విజయ్ హాజారే ట్రోఫీ విజేత ముంబై... ఫైనల్‌లో యూపీపై ఘన విజయం...

Published : Mar 14, 2021, 06:06 PM IST

విజయ్ హాజారే ట్రోఫీ ఫైనల్‌లో ముంబై జట్టు ఘన విజయం సాధించింది. 16 ఏళ్ల తర్వాత ఫైనల్ చేరిన ఉత్తరప్రదేశ్ విధించిన 313 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించి, నాలుగో టైటిల్‌ని కైవసం చేసుకుంది ముంబై జట్టు. 

PREV
15
విజయ్ హాజారే ట్రోఫీ విజేత ముంబై... ఫైనల్‌లో యూపీపై ఘన విజయం...

ఫైనల్ ఫైట్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఉత్తరప్రదేశ్, నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 312 పరుగుల భారీ స్కోరు చేసింది. సామ్రాట్ సింగ్‌తో కిసలి మొదటి వికెట్‌కి 122 పరుగులు జోడించిడు మాధవ్ కౌషిక్. 

25

కెప్టెన్ కరణ్ శర్మ డకౌట్ అయినా ప్రియమ్ గార్గ్ 21, ఆకాష్‌దీప్ నాథ్ 55 పరుగులు చేశారు. 156 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్లతో 158 పరుగులు చేసిన మాధవ్ కౌషిక్, ఉత్తరప్రదేశ్ భారీ స్కోరు చేయడానికి కారణమయ్యాడు...

35

313 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన ముంబైకి కెప్టెన్ పృథ్వీషా మెరుపు ఆరంభాన్ని అందించాడు. 39 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 73 పరుగులు చేసి అవుట్ అయ్యాడు పృథ్వీషా...

45

యశస్వి జైస్వాల్ 29 పరుగులు చేయగా వికెట్ కీపర్ ఆదిత్య తారే 107 బంతుల్లో 18 ఫోర్లతో 118 పరుగులు చేసి అజేయంగా నిలిచి ముంబైకి ఘనవిజయాన్ని అందించాడు. శామ్స్ ములానీ 36, శివమ్ దూబే 42 పరుగులు చేశారు.

55

ఫైనల్‌లో 73 పరుగులు చేసిన పృథ్వీషా, విజయ్ హాజారే ట్రోపీ చరిత్రలో ఒకే సీజన్‌లో 800+ పైగా పరుగులు చేసిన మొదటి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. 8 ఇన్నింగ్స్‌లో 827 పరుగులు చేశాడు పృథ్వీషా... ఇందులో ఓ డబుల్ సెంచరీతో పాటు మరో మూడు భారీ సెంచరీలు ఉన్నాయి. 

click me!

Recommended Stories