రిటైర్మెంట్ ప్రకటించిన మురళీ విజయ్... ఫారిన్ లీగుల్లో ఆడబోతున్న టీమిండియా ఓపెనర్..

Published : Jan 30, 2023, 03:22 PM ISTUpdated : Jan 30, 2023, 03:33 PM IST

టీమిండియా ఓపెనర్ మురళీ విజయ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటూ రిటైర్మెంట్ తీసుకున్నాడు. 38 ఏళ్ల మురళీ విజయ్, కొన్నాళ్ల క్రితం బీసీసీఐ పట్టించుకోవడం లేదని,ఫారిన్ లేగుల్లో ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు కామెంట్ చేశాడు. ఈ కామెంట్లు చేసిన కొన్ని రోజులకే టీమిండియాకి రిటైర్మెంట్ ప్రకటించాడు మురళీ విజయ్...

PREV
18
రిటైర్మెంట్ ప్రకటించిన మురళీ విజయ్... ఫారిన్ లీగుల్లో ఆడబోతున్న టీమిండియా ఓపెనర్..
murali vijay

టీమిండియా తరుపున టెస్టు ఓపెనర్‌గా 61 మ్యాచులు ఆడిన మురళీ విజయ్, 12 సెంచరీలు, 15 హఫ్ సెంచరీలతో 3982 పరుగులు చేశాడు. 17 వన్డేలు ఆడిన ఈ చెన్నై క్రికెటర్, 21.18 సగటుతో 339 పరుగులు చేశాడు. 9 టీ20 మ్యాచులు ఆడి 169 పరుగులు చేశాడు...

28

2008లో టీమిండియా తరుపున ఆరంగ్రేటం చేసిన మురళీ విజయ్, 2018లో ఆస్ట్రేలియాపై చివరి టెస్టు ఆడాడు. వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ రిటైర్మెంట్ తర్వాత టీమిండియా టెస్టు ఓపెనర్‌గా మారాడు మురళీ విజయ్... 

38
murali vijay

అయితే మురళీ విజయ్ వరుసగా ఫెయిల్ అవుతూ ఉండడంతో రోహిత్ శర్మను ఓపెనర్‌గా టెస్టుల్లోకి తిరిగి తీసుకొచ్చింది టీమిండియా...రోహిత్ టెస్టుల్లో ఓపెనర్‌గా మారడంతో మురళీ విజయ్ కెరీర్‌కి ఫుల్‌స్టాప్ పడింది...

48

రోహిత్ శర్మకు తోడుగా మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, శుబ్‌మన్ గిల్, కెఎల్ రాహుల్ వంటి కుర్రాళ్లను ఓపెనర్లుగా వాడిన బీసీసీఐ, మురళీ విజయ్‌ని పట్టించుకోవడం మానేసింది. 

58

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరుపున ఆడిన మురళీ విజయ్... 2020లో సీఎస్‌కే ఫెయిల్యూర్ తర్వాత వేలంలో అమ్ముడుపోని ప్లేయర్ల జాబితాలో చేరిపోయాడు. ఐపీఎల్ 2021, 2022, 2023 సీజన్ల ఐపీఎల్ వేలంలో రిజిస్టర్ చేయించుకున్నా మురళీ విజయ్‌ని కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంఛైజీ ముందుకు రాలేదు...

68

2009లో ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన మురళీ విజయ్, 2010 నుంచి 2016 వరకూ మూడు సీజన్లలో 400+ పరుగులు చేశాడు. అయితే 2017లో మోచేతి గాయంతో ఐపీఎల్‌కి దూరమైన మురళీ విజయ్‌ని,  2018 నుంచి పట్టించుకోవడం మానేశాయి ఫ్రాంఛైజీలు. 

78

తన ఐపీఎల్ కెరీర్‌లో 106 మ్యాచులు ఆడి 25.93 సగటుతో 2619 పరుగులు చేసిన మురళీ విజయ్... 2 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఆఖరి 3 సీజన్లలో కలిపి మురళీ విజయ్ 6 మ్యాచులు మాత్రమే ఆడగలిగాడు..

88

టీమిండియాకి మంచి టెస్టు ఓపెనర్‌గా మారుతున్న సమయంలో దినేశ్ కార్తీక్ భార్య నిఖితాతో వివాహేతర సంబంధం పెట్టుకుని వివాదాల్లో ఇరుక్కున్నాడు మురళీ విజయ్. ఈ విషయం తెలిసిన దినేశ్ కార్తీక్, నిఖితకి విడాకులు ఇవ్వడం, మురళీ విజయ్ ఆమెని పెళ్ల చేసుకోవడం జరిగిపోయాయి...
ఈ సంఘటన జరిగి 10 ఏళ్లు దాటుతున్నా ఇప్పటికీ మురళీ విజయ్‌ని, ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ట్రోల్ వస్తూనే ఉన్నాయి. 

click me!

Recommended Stories