విరాట్ కోహ్లీ కంటే బాబర్ ఆజమ్ కవర్ డ్రైవ్ బాగా ఆడతాడు... నాజర్ హుస్సేన్ కామెంట్స్‌తో...

Published : Aug 07, 2022, 12:41 PM IST

ఒక్కటంటే ఒక్క సాలీడ్ హిట్ పడగానే మెగాస్టార్ చిరంజీవితో పోల్చి చూడడం ఎంత పెద్ద తప్పిదమో... ఫామ్‌లో లేడు కదా అని విరాట్ కోహ్లీని తక్కువ చేసి మాట్లాడడం కూడా అంతే తప్పు! ఈ మధ్య కోహ్లీ ఫామ్‌లో లేకపోవడం, ఇదే సమయంలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ మూడు ఫార్మాట్లలో అదరగొడుతుండంతో ఈ ఇద్దరిలో ఎవరు గ్రేట్ అనే చర్చ నడుస్తోంది సోషల్ మీడియాలో...

PREV
18
విరాట్ కోహ్లీ కంటే బాబర్ ఆజమ్ కవర్ డ్రైవ్ బాగా ఆడతాడు... నాజర్ హుస్సేన్ కామెంట్స్‌తో...
Virat Kohli-Babar Azam

వన్డే, టీ20 ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్ బ్యాటర్‌గా ఉన్న బాబర్ ఆజమ్... టెస్టుల్లోనూ టాప్ 5లో కొనసాగుతున్నాడు. మూడు ఫార్మాట్లలోనూ టాప్ 5లో ఉన్న ఏకైక బ్యాటర్‌గా నిలిచిన బాబర్ ఆజమ్‌... నిలకడైన ప్రదర్శనతో అదరగొడుతున్నాడు...

28

తాజాగా ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్, కామెంటేటర్ నాజర్ హుస్సేన్... బాబర్ ఆజమ్‌ను ప్రశంసిస్తూ చేసిన కామెంట్లు... సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. బాబర్ ఆజమ్‌ని పొడిగితే పోడగని కానీ, మధ్యలో విరాట్ ప్రస్తావన తీసుకొచ్చి టీమిండియా ఫ్యాన్స్‌కి కోపం తెప్పించాడు నాజర్ హుస్సేన్...

38
Babar Azam - Virat Kohli

‘సారీ ఇండియన్ ఫ్యాన్స్... కానీ బాబర్ ఆజమ్ కవర్ డ్రైవ్, విరాట్ కోహ్లీ కవర్ డ్రైవ్ కంటే బాగుంటుంది. ఎందుకంటే విరాట్ కోహ్లీ కవర్ డ్రైవ్ ఆడే విధానం కంటే బాబర్ ఆజమ్ స్టైల్ బాగుంటుంది...

48

విరాట్ కోహ్లీ తన చేతిని ఎక్కువగా వంచుతాడు. అదే బాబర్ ఆజమ్ అలా ఓ లవ్లీ టచ్ ఇస్తాడు... అంతే! నేటి తరం కుర్రాళ్లకు కవర్ డ్రైవ్ గురించి చెప్పాలంటే బాబర్ ఆజమ్ ఆడే కవర్‌ డ్రైవ్‌ని చూడమని చెబుతాను...’ అంటూ కామెంట్ చేశాడు నాజర్ హుస్సేన్... 

58

నాజర్ హుస్సేన్ కామెంట్లతో బాబర్ ఆజమ్‌ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. ఐపీఎల్‌లో కూడా ఫెయిల్ అయ్యే విరాట్ కోహ్లీతో మా ‘కింగ్’ బాబర్ ఆజమ్‌ని పోల్చడం ఏంటని భారత మాజీ సారథిని ట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు..

68

దీంతో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కూడా ఎదురుదాడి చేస్తున్నారు. ఐసీసీతో ‘దశాబ్దపు క్రికెటర్’గా అవార్డు దక్కించుకున్న విరాట్ కోహ్లీతో పోల్చుకోవాలంటే ఓ స్థాయి ఉండాలని, బంగ్లాదేశ్, జింబాబ్వేలపై సెంచరీలు చేసే ‘జోకర్’ బాబర్‌‌కి... కోహ్లీతో పోటీపడే అర్హత లేదంటూ రివర్స్ ట్రోల్స్ చేస్తున్నారు..

78
Image Credit: Getty Images

అయితే బాబర్ ఆజమ్‌ని విరాట్ కోహ్లీతో పోల్చడం కరెక్టేనా? అనేది చాలా పెద్ద ప్రశ్న. 2008లో అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన విరాట్ కోహ్లీ, 14 ఏళ్లుగా క్రికెట్‌లో కొనసాగుతున్నాడు. అంతర్జాతీయ కెరీర్‌లో 70 సెంచరీలు, 23 వేలకు పైగా పరుగులు చేసి అనితర సాధ్యమైన రికార్డులెన్నో క్రియేట్ చేశాడు...

88

విరాట్ కోహ్లీ 100 టెస్టులు ఆడితే బాబర్ ఆజమ్ ఇంకా అందులో సగం కూడా ఆడలేదు. వన్డేలు, టీ20ల్లోనూ ఇదే పరిస్థితి. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి 10 వేల పరుగులు చేసిన బాబర్ ఆజమ్, విరాట్‌తో పోల్చి చూసుకోవడాన్ని ‘పిల్లలు రా... మీరు’ మీమ్‌తో ట్రోల్ చేస్తున్నారు..

Read more Photos on
click me!

Recommended Stories