మేం కూడా మనుషులమే! మ్యాచులు ఆడుతూ పోతే మెంటల్ ఎక్కుద్ది... శిఖర్ ధావన్ కామెంట్స్...

First Published Aug 7, 2022, 11:37 AM IST

2022లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రిత్ బుమ్రా... ఆడిన మ్యాచుల కంటే రెస్ట్ తీసుకున్న మ్యాచుల సంఖ్యే ఎక్కువ. ఐపీఎల్ 2022 సీజన్ తర్వాత సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, ఐర్లాండ్, వెస్టిండీస్‌లతో సిరీస్‌లు ఆడింది భారత జట్టు. అయితే ఈ నాలుగు సిరీసుల్లో పాల్గొన్న ప్లేయర్ల సంఖ్య వేళ్ల మీద లెక్కెట్టొచ్చు...

సౌతాఫ్రికా, ఐర్లాండ్, వెస్టిండీస్ సిరీస్‌లకు దూరంగా ఉన్న విరాట్ కోహ్లీ.. కేవలం ఇంగ్లాండ్ టూర్‌లో ఓ టెస్టు, రెండు వన్డేలు, రెండు టీ20 మ్యాచులు ఆడాడు. రోహిత్ శర్మ.. ఇంగ్లాండ్ టూర్‌లో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడి... ప్రస్తుతం వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ ఆడుతున్నాడు...

Image credit: Getty

ఇంగ్లాండ్ టూర్‌లో ఆడిన జస్ప్రిత్ బుమ్రా... వెస్టిండీస్ టూర్‌కి దూరంగా ఉన్నాడు. ఐర్లాండ్ టూర్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన హార్ధిక్ పాండ్యాకి కూడా రెస్ట్ ఇచ్చిన బీసీసీఐ... సూర్యకుమార్ యాదవ్ వంటి ఒకరిద్దరు ప్లేయర్లను మాత్రమే వరుసగా ఆడిస్తోంది...

‘ఏ ప్లేయర్‌ అయినా బాగా ఆడాలంటే అతను ఫ్రెష్‌ మైండ్‌సెట్‌తో ఉండాలి. వరుసగా మ్యాచుల మీద మ్యాచులు ఆడుతూ పోతే మానసికంగా బాగా అలిసిపోతారు. మాకు కొంచెం రెస్ట్ కావాలి. మేమూ మనుషులమే...

ఇంటర్నేషనల్ క్రికెట్‌‌లో ఈ రొటేషన్ పాలసీ కొత్తేమీ కాదు. ప్రయాణాలు చేసి, ఎక్కడెక్కడో మ్యాచులు ఆడాల్సి ఉంటుంది. అలాంటప్పుడు కాస్త విశ్రాంతి కావాలని కోరుకోవడం తప్పులేదు...

క్రికెట్‌కీ, వ్యక్తిగత జీవితానికి బ్యాలెన్స్ చేసుకోవడం కూడా అవసరమే. బ్రేక్ కావాలనుకున్నప్పుడు తీసుకోవడంలో తప్పేంటి...’ అంటూ కామెంట్ చేశాడు భారత సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్...
 

Rohit Sharma - Shikhar Dhawan

‘దీపక్ హుడాకి లేటుగా అవకాశం వచ్చినా, దాన్ని చక్కగా వాడుకుంటున్నాడు. అయితే విరాట్ కోహ్లీ లాంటి సీనియర్ ప్లేయర్ కోసం అతను ఇంకొన్నాళ్లు వేచి చూడక తప్పదు...

Shreyas Iyer-Shikhar Dhawan

అది పెద్ద సమస్య కాదు! ప్రతీచోట ఉండేదే... అతనికి ఆ విషయం క్లారిటీగా చెబితే ఎలాంటి సమస్య ఉండదు. సూర్యకుమార్ యాదవ్ జట్టులో చోటు దక్కించుకోవడానికి చాలా ఏళ్లపాటు ఎదురుచూడాల్సి వచ్చింది...

ప్రతీ కోచ్, ప్రతీ కెప్టెన్ అనుసరించే విధానం ఒకేలా ఉండకపోవచ్చు. అయితే జట్టులో ఓ మంచి వాతావరణం క్రియేట్ చేసేందుకు వాళ్లు ఎప్పుడూ ఆలోచిస్తారు. రోహిత్ శర్మ, రాహుల్ ద్రావిడ్‌లకు టీమిండియాకి ఏం కావాలో చెప్పాల్సిన అవసరం లేదు...

Image Credit: Getty Images

వన్డేలకు ఇప్పట్లో వచ్చిన ముప్పు ఏమీ లేదు. ఎందుకంటే ఇంగ్లాండ్ టూర్‌లో, వెస్టిండీస్‌లో మేం ఆడిన వన్డే మ్యాచులకు జనాలు బాగా వచ్చారు. ఇంగ్లాండ్‌లో అయితే స్టేడియం మొత్తం జనాలతో నిండిపోయింది.

Image credit: Getty

టీ20లకు క్రేజ్ పెరగొచ్చు. అయితే 4 గంటల్లో అయిపోయే టీ20ల కంటే వన్డే ఫార్మాట్‌ ఆడడానికి, చూడడానికి ఇష్టపడే వారి సంఖ్య తక్కువేమీ లేదు...’ అంటూ కామెంట్ చేశాడు శిఖర్ ధావన్...
 

click me!