ఆల్‌టైం బెస్ట్ ఐపీఎల్ జట్టును ప్రకటించిన షకీబ్ అల్ హసన్... క్రిస్ గేల్, ఏబీ డివిల్లియర్స్‌లకు...

First Published Sep 16, 2021, 12:49 PM IST

బంగ్లా ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్, కొంతకాలం కిందటే ఆల్‌టైం బెస్ట్ వన్డే ఎలెవన్ జట్టును ప్రకటించాడు. మళ్లీ ఇప్పుడు ఐపీఎల్ ఎలెవన్ జట్టును ప్రకటించి, అందర్నీ ఆశ్చర్యపరిచాడు షకీబ్. తన జట్టులో అంతా బాగానే ఉన్నా, ఇద్దరు స్టార్ ప్లేయర్లకు చోటు దక్కకపోవడం విశేషం...

రోహిత్ శర్మ: ఐపీఎల్‌లో ఐదు టైటిల్స్ గెలిచిన కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేసిన రోహిత్ శర్మకు షకీబ్ జట్టులో ఓపెనర్‌గా చోటు దక్కింది. అయితే కెప్టెన్సీ మాత్రం ‘హిట్ మ్యాన్’కి ఇవ్వలేదు షకీబ్ అల్ హసన్...

డేవిడ్ వార్నర్: ఐపీఎల్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌ను తన జట్టులో మరో ఓపెనర్‌గా ఎంచుకున్నాడు షకీబ్ అల్ హసన్...

విరాట్ కోహ్లీ: ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు, అత్యధిక సెంచరీలు చేసిన భారత ప్లేయర్‌గా ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌ విరాట్ కోహ్లీని వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్‌గా ఎంచుకున్నాడు షకీబ్ అల్ హసన్...

సురేష్ రైనా: ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్లలో ఒకడైన ‘మిస్టర్ ఐపీఎల్’ సురేష్ రైనాకి షకీబ్ అల్ హసన్, ఆల్‌టైం బెస్ట్ ఐపీఎల్‌ టీమ్‌లో టూ డౌన్ ప్లేయర్‌గా చోటు దక్కింది...

ఎమ్మెస్ ధోనీ: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని తన టీమ్‌కి కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా ఎంచుకున్నాడు షకీబ్ అల్ హసన్... 

కెఎల్ రాహుల్: పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్‌ను మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా ఎంచుకున్న షకీబ్ అల్ హసన్, ‘మిస్టర్ 360’ ఏబీ డివిల్లియర్స్, ‘యూనివర్సల్ బాస్’ క్రిస్‌గేల్‌లకు తన జట్టులో చోటు ఇవ్వలేదు. 

బెన్ స్టోక్స్: గాయం కారణంగా ఐపీఎల్ ఫస్ట్ ఫేజ్‌లో ఒకే మ్యాచ్ ఆడి, మెంటల్ హెల్త్ కోసం ఫేజ్ 2కి దూరమైన ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌కి తన జట్టులో ఆల్‌రౌండర్‌గా ఎంచుకున్నాడు షకీబ్...

రవీంద్ర జడేజా: సీఎస్‌కే ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకి బంగ్లా ఆల్‌రౌండర్ షకీబ్ ప్రకటించిన ఆల్‌టైం బెస్ట్ ఐపీఎల్ జట్టులో చోటు దక్కింది...

లసిత్ మలింగ: ఐపీఎల్ కెరీర్‌లో 170 వికెట్లు తీసి, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేసిన లంక మాజీ పేసర్ లసిత్ మలింగకి, షకీబ్ ఆల్‌టైం బెస్ట్ ఐపీఎల్ ఎలెవన్‌లో స్థానం దక్కింది...

జస్ప్రిత్ బుమ్రా: ముంబై ఇండియన్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన భారత స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రాను తన జట్టులో ప్రధాన పేసర్‌గా ఎంచుకున్నాడు షకీబ్ అల్ హసన్..

భువనేశ్వర్ కుమార్: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి కీ బౌలర్‌గా మారిన భువనేశ్వర్ కుమార్‌కి షకీబ్ అల్ హసన్, ఆల్‌టైం బెస్ట్ ఎలెవన్ జట్టులో చోటు దక్కింది...

మొత్తంగా షకీబ్ అల్ హసన్ ప్రకటించిన జట్టులో ముగ్గురు సీఎస్‌కే (ధోనీ, రైనా, జడేజా) ప్లేయర్లకు, ముగ్గురు ముంబై ఇండియన్స్ (రోహిత్, బుమ్రా, మలింగ) ప్లేయర్లకు చోటు దక్కగా, సన్‌రైజర్స్ నుంచి ఇద్దరు (వార్నర్, భువీ), ఆర్‌సీబీ నుంచి విరాట్, పంజాబ్ కింగ్స్ నుంచి కెఎల్ రాహుల్, రాజస్థాన్ రాయల్స్ నుంచి బెన్ స్టోక్స్‌కి చోటు దక్కింది.

షకీబ్ అల్ హసన్ ప్రకటించిన ఆల్‌టైం బెస్ట్ ఐపీఎల్ జట్టు ఇదే: ఎమ్మెస్ ధోనీ (కెప్టెన్), రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్, సురేష్ రైనా, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, బెన్ స్టోక్స్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా, లసిత్ మలింగ

click me!