IPL 2025: ముంబై vs ఢిల్లీ.. ప్లే ఆఫ్స్ లో నిల‌వాలంటే గెల‌వాలి

Published : May 21, 2025, 03:04 PM IST

Mumbai Indians vs Delhi Capitals: ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ చేరేందుకు తుది పోరుకు సిద్ధంగా ఉన్నాయి. ఇరు జ‌ట్లు మ‌ధ్య బిగ్ ఫైట్ ఉత్కంఠ‌ను రేపుతోంది.  

PREV
15
ముంబై ఇండియన్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ బిగ్ ఫైట్

Mumbai Indians vs Delhi Capitals: ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జెయింట్స్ కూడా ప్లే ఆఫ్స్ రేసు నుండి అవుట్ కావ‌డంతో ఇప్పుడు ముంబై ఇండియన్స్ - ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య పోటీ నెల‌కొంది. బుధ‌వారం జరగబోయే మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. ఈ మ్యాచ్ ఫలితంపై ప్లే ఆఫ్స్‌లోకి ఎవరు ప్రవేశిస్తారు అన్నది తేలనుంది.

25
ముంబై ఇండియన్స్ కే ఎక్కువ ఛాన్స్

ప్రస్తుతం 12 మ్యాచ్‌లలో 14 పాయింట్లు ఉన్న ముంబై ఇండియన్స్‌కు ఇంకా రెండు మ్యాచులు మిగిలి ఉన్నాయి. అవి రెండూ గెలిస్తే మొత్తం 18 పాయింట్లతో ముంబై ప్లే ఆఫ్స్‌లోకి చేరే అవకాశం ఉంటుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ 13 పాయింట్లతో ఉన్నా, వారికి కూడా రెండు మ్యాచులు మిగిలి ఉన్నాయి. కానీ, వారు రెండు మ్యాచులు గెలవడమే కాకుండా ముంబై రెండు మ్యాచుల్లోనూ ఓడిపోవాలి. అంటే, ఢిల్లీకి ప్లే ఆఫ్స్ ఆశలు బతికుండాలంటే ముంబై ఓటమి కీలకం.

35
ఢిల్లీ మిగిలిన రెండు మ్యాచ్ లను గెలవాల్సిందే

ముంబై బుధ‌వారం మ్యాచ్ ఓడితే, ఢిల్లీకి పంజాబ్ కింగ్స్‌తో ఆఖరి మ్యాచ్‌లో గెలవడం తప్పనిసరి అవుతుంది. అదే సమయంలో ముంబై-లక్నో జట్ల ఆఖరి మ్యాచుల ఫలితాలపై ఢిల్లీ ఆధారపడాల్సి వస్తుంది.

45
ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టికలో టాప్ లో గుజరాత్

ఇతర జట్ల పరిస్థితి చూస్తే, గుజరాత్ టైటాన్స్ ఢిల్లీపై 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించడంతో ఇప్పటికే 12 మ్యాచ్‌ల్లో 9 విజయాలతో 18 పాయింట్లతో పట్టికలో మొదటి స్థానంలో నిలిచింది. అలాగే, 17 పాయింట్లతో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా ప్లే ఆఫ్స్‌లోకి ప్రవేశించాయి.

ఇక చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి అవుట్ అయ్యాయి.

55
ముంబై పై ఢిల్లీ ప్రతీకారం తీర్చుకుంటుందా?

ఈ నేపథ్యంలో ముంబై-ఢిల్లీ మధ్య జరగబోయే ఈ పోరాటం ఫ్యాన్స్ మధ్య తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ప్లే ఆఫ్స్‌కు చివరి అవకాశాన్ని ఎవరు సొంతం చేసుకుంటారన్నది ఈ మ్యాచ్‌తో తేలనున్నది. ఈ సీజన్‌లో రెండు జ‌ట్ల మధ్య ఇది ​​రెండో పోరాటం. ఏప్రిల్ 13న జరిగిన తొలి మ్యాచ్‌లో ముంబై జట్టు ఢిల్లీని 12 పరుగుల తేడాతో ఓడించింది. కాబట్టి ఇప్పుడు ఢిల్లీకి ప్రతీకారం తీర్చుకోవడానికి, ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోవడానికి మంచి అవ‌కాశం దొరికింది.

Read more Photos on
click me!

Recommended Stories