సంజూ శాంసన్‌పై సెలక్టర్లు పగ బట్టి, ఇలా చేస్తున్నారా?.. వీళ్లిద్దరి కెరీర్ కూడా ముగిసినట్టేనా..

First Published | Nov 21, 2023, 10:43 AM IST

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ముగిసింది. వచ్చే ఏడాదిలో జూన్‌లో జరిగే టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీకి కౌంట్‌డౌన్ మొదలైపోయింది. ఆస్ట్రేలియాతో నవంబర్ 23 నుంచి మొదలయ్యే టీ20 సిరీస్, ఈ పొట్టి ప్రపంచ కప్‌కి తొలి ప్రిపరేషన్..

Sanju Samson-Chahal

ఆస్ట్రేలియాతో జరగబోయే టీ20 సిరీస్‌ నుంచి వరల్డ్ కప్ ఆడిన కోర్ టీమ్ ప్లేయర్లకు విశ్రాంతి ఇచ్చింది టీమిండియా. ప్రపంచ కప్‌కి ఎంపికైన 15 మందిలో సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ మాత్రమే ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడబోతున్నారు..

Sanju Samson

అయితే ఎప్పటిలాగే మరోసారి సెలక్టర్లు సంజూ శాంసన్‌కి షాక్ ఇచ్చారు. ఆసియా కప్ 2023 టోర్నీకి స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపికైన సంజూ శాంసన్, కెఎల్ రాహుల్ కోలుకోవడంతో ఇండియాకి తిరిగి వచ్చేశాడు..


Sanju Samson

ఆసియా కప్‌కి సెలక్ట్ కావడంతో ఏషియన్ గేమ్స్ 2023 పోటీలకు ఎంపిక కాలేకపోయాడు సంజూ శాంసన్. వరల్డ్ కప్‌కి సెలక్ట్ కాలేకపోయిన సంజూ శాంసన్‌కి, తాజాగా ఆస్ట్రేలియాతో జరగబోయే టీ20 సిరీస్‌ జట్టులో కూడా చోటు దక్కలేదు..

సంజూ శాంసన్ ఆఖరిగా ఆడిన టీ20 మ్యాచ్‌లో 26 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 40 పరుగులు చేసి మెప్పించాడు. అయినా అతన్ని టీ20 టీమ్‌కి సెలక్ట్ చేయలేదు సెలక్టర్లు..
 

టీ20 వరల్డ్ కప్ ముందు ఉన్నప్పుడు వన్డేల్లో, వన్డే వరల్డ్ కప్ ఉన్నప్పుడు టీ20ల్లో మాత్రమే ఆడిస్తూ... సంజూ శాంసన్‌కి ఐసీసీ టోర్నీలు ఆడే అవకాశం రాకుండా జాగ్రత్త పడుతోంది టీమిండియా మేనేజ్‌మెంట్..
 

Sanju Samson

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కి ఎంపిక చేసిన టీమ్‌కి జితేశ్ శర్మ వికెట్ కీపర్‌గా ఎంపికయ్యాడు. 31 ఏళ్ల జితేశ్ శర్మకు అవకాశం ఇచ్చిన టీమిండియా సెలక్టర్లు, గత టీ20 సిరీస్‌లో బాగా ఆడిన సంజూని మాత్రం కావాలని పక్కనబెట్టేశారు. 

అలాగే సీనియర్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్, సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌లకు కూడా ఆసీస్‌తో టీ20 సిరీస్‌లో చోటు దక్కలేదు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప  ఈ ఇద్దరి ఇంటర్నేషనల్ కెరీర్‌ దాదాపు ముగిసినట్టే.. 
 

Latest Videos

click me!