ఐపీఎల్ కొత్త ఫ్రాంఛైజీలకు బేస్ ప్రైజ్ నిర్ణయించిన బీసీసీఐ... ఎంతంటే...

First Published Jan 6, 2021, 9:55 AM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 సీజన్లుగా క్రికెట్ ఫ్యాన్స్‌ను ఊర్రూతలూగిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన ఈ లీగ్‌ను విస్తరించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మొదట ఈ ఏడాది నుంచి అదనపు జట్లను చేర్చాలని భావించినా, సమయం తక్కువగా ఉండడంతో ఆ నిర్ణయాన్ని వచ్చే సీజన్‌కి (2022) వాయిదా వేసింది. అయితే ఐపీఎల్‌లో కొత్తగా చేరే జట్లను బేస్ ప్రైజ్ నిర్ణయించింది బీసీసీఐ.

2022 ఐపీఎల్ సీజన్‌లో అదనంగా రెండు జట్లను చేర్చాలని నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. నెల రోజుల కిందట జరిగిన వార్షిక మీటింగ్‌లో దీనికి ఆమోదం కూడా దొరికింది.
undefined
వచ్చే ఏడాది అదనంగా చేరబోయే ఒక్కో జట్టు కనీసం రూ. 1500 కోట్లు బేస్ ప్రైజ్ చెల్లించాల్సి ఉంటుంది. అదీగాక రెండేళ్లకు గానూ సేఫ్టీ డిపాజిట్ కూడా చెల్లించాల్సి ఉంటుంది...
undefined
ఈ ఏడాది ఐపీఎల్ 2021 ప్రారంభమైన తర్వాత ఏప్రిల్ నెలలో కొత్త జట్లకు సంబంధించిన టెండర్లను ఆహ్వానిస్తుంది భారత క్రికెట్ బోర్డు...
undefined
కొత్తగా చేరే జట్లలో ఒకటి అహ్మదాబాద్ నగరం పేరుతో ఉండడం ఖాయమని సమాచారం. అహ్మదాబాద్‌లో కొత్తగా నిర్మించిన అతిపెద్ద క్రికెట్ స్టేడియం మొతారా హోం గ్రౌండ్‌గా ఈ టీమ్ మ్యాచులు ఆడుతుంది...
undefined
అలాగే మరో జట్లుగా పూణే ఉంటుందని టాక్ వినిపించింది. అయితే ఒక రాష్ట్రానికి ఒకే ఫ్రాంఛైజీ ఉండాలని బీసీసీఐ నిర్ణయం తీసుకోవడంతో పూణే రేసు నుంచి తప్పుకుంది.
undefined
కొత్తగా చేరే జట్ల కోసం లక్నో, కాన్పూర్ నగరాలు పోటీలో నిలిచే అవకాశం ఉంది... వీటితో పాటు సౌత్ నుంచి మిస్ అయిన ఏకైక రాష్ట్రం కేరళ కూడా బరిలో దిగే అవకాశం ఉంది.
undefined
కేరళ నుంచి ఐపీఎల్‌లో ప్రాతినిధ్యం వహించిన కొచ్చి టస్కర్స్ ఒకే ఏడాది పరిమితమైంది. కాబట్టి మరోసారి కొచ్చిని ఐపీఎల్‌లోకి తీసుకురావాలని భావిస్తున్నాడు మాలీవుడ్ హీరో మోహన్‌లాల్.
undefined
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, ఆన్‌లైన్ లెర్నింగ్ యాప్ బైజూస్‌తో కలిసి కేరళ నుంచి ఓ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయాలని భావిస్తున్నాడని టాక్...
undefined
ఫిబ్రవరి 11న ఐపీఎల్ 2021కు సంబంధించి మినీ వేలం జరగనుంది... ఐపీఎల్ ద్వారా భారత క్రికెట్ బోర్డుకి వేల కోట్ల ఆదాయం చేకూరుతోంది...
undefined
2018 ఏడాది చివరిన బీసీసీఐ విలువ రూ.14,489 కోట్ల రూపాయలు కాగా, 2018 ఐపీఎల్ ద్వారా రూ. 4,017 కోట్ల ఆదాయం ఆర్జించింది బీసీసీఐ..
undefined
click me!