ ఇలాగే బౌలింగ్ చేస్తాడని ప్రత్యేకించి ప్రణాళికలు వేసుకుని రాను. అలా వస్తే అప్పుడు బౌలర్లు మరో విధంగా బౌలింగ్ చేస్తే అది మొదటికే మోసం. నేను సరిగా ఆడలేను. అందుకే బౌలర్ ఎవరు..? ఎలా వేస్తాడు..? ఇలాంటి లెక్కలన్నీ నేను పట్టించుకోను..’ అని తెలిపాడు.
68
సన్ రైజర్స్ తో మ్యాచ్ లో 200 కు పైగా పరుగుల లక్ష్య ఛేదనలో 38 బంతులాడిన సాహా.. 11 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 68 పరుగులు చేశాడు. గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
78
ఇక ఈ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఇప్పటివరకు 5 మ్యాచులాడి 154 పరుగులు చేశాడు. ఒకవైపు ఎన్నో ఆశలు పెట్టుకున్న గిల్ విఫలమవుతుండగా.. మరోవైపు వయసు అయిపోయిందని బీసీసీఐ పక్కనబెట్టిన సాహా మాత్రం అదరగొడుతుండటం విశేషం.
88
తాను ఆండ్రీ రసెల్, ఎంఎస్ ధోనిలా భారీ షాట్లు ఆడలేనని, కానీ పవర్ ప్లేలో మాత్రం తన జట్టు కోసం త్వరగా పరుగులు సాధించగల సత్తా తనకు ఉన్నదని సాహా తెలిపాడు. రాబోయే మ్యాచులలో కూడా అత్యుత్తమంగా ఆడేందుకు కృషి చేస్తానని చెప్పుకొచ్చాడు.