T20 World Cup 2024: భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జ‌రిగేది ఇక్క‌డే.. !

Published : Dec 15, 2023, 04:32 PM IST

India v Pakistan: భార‌త్-పాకిస్థాన్ మ‌ధ్య మ్యాచ్ అంటే చాలు ఆ మ‌జానే వేరు. ఇటీవ‌ల ఐసీసీ క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ 2023లో ఇరుజ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. మ‌ళ్లీ ఎప్పుడు ఈ జ‌ట్లు త‌ప‌డ‌తాయా? అని  క్రికెట్ ప్రియులు ఎదురుచూస్తున్నారు.   

PREV
18
T20 World Cup 2024: భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జ‌రిగేది ఇక్క‌డే.. !
India v Pakistan, T20 World Cup 2024

T20 World Cup 2024: క్రికెట్ ప్రియుల‌కు క్రేజీ అప్ డేట్ వ‌చ్చింది. అదేంటంటే రాబోయే టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భార‌త్-పాకిస్థాన్ మ‌ధ్య జ‌రిగే మ్యాచ్ విష‌యం. భార‌త్-పాకిస్థాన్ మ‌ధ్య మ్యాచ్ అంటే మాములు క్రేజ్ ఉండ‌దు. దీని గురించి చిన్నవార్త వ‌స్తే చాలు ప్రాంతం, దేశంతో సంబంధం లేకుండా క్రికెట్ ప్ర‌పంచం ఈ రెండు టీమ్ మ‌ధ్య జ‌రిగే మ్యాచ్ కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తుంది. ఈ క్ర‌మంలోనే రాబోయే వ‌ర‌ల్డ్ క‌ప్ వేదిక‌గా గురించి అప్డేట్ వ‌చ్చింది. 
 

28
India v Pakistan, T20 World Cup 2024

ఐసీసీ టీ20 వరల్డ్ క‌ప్ 2024లో భాగంగా భారత్- పాకిస్థాన్ జట్ల మధ్య అమెరికాలోని న్యూయార్క్ నగరంలో మ్యాచ్ జరగనుంది. టీ20 వరల్డ్ క‌ప్ లో ఇదే అతిపెద్ద మ్యాచ్ కానుంది. న్యూయార్క్ శివార్లలోని లాంగ్ ఐలాండ్ లోని స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. 
 

38
India v Pakistan, T20 World Cup 2024

గార్డియన్ నివేదిక‌ల ప్ర‌కారం.. ఈ రోజు (డిసెంబర్ 15) ప్రపంచ కప్ షెడ్యూల్ పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ), లోకల్ ఆర్గనైజింగ్ కమిటీ సంతకాలు చేయనున్నాయి. టీ20 ప్రపంచకప్ 2024 షెడ్యూల్లో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉందని, అయితే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా తమ గ్రూప్ మ్యాచ్ ల‌ను కరీబియన్ దేశాల్లోనే ఆడతాయని తెలిపింది.
 

48
India v Pakistan, T20 World Cup 2024

త్వరలో జరగనున్న టీ20 వరల్డ్ క‌ప్ కు అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. రాబోయే టీ20 ప్రపంచకప్ లో భారత్-పాక్ మ్యాచ్ పాప్-అప్ స్టేడియంలో జరగనుంది. న్యూయార్క్ శివార్లలో 34,000 మంది కూర్చునేలా తాత్కాలిక స్టేడియాన్ని నిర్మించనున్నారు.
 

58
India v Pakistan, T20 World Cup 2024

అక్క‌డ నిర్వ‌హించ‌డానికి ప్ర‌ధాన కార‌ణం అక్క‌డి తాజా జనాభా లెక్కల ప్రకారం న్యూయార్క్ లో సుమారు 7 లక్షల 11 వేల మంది భారతీయులు, దాదాపు లక్ష మంది పాకిస్థానీ సంతతికి చెందిన వారు నివసిస్తున్నారు. ఇక్క‌డ మ్యాచ్ నిర్వ‌హించ‌డానికి ప్ర‌ధాన కార‌ణాల్లో ఇది కూడా ఒక‌టి.
 

68
India v Pakistan, T20 World Cup 2024

అలాగే, న్యూఢిల్లీ, న్యూయార్క్ మధ్య సమయ వ్యత్యాసం (10.30 గంటలు), భారతీయ టెలివిజన్ వ్యూయర్షిప్ ను దృష్టిలో ఉంచుకుని కొన్ని భార‌త జ‌ట్టు మ్యాచ్ ల‌ను షెడ్యూల్ చేయనున్నట్లు నివేదిక తెలిపింది. అయితే, మ్యాచ్ నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న ఇంకా రాలేదు. త్వ‌ర‌లోనే దీనిపై స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశ‌ముంది. 
 

78
India v Pakistan, T20 World Cup 2024

ఇదిలావుండ‌గా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు తమ గ్రూప్ మ్యాచ్ లు మొత్తం వెస్టిండీస్ లోనే ఆడనున్నాయి. గ్రూప్ మ్యాచ్ అనంతరం ఇంగ్లండ్ సూపర్-8 రౌండ్ లో (అర్హతను బట్టి) ఆంటిగ్వా, బార్బడోస్, సెయింట్ లూసియాలో ఆడుతుంది. ఈ మూడు ప్రదేశాలు బ్రిటిష్ పర్యాటక ప్రదేశాలు కావ‌డంతోనే ఈ నిర్ణ‌యంగా తెలుస్తోంది. 

88
India v Pakistan, T20 World Cup 2024

టీ20 వరల్డ్కప్ ఫైనల్ వేదికను ఇంకా నిర్ణయించలేదని, అయితే 2007 వన్డే వరల్డ్కప్, 2010 టీ20 వరల్డ్కప్ ఫైనల్కు ఆతిథ్యమిచ్చిన బార్బడోస్లో జరిగే అవకాశం ఉందని సమాచారం. అమెరికాలో టోర్నమెంట్ కోసం కేవలం మూడు వేదికలను మాత్రమే షార్ట్ లిస్ట్ చేశారు. ఇందులో ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ పార్క్, టెక్సాస్ గ్రాండ్ ప్రైరీ స్టేడియం, లాంగ్ ఐలాండ్ లోని ఐసెన్ హోవర్ పార్క్ ఉన్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories