కృనాల్ పాండ్యా బంగారం స్మగ్లింగ్ కేసు... ఆరు గంటల విచారణ తర్వాత...

First Published Nov 15, 2020, 5:19 PM IST

IPL 2020 సీజన్‌లో టైటిల్ గెలిచి, ఐదోసారి ఛాంపియన్‌గా నిలచి రికార్డు క్రియేట్ చేసింది ముంబై ఇండియన్స్.. ముంబై తరుపున బరిలో దిగిన ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా, భారీగా బంగారం, జ్యూవెలరీ, వజ్రాలు తీసుకొస్తూ ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులకు దొరికిన సంగతి తెలిసిందే. 

దుబాయ్‌లో రెండు నెలల పాటు గడిపిన కృనాల్ పాండ్యా... అక్కడ చౌకగా దొరుకుతాయనే భారీగా నగలు, వజ్రాలు కొనుగోలు చేశాడు. అయితే వారికి ధ్రువపత్రాలు మాత్రం వెంట తీసుకురాలేదు.
undefined
కృనాల్ పాండ్యా బ్యాగులో నాలుగు లగ్జరీ బ్రాండ్ వాచ్‌లతో పాటు దాదాపు కోటి రూపాయలు విలువ చేసే బంగారం ఉన్నట్టు సమాచారం.
undefined
పరిమితికి మించిన బంగారం ఉండడంతో ముంబై విమానాశ్రయంలో కృనాల్ పాండ్యాను నిలిపివేశారు ఎయిర్‌పోర్టు అధికారులు.
undefined
ఆరు గంటల విచారణ తర్వాత కృనాల్ పాండ్యాను విడుదల చేశారట కస్టమ్స్ అధికారులు.
undefined
దుబాయ్‌లో కొనుగోలు చేసిన బంగారానికి కస్టమ్ సుంకాలు తెలియచేయాల్సి ఉంటుందనే విషయం తెలియకనే ఇలా చేశానని చెప్పిన పాండ్యా బ్రదర్.. వాటిని అధికారులకే ఇచ్చి వేయడానికే అంగీకరించాడు.
undefined
కృనాల్ పాండ్యా కొనుగోలు చేసిన వస్తువులను తమ వద్దే ఉంచుకున్న కస్టమ్స్ అధికారులు... వాటి విలువలో 38 శాతం కస్టమ్స్ డ్యూటీతో పాటు అనుమతి లేకుండా తీసుకొచ్చినందుకు జరిమానా కూడా చెల్లించిన తర్వాత అతనికి ఇస్తామని చెప్పారట.
undefined
ముంబై ఇండియన్స్ తరుపున 16 మ్యాచులు ఆడిన కృనాల్ పాండ్యా... 109 పరుగులు చేసి 6 వికెట్లు తీశాడు...
undefined
తమ్ముడు హార్ధిక్ పాండ్యా ఆసీస్‌తో టూర్ కోసం ఆస్ట్రేలియా చేరగా, అన్న కృనాల్ పాండ్యా మాత్రం స్వదేశానికి తిరిగి వస్తూ కస్టమ్ అధికారుల దగ్గర చిక్కుకున్నాడు.
undefined
పాండ్యా బ్రదర్స్ చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి...
undefined
click me!