ఆ ఓటమిని ఇంకా మరిచిపోని న్యూజిలాండ్... యూరో 2020లో ఇంగ్లాండ్ ఓటమిపై సెటైర్లు...

Published : Jul 12, 2021, 03:41 PM IST

2019 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ రిజల్ట్... అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ ముగిసి రెండేళ్లు గడుస్తున్నా ఆ పరాజయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు న్యూజిలాండ్ క్రికెటర్లు...

PREV
19
ఆ ఓటమిని ఇంకా మరిచిపోని న్యూజిలాండ్... యూరో 2020లో ఇంగ్లాండ్ ఓటమిపై సెటైర్లు...

2019 వన్డే వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్, టై కావడంతో సూపర్ ఓవర్‌కి దారి తీసింది... 

29

సూపర్ ఓవర్‌లో కూడా స్కోర్లు సమం కావడంతో బౌండరీలు ఎక్కువగా బాదిన ఇంగ్లాండ్‌ని విజేతగా నిర్ణయించారు... బౌండరీల సంఖ్య ఆధారంగా వరల్డ్‌కప్ విజేతను తేల్చడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి...

39

న్యూజిలాండ్ ఫీల్డర్ వేసిన త్రో, బెన్ స్టోక్స్‌ బ్యాటుకి తగిలి బౌండరీకి వెళ్లడంతో ఆరు పరుగులు ఇవ్వడం కూడా చాలా పెద్ద చర్చకు దారి తీసింది... ఇంగ్లాండ్ జట్టు ఛీటింగ్ చేసి వరల్డ్‌కప్ గెలిచిందని తీవ్రమైన ట్రోల్స్ వచ్చాయి. 

49

తాజాగా యూరో 2020 ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు, ఇటలీ చేతుల్లో ఓటమి పాలైంది. పూర్తి సమయం ముగిసేసమయానికి ఇరు జట్లు 1-1 గోల్స్‌తో సమంగా నిలవడంతో విజేతను నిర్ణయించేందుకు పెనాల్టీ షూటౌట్స్‌ను ఎంచుకున్నారు...

59

పెనాల్టీ షూటైట్స్‌లో ఇటలీ జట్లు మూడు గోల్స్ చేయగా, ఇంగ్లాండ్ జట్టు మాత్రం ఆరు అవకాశాల్లో రెండింటినే గోల్స్‌గా మలుచగలిగారు... దీనిపై న్యూజిలాండ్ క్రికెటర్లు కౌంటర్లు వేశారు...

69

‘స్కోరు సమం అయినప్పుడు పెనాల్టీ షూటౌట్ ఎందుకు, ఎవరు ఎక్కువ పాసెస్ చేశారో వారినే విజేతగా ప్రకటించేయొచ్చు కదా... ’ అంటూ ట్వీట్ చేశాడు న్యూజిలాండ్ స్టార్ జెమ్మీ నీశమ్... 

79

ఇంగ్లాండ్ ఫుట్‌బాల్ అభిమానులు హర్ట్ అవుతారని భావించి, ‘జోకింగ్’ అంటూ హ్యాష్‌ట్యాగ్ జత చేశాడు...
న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్, కామెంటేటర్ స్కాట్ స్టైరిస్ కూడా దీనిపై వ్యంగంగా ట్వీట్ చేశాడు. 

89

‘నాకు అర్థం కావట్లేదు. ఇంగ్లాండ్‌కి ఎక్కువ కార్నర్స్ ఉన్నాయి. కాబట్టి వాళ్లే ఛాంపియన్స్...’ అంటూ ట్వీట్ చేసిన స్కాట్ స్టైరిస్... ‘గాయం ఇంకా పచ్చిగానే ఉంది’ అనే అర్థం వచ్చేలా ‘స్టిల్ సాల్టీ’ అంటూ హ్యాష్‌ట్యాగ్ జోడించాడు స్కాట్ స్టైరిస్...

99

యూరో 2020 ఫైనల్‌లో ఇంగ్లాండ్ జట్టు ఓటమిపై ఫుట్‌బాల్ ఫ్యాన్స్ బాగా ఫీల్ అవుతున్నా, న్యూజిలాండ్ అభిమానులు మాత్రం తెగ సంతోషిస్తున్నట్టుగా ఈ ట్వీట్ల ద్వారా తెలుస్తోంది...

click me!

Recommended Stories