మొదటి టీ20 మ్యాచ్‌లో ఆసీస్‌పై న్యూజిలాండ్ ఘన విజయం... ఐపీఎల్ వేలంలో కోట్లు కొల్లగొట్టిన హీరోలు...

First Published Feb 22, 2021, 3:20 PM IST

న్యూజిలాండ్ టూర్‌ని ఓటమితో ఆరంభించింది ఆస్ట్రేలియా. కివీస్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 53 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. డివాన్ కాన్వే 59 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 99 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు...

మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. మార్టిన్ గుప్టిల్ డకౌట్ కాగా, స్టీఫర్ట్ 1, కేన్ విలియంసన్ 12 పరుగులు చేసి అవుట్ కావడంతో 19 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది న్యూజిలాండ్.
undefined
అయితే డివాన్ కాన్వే 59 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 99 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు...
undefined
గ్లెన్ ఫిలిప్స్ 20 బంతుల్లో 3 సిక్సర్లతో 30 పరుగులు చేయగా జేమ్స్ నిశషమ్ 15 బంతుల్లో 3 ఫోర్లతో 26 పరుగులు చేశాడు.
undefined
ఆఖరి ఓవర్‌లో ఓ సిక్సర్, బౌండరీతో 98 పరుగులకి చేరుకున్న కాన్వే, ఆఖరి బంతికి సింగిల్ తీయడంతో సెంచరీ మిస్ చేసుకున్నాడు...
undefined
185 పరుగుల టార్గెట్‌తో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా, వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి 17.3 ఓవర్లలో 131 పరుగులకి ఆలౌట్ అయ్యింది.
undefined
కెప్టెన్ ఆరోన్ ఫించ్ 1 పరుగకే అవుట్ కాగా జోష్ ఫిలిప్ 2, మాథ్యూ వేడ్ 12 పరుగులు చేశాడు. మిచెల్ మార్ష్ 33 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 45 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలవగా ఆస్టన్ అగర్‌ 13 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 23 పరుగులు చేశాడు.
undefined
నాలుగు ఓవర్లలో 28 పరుగులిచ్చి 4 వికెట్లు తీసిన ఇష్ సోథి, ఆస్ట్రేలియా ఓటమికి ప్రధాన కారణమయ్యాడు. టిమ్ సౌధీ, ట్రెంట్ బౌల్డ్ రెండేసి వికెట్లు తీశారు.
undefined
ఐపీఎల్ వేలంలో రూ.15 కోట్లు దక్కించుకున్న కేల్ జెమ్మిసన్ 3 ఓవర్లు బౌలింగ్ చేసి 22 పరుగులిచ్చి ఓ వికెట్ మాత్రమే తీయగా, రూ.14 కోట్లు దక్కించుకున్న జే రిచర్డ్‌సన్ 4 ఓవర్లలో 31 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు..
undefined
ఆస్ట్రేలియా జట్టులో ఐదుగురు ప్లేయర్లు రాయల్ ఛాలెంజర్స్ ప్లేయర్లు ఉండడం విశేషం. జోష్ ఫిలిప్, మ్యాక్స్‌వెల్, డానియల్ సామ్స్, కేన్ రిచర్డ్‌సన్, ఆడమ్ జంపా ప్రస్తుత ఆర్‌సీబీ జట్టులో సభ్యులు కాగా, ఆరోన్ ఫించ్, స్టోయినిస్ మాజీ సభ్యులు...
undefined
click me!