నిన్న ఐఎస్‌ఎల్‌లో, నేడు విజయ్ హాజారే ట్రోఫీలో ముంబై హావా... మరి రేపు?...

First Published Mar 14, 2021, 7:13 PM IST

దేశవాళీ క్రీడా టోర్నీల్లో ముంబై హవా కొనసాగుతోంది. నిన్న ఐఎస్‌ఎల్‌లో, నేడు విజయ్ హాజారే ట్రోఫీ ఫైనల్‌లో ముంబై జట్టు విజేతగా నిలిచింది. దీంతో 2021 ఏడాది ముంబైకి అద్భుతంగా కలిసొస్తుందని అంచనా వేస్తున్నారు ఫ్యాన్స్. 

నిన్న జరిగిన ఇండియన్ సూపర్ లీగ్ 2020-21 సీజన్ ఫైనల్‌లో మూడు సార్లు టైటిల్ గెలిచిన డిఫెండింగ్ ఛాంపియన్‌ ఏటీకే మోహన్ బగాన్‌ను ఓడించి, ముంబై సిటీ తొలిసారి టైటిల్ కైవసం చేసుకుంది.
undefined
నేడు విజయ్ హాజారే ట్రోఫీ ఫైనల్‌లో ఉత్తరప్రదేశ్‌పై భారీ లక్ష్యాన్ని చేధించి, నాలుగోసారి టైటిల్ కైవసం చేసుకుంది ముంబై జట్టు. విజయ్ హాజారే ట్రోఫీ చరిత్రలో ఫైనల్‌ మ్యాచ్‌లో 300+ చేధించిన మొదటి జట్టుగా రికార్డు క్రియేట్ చేసింది ముంబై.
undefined
ఫైనల్‌లో 118 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన ముంబై వికెట్ కీపర్ ఆదిత్య తారే, విజయ్ హాజారే ట్రోఫీ ఫైనల్‌లో అత్యధిక స్కోరు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. ఇంతకుముందు లక్ష్మీ రతన్ శుక్లా (106) మాత్రమే ఫైనల్‌ చేధనలో సెంచరీ చేశాడు.విజయ్ హాజారే ట్రోఫీలో 800+ పైగా పరుగులు చేసిన మొట్టమొదటి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు పృథ్వీషా...
undefined
దీంతో వచ్చే ఐపీఎల్ 2021 సీజన్‌లో ముంబై ఇండియన్స్ టైటిల్ గెలిచి హ్యాట్రిక్ కొడుతుందని చెబుతున్నారు ముంబై అభిమానులు. ఇప్పటికే ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచి, టాప్‌లో ఉన్న ముంబై ఇండియన్స్...ఈసారి కూడా టైటిల్ గెలిస్తే వరుసగా మూడుసార్లు టైటిల్ గెలిచిన జట్టుగా నిలుస్తుంది...
undefined
అంతేకాకుండా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ప్లేయర్లు సూర్యకుమార్ యాదవ్, ఇషాక్ కిషన్‌లు ఆరంగ్రేటం చేశారు. ఒకే మ్యాచ్‌లో ఇద్దరు ముంబై ఇండియన్స్ ప్లేయర్లు ఎంట్రీ ఇవ్వడంతో ఎంఐ ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
undefined
అదీగాక ముంబై ఇండియన్స్ నుంచి ఇప్పటిదాకా ఏకంగా ఏడుగురు క్రికెట్లరు, టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చారు. ఐపీఎల్‌లో మిగిలిన జట్లతో పోలిస్తే ముంబై ఇండియన్స్‌ ప్లేయర్లే ఎక్కువ.
undefined
విజ్డేన్ ఆల్‌టైం వరల్డ్‌కప్ ఎలెవన్ జట్టులో ముంబై ఇండియన్స్ ప్లేయర్ రోహిత్ శర్మ, సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, మురళీధరన్‌లకు చోటు దక్కడం విశేషం. ప్రస్తుతం ఆడుతున్న ప్లేయర్లకు కేవలం మిచెల్ స్టార్క్, రోహిత్ శర్మలకు మాత్రమే విజ్డేన్ వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కింది.
undefined
అయితే ఈ ఏడాది ఆరంభంలో జరిగిన సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో తమిళనాడు విజేతగా నిలిచింది. దీంతో ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలుస్తుందని అంచనా వేస్తున్నారు ధోనీ ఫ్యాన్స్...
undefined
మరోవైపు డేవిడ్ వార్నర్, రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనీలు తండ్రి అయ్యాక జరిగిన తర్వాత సీజన్‌లో వారి జట్లే టైటిల్ గెలిచాయి. దీంతో ఈసారి బెంగళూరు, ఐపీఎల్ టైటిల్ గెలుస్తుందని కోహ్లీ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు...
undefined
click me!