పాక్‌పై భారీ విజయం... టెస్టు ర్యాంకింగ్‌లో టాప్‌కి దూసుకెళ్లిన న్యూజిలాండ్... టీమిండియాకు చావోరేవో...

First Published Jan 6, 2021, 10:14 AM IST

పాకిస్థాన్‌తో జరిగిన రెండో టెస్టులో ఇన్నింగ్స్‌ 176 పరుగుల తేడాతో భారీ విజయం సొంతం చేసుకుంది ఆతిథ్య న్యూజిలాండ్. ఈ విజయంతో 2-0 తేడాతో టెస్టు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయడమే కాకుండా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్ ప్లేస్‌కి దూసుకెళ్లింది న్యూజిలాండ్. వరుస సెంచరీలతో కివీస్ కెప్టెన్ కేన్ విలియంసన్ ఇప్పటికే టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో ఉన్న విషయం తెలిసిందే.

కేన్ విలియంసన్ డబుల్ సెంచరీతో 238 పరుగులు, హెన్రీ నికోలస్ 157 పరుగులు, డేరీ మిచెల్ 102 పరుగులు చేయడంతో మొదట ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 659 పరుగుల భారీ స్కోరు చేసి డిక్లేర్ చేసింది న్యూజిలాండ్.
undefined
మొదటి ఇన్నింగ్స్‌లో 297 పరుగులకి ఆలౌట్ అయిన పాకిస్తాన్, రెండో ఇన్నింగ్స్‌లో 186 పరుగులకే చాప చుట్టేసింది. అజర్ ఆలీ, జోఫర్ గోహర్ చేసిన 37 పరుగులే పాక్ ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోర్లు.
undefined
న్యూజిలాండ్ కెప్టెన్ విలియంసన్ 3 ఓవర్లు బౌలింగ్ చేసి, షాహీన్ ఆఫ్రిదీ వికెట్ తీసుకోవడం విశేషం. కేన్ విలియంసన్‌కి టెస్టుల్లో ఇదే మొట్టమొదటి వికెట్...
undefined
టెస్టుల్లో వరుసగా ఆరు విజయాలు అందుకుంది న్యూజిలాండ్. టీమిండియాను రెండు టెస్టుల్లో చిత్తు చేసిన కివీస్, ఆ తర్వాత వెస్టిండీస్‌ను, పాక్‌ను క్లీన్‌స్వీప్ చేసింది...
undefined
వరుసగా ఆరు టెస్టుల్లో గెలవడం న్యూజిలాండ్‌కి ఇదే తొలిసారి. అయితే న్యూజిలాండ్ గెలిచిన విజయాలన్నీ స్వదేశంలో దక్కినవే కావడం కొసమెరుపు...
undefined
పాక్‌పై దక్కిన విజయంతో 118 పాయింట్లు సాధించిన న్యూజిలాండ్... ఐసీసీ టెస్టు టీమ్ ర్యాంకింగ్స్‌లో టాప్‌లోకి దూసుకెళ్లింది... ఆస్ట్రేలియా 116, ఇండియా 114 పాయింట్లతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.
undefined
నెం.1 బ్యాట్స్‌మెన్, నెం.1 టీమ్ రెండూ ఒకే జట్టుకి దక్కడం ఇదే తొలిసారి. కెప్టెన్ కేన్ విలియంసన్ ముందుండి కివీస్‌కి అద్భుత విజయాలను అందించాడు...
undefined
పాక్‌పై దక్కిన విజయాలతో టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 420 పాయింట్లు ఖాతాలో వేసుకుంది న్యూజిలాండ్. 70 శాతం విజయాలతో మూడో స్థానంలో ఉంది కివీస్...
undefined
76.7 విజయాలతో ఆస్ట్రేలియా టాప్‌లో ఉండగా, 72.2 శాతం విజయాలతో టీమిండియా రెండో స్థానంలో ఉంది. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే మూడో టెస్టు విజయం ఈ రెండు జట్లకీ కీలకం కానుంది.
undefined
click me!