Narendra Modi : గెలుపుఓటములు సహజం.. భారత క్రికెట్ టీంకు ప్రధాని మోడీ ఓదార్పు..(ఫొటోలు)

First Published | Nov 21, 2023, 11:14 AM IST

ప్రపంచ కప్ ఫైనల్లో ఓటమికి చింతించాల్సిన అవసరం లేదని అప్పుడప్పుడు అలా జరుగుతుంటుందని ప్రధాని నరేంద్రమోడీ భారత క్రికెటర్లను ఓదార్చారు.

అహ్మదాబాద్ :  ఈసారి  క్రికెట్ ప్రపంచకప్ కు భారత్ ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆడిన ప్రతి గేమ్ లోనూ దుమ్ము దులిపిన మన ఇండియన్ టీం.. చివరికి ఫైనల్స్ లో పోరాడి ఓడింది. ఈసారి ప్రపంచకప్ మనదేనని ఆశగా ఎదురుచూస్తున్న అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు.

ఆటలో తీవ్ర ఒత్తిడికి లోనైన క్రీడాకారులు తమ ఓటమిని విశణ్ణ వదనాలతో అంగీకరించాల్సి వచ్చింది. 8 మ్యాచ్ లలో వరుసగా గెలుచుకుంటూ వచ్చిన టీమిండియా చివరిసారిగా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడంతో టీమ్ ఇండియా ప్లేయర్లంతా  దుఃఖసాగరంలో మునిగిపోయారు.


భారత ప్రధాని నరేంద్ర మోడీ టీమిండియా క్రికెటర్లకు మనోధైర్యాన్ని అందించారు. వారిని కలుసుకున్నారు. ప్రపంచ కప్ ఫైనల్లో ఓటమికి చింతించాల్సిన అవసరం లేదని అప్పుడప్పుడు అలా జరుగుతుంటుందని  ఓదార్చారు.

ఓటమిని స్పోర్టివ్ గా తీసుకోవాలని.. ఈ సిరీస్ మొత్తంలో అద్భుతమైన ప్రతిభ కనబరిచారని మెచ్చుకున్నారు. గెలుపు ఓటములు సహజమని.. అది క్రికెట్లో అత్యంత సహజమని చెప్పుకొచ్చారు. ఓటమితో కుంగిపోవద్దని.. ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్లాలని సూచించారు.

ఈసారి వరల్డ్ కప్ లో రికార్డుల మోత మోగించిన ఫాస్ట్ బౌలర్ షెమిని దగ్గరికి తీసుకుని హత్తుకున్నారు. శమీ అప్పుడప్పుడూ ముక్కలు ముక్కలుగా గుజరాతీ మాట్లాడడం తనకు నచ్చిందని మెచ్చుకున్నారు. ఓదార్పు మాటలతో మరింత ధైర్యాన్ని నింపారు.  ప్రపంచకప్ ఫైనల్లో ఓడిపోయినంత మాత్రాన మొత్తం సిరీస్లో ప్రదర్శన తక్కువగా అంచనా వేయాల్సిన అవసరం లేదన్నారు.

తను ఎప్పుడూ వారికి అండగా ఉంటానని చెప్పుకొచ్చారు ప్రధాని మోడీ. ఢిల్లీకి వచ్చినప్పుడు వారితో ప్రత్యేకంగా భేటీ అవుతానని..  సమయం గడుపుతానని చెప్పారు. ప్రధానితో పాటు అమిత్ షా కూడా క్రికెటర్లను కలిశారు.

ఓటమితో నిరుత్సాహంలో ఉన్న టీమ్ ఇండియా క్రికెటర్లకు ప్రధాని ఓదార్పు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చినట్టు అయింది. క్లిష్ట సమయంలో తమకు ప్రధాని అండగా నిలవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని భారత క్రికెటర్లు శమీ, జడేజా  తదితరులు ట్విట్టర్ వేదికగా ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు.

Latest Videos

click me!