Mohammed Shami: దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌కు ముందు భారత్‌కు బిగ్ షాక్..

First Published | Dec 15, 2023, 2:54 PM IST

Mohammed Shami: ద‌క్షిణాఫ్రికాపై అద్భుత రికార్డులు ఉన్న మ‌హ్మ‌ద్ షమీ ఈ టెస్ట్ సిరీస్ కు దూరం కావ‌డం భారత్ కు పెద్ద దెబ్బే. ఆఫ్రికా గడ్డపై 8 టెస్టులు ఆడిన షమీ 44.66 స్ట్రైక్ రేట్ తో 35 వికెట్లు పడగొట్టాడు.
 

Mohammed Shami

India vs South Africa Test series: ద‌క్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ కు ముందు భార‌త్ కు గ‌ట్టి షాక్ త‌గిలింది. టీమిండియా స్పీడ్‌స్టర్ మహ్మద్ షమీ గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో జరగనున్న టెస్టు సిరీస్‌కు దూరం కానున్నాడు. క్రిక్‌బజ్ నివేదిక‌ల ప్రకారం.. 2023 ప్రపంచ కప్ సమయంలో చీలమండ గాయం నుంచి ష‌మీ ఇంకా కోలుకోలేదు. దీని కార‌ణంగా సౌతాఫ్రికాతో జ‌రిగే రెండు టెస్ట్ మ్యాచ్ లు సీరిస్ కు దూరం కావ‌చ్చు.

Mohammed Shami

ఈ నివేదికల ప్ర‌కారం.. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత బృందంతో షమీ దక్షిణాఫ్రికాకు వెళ్లే అవకాశం లేదు. రోహిత్‌తో పాటు విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, ఆర్ అశ్విన్, నవదీప్ సైనీ, హర్షిత్ రాణా దుబాయ్ మీదుగా దక్షిణాఫ్రికాకు వెళ్లనున్నారు. బీసీసీఐ అధికారికంగా షమీ గురించి అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. అత‌ని స్థానంలో ఎవ‌రిని తీసుకుంటార‌నే విష‌యాలు కూడా వెల్ల‌డించ‌లేదు. అయితే భారత వైట్-బాల్ స్క్వాడ్‌లో ఉన్న పేసర్‌లలో ఒకరు అతని స్థానంలో టెస్ట్ జట్టులో భర్తీ చేయగలరని భావిస్తున్నారు.
 


Mohammed Shami

షమీ లేకపోవడం భారతదేశానికి గ‌ట్టి ఎదురుదెబ్బ అనే చెప్పాలి. ఎందుకంటే ష‌మీ ఆతిథ్య దేశం సౌతాఫ్రికాపై మంచి రికార్డులు ఉన్నాయి. ఆఫ్రికన్ గడ్డపై ఎనిమిది టెస్టుల్లో, షమీ తన పేరిట 44.66 స్ట్రైక్ రేట్‌తో 35 వికెట్లు పడగొట్టాడు. ష‌మీ జ‌ట్టుకు దూరం కావ‌డంతో అత‌ని స్థానంలో యువ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ ను జ‌ట్టులోకి తీసుకునే అవకాశ‌ముంది. 
 

Mohammed Shami

ప్రపంచకప్ సమయంలో షమీ కుడి చీలమండలో నొప్పితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. మెగా ఈవెంట్ సమయంలో కాస్త అసౌకర్యంగా క‌నిపించినా.. పనిభారాన్ని భుజాన వేసుకుని అద్భుత బౌలింగ్ తో రాణించాడు. కేవ‌లం ఏడు మ్యాచుల్లో 5.26 ఎకానమీతో 24 వికెట్లు పడగొట్టి అత్యంత విజయవంతమైన బౌలర్ గా నిలిచాడు.
 

Mohammed Shami

ప్ర‌స్తుతం ష‌మీ బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడనీ, ఫిట్నెస్ సాధించడానికి విశ్రాంతి అవసరమని తెలుస్తోంది. ఇక 2021-22లో దక్షిణాఫ్రికాలో భారత్ చివరి సిరీస్ సందర్భంగా షమీ మూడు టెస్టుల్లో 21.00 సగటుతో 14 వికెట్లు పడగొట్టి అత్యంత విజయవంతమైన బౌలర్ గా నిలిచాడు. తొలి టెస్టులో విజయం సాధించిన భారత్ మూడు టెస్టుల సిరీస్ ను కోల్పోయిన సంగ‌తి తెలిసిందే.
 

Latest Videos

click me!