Published : Feb 08, 2022, 04:41 PM ISTUpdated : Feb 08, 2022, 05:07 PM IST
ఇండియా, వెస్టిండీస్ మధ్య జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్న రోహిత్ శర్మ, టీమిండియా 1000వ వన్డేలో విజయాన్ని అందించాడు...
177 పరుగుల లక్ష్యఛేదనలో రోహిత్ శర్మ 60 పరుగులు చేసి అవుట్ కాగా, ఇషాన్ కిషన్ 28, విరాట్ కోహ్లీ 8, రిషబ్ పంత్ 11 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు...
28
ఈ దశలో సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా కలిసి అజేయంగా ఐదో వికెట్‌కి 62 పరుగులు జోడించి భారత జట్టుకి విజయాన్ని అందించారు...
38
36 బంతుల్లో 5 ఫోర్లతో 34 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, బౌండరీతో మ్యాచ్‌ని ముగించాడు. అయితే సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో విండీస్ కెప్టెన్ కిరన్ పోలార్డ్‌తో ఓ చిన్న మాటల యుద్ధం జరిగింది...
48
ముంబై ఇండియన్స్ జట్టుకి ఆడే సూర్యకుమార్ యాదవ్‌ను ఐపీఎల్‌లో లాగా షాట్ ఆడాల్సిందిగా కోరాడు కిరన్ పోలార్డ్... ‘ఐపీఎల్ అయితే షాట్ ఆడతావుగా ఇప్పుడు ఎందుకు ఆడడం లేదు’ అని సూర్యకుమార్‌ని అడిగాడు...
58
దానికి సూర్యకుమార్ యాదవ్, ‘నేను చివరి దాకా ఉండి మ్యాచ్‌ని ముగించాలని అనుకుంటున్నా...’ అంటూ సమాధానం ఇచ్చాడు...
68
‘పోలార్డ్‌ను అవుట్ చేసేందుకు అతనితో మైండ్ గేమ్ ఆడేందుకు మాకు ఎక్కువ సమయం దొరకలేదు. అతను వస్తూనే అవుటై పోయాడు...
78
కొన్నిసార్లు ఇలాంటి చిన్నచిన్న ఫైట్స్, ప్రేక్షకులు లేని స్టేడియాల్లో మ్యాచులు ఆడుతున్నప్పుడు కాలక్షేపాన్ని ఇచ్చి, మ్యాచ్‌ను ఇంట్రెస్టింగ్‌గా మారుస్తాయి...’ అంటూ మ్యాచ్ ముగిసిన తర్వాత చెప్పుకొచ్చాడు సూర్యకుమార్ యాదవ్...
88
ఐపీఎల్ 2022 సీజన్ కోసం రోహిత్ శర్మను రూ.16 కోట్లకు, జస్ప్రిత్ బుమ్రాను రూ.12 కోట్లకు, సూర్యకుమార్ యాదవ్‌ను రూ.8 కోట్లకు అట్టిపెట్టుకున్న ముంబై ఇండియన్స్, పోలార్డ్‌ను రూ.6 కోట్లకు రిటైన్ చేసుకుంది.