IPL 2024: కేకేఆర్ కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ రీఎంట్రీ.. ఎమ‌న్నాడంటే?

First Published | Dec 15, 2023, 3:44 PM IST

Shreyas Iyer: 'గాయం కారణంగా శ్రేయాస్ అయ్యర్ ఐపీఎల్ 2023కి దూరమవడం నిజంగా దురదృష్టకరం. అతను తిరిగి కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టడం మాకు సంతోషంగా ఉంది. గాయం నుంచి కోలుకోవడానికి అతను కష్టపడిన తీరు, అతను ప్రదర్శించిన ఫామ్ అతని వ్యక్తిత్వానికి నిదర్శనం' అని  కేకేఆర్ టీం పేర్కొంది.
 

Shreyas Iyer

Shreyas Iyer Returns As KKR Captain: గాయం కారణంగా గతేడాది దూరమైన శ్రేయాస్ అయ్యర్.. మ‌ళ్లీ ఐపీఎల్ లోకి తిరిగి వ‌స్తున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ మరోసారి తమ కెప్టెన్ గా శ్రేయాస్ అయ్యర్ ను నియమించింది. అప్పటి స్టాండ్ ఇన్ కెప్టెన్ నితీశ్ రాణా ఐపీఎల్ 2024 కోసం కేకేఆర్  వైస్ కెప్టెన్ గా కొన‌సాగ‌నున్నాడు. 
 

Shreyas Iyer

'గాయం కారణంగా నేను గైర్హాజరు కావడం సహా గత సీజన్ మాకు అనేక సవాళ్లను అందించిందని నేను నమ్ముతున్నాను. నితీశ్ నాకే కాదు, ప్రశంసనీయమైన నాయకత్వంతో కూడా గొప్ప పని చేశారు. కేకేఆర్ అతడిని వైస్ కెప్టెన్ గా నియమించడం సంతోషంగా ఉంది. ఇది నాయకత్వ బృందాన్ని బలోపేతం చేస్తుందనడంలో సందేహం లేదు' అని శ్రేయాస్ అయ్యర్ పేర్కొన్నాడు.
 


Shreyas Iyer

ఇక గత సీజన్ లో కోల్ క‌తా జ‌ట్టు ఓవరాల్ గా  ఏడో స్థానంలో నిలిచింది. నితీష్ రాణా సారథ్యంలో కేకేఆర్ గ్రూప్ దశలోనే ఎలిమినేట్ అయింది. 'గాయం కారణంగా శ్రేయాస్ ఐపీఎల్ 2023కి దూరమవడం నిజంగా దురదృష్టకరం. అతను తిరిగి కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టడం మాకు సంతోషంగా ఉంది. గాయం నుంచి కోలుకోవడానికి అతను కష్టపడిన తీరు, అతను ప్రదర్శించిన ఫామ్ అతని వ్యక్తిత్వానికి నిదర్శనం' అని సీఈఓ వెంకీ మైసూర్ పేర్కొన్నారు.
 

Shreyas Iyer

ఐపీఎల్ 2022కు ముందు దినేశ్ కార్తీక్ స్థానంలో శ్రేయాస్ అయ్యర్ కేకేఆర్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టాడు. అయితే ఈ సీజన్ లో 30.85 సగటు, 134.56 స్ట్రైక్ రేట్ తో 401 పరుగులు చేశాడు. అతని హాట్ అండ్ కోల్డ్ బ్యాటింగ్ ఫామ్ కేకేఆర్ ప్రచారాన్ని ప్రభావితం చేసింది కానీ, పద్నాలుగు మ్యాచ్ ల‌లో ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. 
 

Image credit: PTI

అయితే, 2023 సీజన్ కు ముందు శ్రేయాస్ అయ్య‌ర్ గాయ‌ప‌డటంతో కేకేఆర్ కొత్త కెప్టెన్ గా నితీశ్ రాణాను ఎంపిక చేసింది. కానీ, ఐపీఎల్ 2023 సీజన్ లోనూ కేకేఆర్ కు క‌లిసి రాలేదు. గ్రూప్ ద‌శ‌లోనే ఎలిమినేట్ అయింది. ఐపీఎల్ 2024 కోసం కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ రిటైన్ చేసిన ఆటగాళ్లల్లో శ్రేయాస్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, అనుకుల్ రాయ్, హర్షిత్ రాణా, జేసన్ రాయ్, నితీష్ రాణా, రహ్మానుల్లా గుర్బాజ్, రింకు సింగ్, సునీల్ నరైన్, సుయాష్ శర్మ, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, వెంకటేష్ అయ్యర్ లు ఉన్నారు. 
 

Latest Videos

click me!