మేం ఎప్పుడైనా అలా చెప్పామా... మరి వారికి వచ్చిన కష్టమేంటి... రోహిత్ శర్మ కామెంట్...

Published : Feb 22, 2021, 12:18 PM IST

చెన్నై వేదికగా జరిగిన రెండో టెస్టులో ఇంగ్లాండ్ జట్టు, బ్యాటింగ్ చేసేందుకు బాగా ఇబ్బంది పడింది. భారత బ్యాట్స్‌మెన్ ధాటిగా పరుగులు రాబట్టిన చోట, ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ బంతిని ఎదుర్కోవడానికి తెగ ఇబ్బంది పడ్డారు. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు చాలామంది పిచ్‌ బాగోలేదంటూ ఆరోపణలు చేశారు. ఈ విషయంపై స్పందించాడు భారత క్రికెటర్ రోహిత్ శర్మ...

PREV
111
మేం ఎప్పుడైనా అలా చెప్పామా... మరి వారికి వచ్చిన కష్టమేంటి... రోహిత్ శర్మ కామెంట్...

మొదటి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 578 పరుగుల భారీ స్కోరు సాధించింది ఇంగ్లాండ్. కెప్టెన్ జో రూట్ డబుల్ సెంచరీతో పాటు బెన్ స్టోక్స్, సిబ్లీ 80+ స్కోర్లు చేశారు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో పరిస్థితి మారిపోయింది...

211

చెన్నై టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ జట్టు 178 పరుగులకే ఆలౌట్ అయ్యింది. జో రూట్ చేసిన 40 పరుగులే అత్యధిక స్కోరు. అయితే తొలి ఇన్నింగ్స్‌లో దక్కిన ఆధిక్యం కారణంగా ఇంగ్లాండ్‌కి భారీ విజయం దక్కింది...

311

తొలి టెస్టు క్యూరేటర్‌ను తొలగించిన బీసీసీఐ, గ్రౌండ్ మెన్‌తో కలిసి రెండో టెస్టుకి మంచి బౌలింగ్ పిచ్‌ను రూపొందించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 329 పరుగులకి ఆలౌట్ కాగా రోహిత్ శర్మ 162 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, అజింకా రహానే, రిషబ్ పంత్‌లు హాఫ్ సెంచరీలు చేశారు...

411

రెండో ఇన్నింగ్స్‌లో రవిచంద్రన్ అశ్విన్ అద్భుత సెంచరీతో చెలరేగగా విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేశాడు. రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌ల్లోనూ ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ మార్కు చేరుకోలేకపోయారు...

511

తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ 44 పరుగులతో అజేయంగా నిలవగా, రెండో ఇన్నింగ్స్‌లో ఆల్‌రౌండర్ మొయిన్ ఆలీ 43 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీంతో పిచ్‌పై తీవ్రమైన విమర్శలు చేసింది ఇంగ్లాండ్ మీడియా. దీనిపై స్పందించాడు భారత క్రికెటర్ రోహిత్ శర్మ...

611

‘రెండు టీమ్‌లు కూడా ఒకే ప్లేస్‌లో, ఒకే మైదానంలో, ఒకే పిచ్‌పై ఆడుతున్నాయి. అలాంటప్పుడు వారికి వచ్చిన ఇబ్బంది ఏంటి? ఇండియాలో ఎప్పటినుంచే ఇలాంటి పిచ్‌లే తయారుచేస్తున్నారు...

711

ప్రతీ జట్టు స్వదేశంలో హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ తీసుకుంటాయి. విదేశాల్లోకి వెళ్లినప్పుడు మా పరిస్థితి కూడా అదే, కానీ మా గురించి ఎవ్వరూ మాట్లాడరు... 

811

విదేశీ పిచ్‌లపై ఇలా ఆడాలి, అలా ఆడాలి అని చెబుతారు. మరి అలాంటప్పుడు మేం ఎందుకు వాళ్ల గురించి ఆలోచించాలి... మా జట్టుకి ఏది కావాలో మేం అదే చేస్తాం... అదే చేయాలి... 

911

హోం అడ్వాంటేజ్ అంటే అదే. లేకపోతే ఐసీసీకి చెప్పండి, పిచ్ ఇలాగే ఉండాలి, ఇలాగే తయారుచేయాలి... మేం బయటికి వెళ్లినప్పుడు ఇలాగే జరుగుతూ ఉంటుంది. మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారు...

1011

పిచ్ గురించి ఇంత పెద్ద చర్చ జరగాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం... పిచ్ ఎలా ఉండాలో, అలాగే ఉంటుంది. పిచ్ గురించి కాకుండా గేమ్ గురించి మాట్లాడండి, ప్లేయర్ గురించి చర్చించండి..

1111

ప్లేయర్ ఎలా బ్యాటింగ్ చేస్తున్నాడు, బౌలింగ్ ఎలా వేస్తున్నాడు... ఇలాంటి విషయాలపై చర్చ జరిగితే మంచిదే... కానీ పిచ్‌లపైన చర్చ అనవసరం. ఎందుకంటే ఒకే పిచ్‌పై ఇరు జట్లూ ఆడతాయి. ఎవరు బాగా ఆడతారో వాళ్లే గెలుస్తారు...’ అంటూ బోల్డ్ కామెంట్లు చేశాడు రోహిత్ శర్మ...

click me!

Recommended Stories