జింబాబ్వేపై ఆఫ్ఘాన్ సంచలన విజయం... అద్భుత పోరాటం చూపిన జింబాబ్వే...

First Published Mar 14, 2021, 6:23 PM IST

జింబాబ్వే, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన రెండో టెస్టు, క్రికెట్ అభిమానులకు కావాల్సినంత మజాను అందించింది. ఐదురోజుల పాటు సాగిన ఈ టెస్టు మ్యాచ్‌లో ఆఫ్ఘాన్ చారిత్రక విజయాన్ని నమోదుచేసింది...

మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘాన్, రెహ్మతుల్లా షాహిదీ రికార్డు డబుల్ సెంచరీ, కెప్టెన్ అస్గర్ ఆఫ్ఘాన్ 164 పరుగులు చేయడంతో తొలి ఇన్నింగ్స్‌లో 5454 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఆఫ్ఘాన్ తరుపున తొలి డబుల్ సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు రెహ్మతుల్లా షాహిదీ.
undefined
తొలి ఇన్నింగ్స్‌లో జింబాబ్వే జట్టు 287 పరుగులకి ఆలౌట్ అయ్యింది. సికిందర్ రాజా 85, మాస్వురే 65 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. రషీద్ ఖాన్‌కి నాలుగు, అమీర్ హమ్జాకి 3 వికెట్లు దక్కాయి.
undefined
ఆఫ్ఘాన్ జట్టు, జింబాబ్వేను ఫాలోఆన్ ఆడించింది. రెండో ఇన్నింగ్స్‌లో రషీద్ ఖాన్ విజృంభించడంతో 142 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది జింబాబ్వే. అయితే కెప్టెన్ సీన్ విలియమ్స్, తిరిపానో కలిసి 8వ వికెట్‌కి 187 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు.
undefined
దీంతో రెండో ఇన్నింగ్స్‌లో 365 పరుగులకి ఆలౌట్ అయిన జింబాబ్వే, ఆఫ్ఘాన్‌కి రెండో ఇన్నింగ్స్‌లో 107 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. జావెద్ అహ్మది, షహిద్దులా కమాల్ వికెట్లు త్వరగా కోల్పోయినా రెహ్మతా షా 58, ఇబ్రహీం జాద్రాన్ 29 పరుగులు చేసి ఆఫ్ఘాన్‌కి విజయాన్ని అందించారు.
undefined
రెండో టెస్టులో జింబాబ్వేపై 6 వికెట్ల తేడాతో గెలిచిన ఆఫ్ఘాన్ జట్టు... ఐర్లాండ్, బంగ్లాదేశ్ తర్వాత మూడో టెస్టు జట్టుపై విజయాన్ని అందుకుంది. ఈ టెస్టులో ఏకంగా 99.2 ఓవర్లు బౌలింగ్ చేసిన రషీద్ ఖాన్ 11 వికెట్లు తీశాడు.
undefined
click me!