మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్‌కి అదే కారణం... లేకపోయి ఉంటేనా... మాజీ సెలక్టర్ షాకింగ్ కామెంట్...

First Published Feb 22, 2021, 1:51 PM IST

మహేంద్ర సింగ్ ధోనీ... క్రికెట్ ప్రపంచంలో తిరుగులేని ఫాలోయింగ్ తెచ్చుకున్న క్రికెటర్లలో ఒకడు. కెప్టెన్‌గా భారత జట్టుకు రెండు వరల్డ్‌కప్‌లను అందించిన మాహీ... 2019 వన్డే వరల్డ్‌కప్ తర్వాత క్రికెట్‌కి దూరంగా ఉన్నాడు. 2020 ఐపీఎల్ ప్రారంభానికి ముందు అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్టు షాకింగ్ నిర్ణయాన్ని ప్రకటించాడు....

ఐపీఎల్ 2020 సీజన్ కోసం 20 రోజులు ముందుగానే యూఏఈ చేరిన క్రికెటర్లు, అక్కడ క్వారంటైన్‌లో గడుపుతుండగానే ఆగస్టు 15, 2020న అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్న ఓ వీడియో చేసి తెలిపాడు మహేంద్రసింగ్ ధోనీ...
undefined
యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్‌లాగే ఫేర్‌వెల్ మ్యాచ్ లేకుండానే సైలెంట్‌గా రిటైర్మెంట్ ప్రకటించాడు మహేంద్ర సింగ్ ధోనీ...
undefined

Latest Videos


వాస్తవానికి వన్డే వరల్డ్‌కప్ 2019 సెమీ ఫైనల్‌లో టీమిండియా ఓడిన తర్వాత భారత జట్టుకి దూరంగా గడిపాడు ధోనీ... ధోనీ స్థానంలో రిషబ్ పంత్‌, సంజూ శాంసన్ వంటి ప్లేయర్లకు అవకాశాలు ఇచ్చారు సెలక్టర్లు...
undefined
అయితే షెడ్యూల్ ప్రకారం 2020లో ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్‌లో ఓ సర్‌ప్రైజ్ ఉంటుందని చాలాసార్లు చెప్పాడు భారత సారథి విరాట్ కోహ్లీ. ఆ సర్‌ప్రైజ్ ధోనీయేనని చెప్పుకొచ్చాడు భారత మాజీ సెలక్టర్ శరణ్‌దీప్ సింగ్...
undefined
‘షెడ్యూల్ ప్రకారం 2020లో టీ20 వరల్డ్‌కప్ జరిగి ఉంటే మహేంద్ర సింగ్ ధోనీ, ఆ టోర్నీలో కచ్ఛితంగా ఆడేవాడు. జట్టులో లేకపోయినా ధోనీ ఎప్పుడూ ప్రాక్టీస్‌కి డుమ్మా కొట్టలేదు...
undefined
తప్పనిసరి ప్రాక్టీస్ చేయాలనే నిబంధన లేకపోయినా ధోనీ ప్రాక్టీస్ సెషన్‌లో కనిపించేవాడు... గాయం కారణంగా ధోనీ మ్యాచ్ ఆడని సందర్భాలు చాలా అరుదు... అందుకే ధోనీ అంటే అంత గౌరవం...’ అంటూ చెప్పుకొచ్చాడు శరణ్‌దీప్ సింగ్.
undefined
కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ ఆరు నెలలు ఆలస్యంగా ప్రారంభం కాగా, 2020లో జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్‌ని 2022కి వాయిదా వేశారు. అయితే షెడ్యూల్ ప్రకారం 2021లో జరగాల్సిన సీజన్ మాత్రం ఇండియాలో ఈ ఏడాది చివర్లో జరగనుంది...
undefined
2020 ఐపీఎల్ తర్వాత కూడా మహేంద్ర సింగ్ ధోనీ, పూర్తిగా క్రికెట్ నుంచి దూరమవుతాడని వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. ఈ వార్తల కారణంగానే మిగిలిన జట్ల ప్లేయర్లు, మాహీ సంతకం చేసిన జెర్సీలను తీసుకున్నారు.
undefined
అయితే మాహీ మాత్రం సీఎస్‌కే ఆఖరి మ్యాచ్‌లో ‘డెఫనట్లీ నాట్’ అంటూ ఈ వార్తలను ఖండించాడు.
undefined
click me!