సర్ఫరాజ్ అదుర్స్.. బ్రాడ్‌మన్ తర్వాత ముంబై కుర్రాడే.. సచిన్, కోహ్లీలు కూడా అతడి తర్వాతే..

First Published Jan 12, 2023, 7:13 PM IST

డొమెస్టిక్ క్రికెట్ లో  డాన్ బ్రాడ్‌మన్  సగటు 95.14గా ఉంది. బ్రాడ్‌మన్ తర్వాత ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అత్యధిక సగటు నమోదు చేసిన ఆటగాడు  సర్ఫరాజ్ ఖాన్ మాత్రమే. ఇప్పటివరకు ఈ ముంబై కుర్రాడు..

దేశవాళీలో పరుగుల వరద పారిస్తున్న ముంబై కుర్రాడు సర్ఫరాజ్ ఖాన్  మరోసారి అదరగొట్టాడు.  జాతీయ జట్టులో చోటే లక్ష్యంగా దేశవాళీలో  టన్నుల కొద్దీ పరుగులు చేస్తున్న ఈ యువ బ్యాటర్..  ఆసీస్ దిగ్గజ ఆటగాడు, దివంగత డాన్ బ్రాడ్‌మన్ తర్వాత  స్థానంలో నిలిచాడు. 
 

డొమెస్టిక్ క్రికెట్ లో  డాన్ బ్రాడ్‌మన్  సగటు 95.14గా ఉంది.   ఈ ఆసీస్ దిగ్గజం  234 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లలో  95.14 సగటుతో   28,067 పరుగులు సాధించాడు. ఇందులో 117 సెంచరీలు, 69 హాఫ్  సెంచరీలు ఉన్నాయి.  అంతర్జాతీయ క్రికెట్ లో బ్రాడ్‌మన్.. 52 టెస్టులలో 6,996 పరుగులు చేశాడు. టెస్టులలో ఈ దిగ్గజం సగటు 99.94గా ఉండటం గమనార్హం. 

బ్రాడ్‌మన్ తర్వాత ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అత్యధిక సగటు నమోదు చేసిన ఆటగాడు  సర్ఫరాజ్ ఖాన్ మాత్రమే. ఇప్పటివరకు ఈ ముంబై కుర్రాడు.. 34 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లలో 3,175 రన్స్ చేశాడు. ఇందులో 11 సెంచరీలు, 9 హాఫ్  సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు  301గా ఉంది.  ఈ క్రమంలో సర్ఫరాజ్ బ్యాటింగ్ సగటు  80గా ఉంది.   

రంజీ ట్రోఫీలో భాగంగా అస్సాం - ముంబై మధ్య జరుగుతున్న   మ్యాచ్ లో  సర్ఫరాజ్..   32 బంతుల్లో 28 పరుగులు చేసి  నాటౌట్ గా నిలిచాడు.  ఈ మ్యాచ్ లో నాటౌట్ గా ఉండటం ద్వారా  సర్ఫరాజ్ సగటు  80 దాటింది. గతంలో కూడా ఒకసారి అతడు 80 ప్లస్ సగటును టచ్ చేయడం విశేషం. 

భారత్ లో క్రికెట్ దిగ్గజాలుగా వెలుగొందుతున్న సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీల సగటు (ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో)  కూడా  ఇంత లేదు.  సచిన్.. తన ఫస్ట్ క్లాస్ కెరీర్ లో 310 మ్యాచ్ లలో  25,396  పరుగులు చేశాడు. ఇందులో 81 సెంచరీలు, 116 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.  ఈ క్రమంలో  సచిన్ సగటు  57.84గా ఉంది. 

ఇక కోహ్లీ విషయానికొస్తే.. తన కెరీర్ లో విరాట్ 136 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడి 10,368  పరుగులు చేశాడు.   కోహ్లీ సగటు 50.08 గా ఉంది. అయితే  అంతర్జాతీయ క్రికెట్ లో మాత్రం అటు టెస్టులు, వన్డేలు, టీ20లలో 50 ప్లస్ సగటు ఉన్న  ఏకైక క్రికెటర్ గా కోహ్లీ చరిత్రకెక్కిన విషయం తెలిసిందే. 

click me!