సల్మాన్ ఖాన్ ఐపీఎల్ ఎంట్రీ, కొత్త ఫ్రాంఛైజీ కొనుగోలు చేసేందుకు... మోహన్‌లాల్ టీమ్‌ కూడా...

First Published Nov 15, 2020, 4:43 PM IST

ఐపీఎల్ 2020 సీజన్ విజయం బీసీసీఐ ఆలోచనల్లో చాలా మార్పులు తెచ్చింది. కరోనా ప్రభావంతో ఏర్పడిన నష్టాన్ని పూడ్చుకునేందుకు వచ్చే సీజన్‌లో ఐపీఎల్‌లో భారీ మార్పులు జరగబోతున్నట్టు సమాచారం. 2021 జనవరిలో ఐపీఎల్ మెగా వేలం జరపనున్న బీసీసీఐ, వచ్చే సీజన్ కోసం ఒకటి లేదా రెండు అదనపు జట్లను చేర్చాలని చూస్తోందని టాక్.

భారత దేశంలో డబ్బుంటే చాలు, ఏ మాత్రం రిస్క్ లేని వ్యాపారం క్రికెట్... ఐపీఎల్‌లో ఫ్రాంఛైజీలు సొంతం చేసుకున్నవారందరూ కోట్లలో లాభాలను చూశారు...
undefined
13 సీజన్లుగా ఒక్క టైటిల్ గెలవలేకపోయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాయల్ ఛాలెంజర్స్ జట్లకి లాభాల్లో కొదువ లేదంటే... ఐపీఎల్‌లో ఫ్రాంఛైజీల బిజినెస్ ఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు.
undefined
ఇప్పటికే ప్రీతి జింటా, షారుక్ ఖాన్‌, జూహీ చావ్లా వంటివారు ఐపీఎల్ కొన్ని ఫ్రాంఛైజీలకు సహ-యజమానులుగా కొనసాగుతుండగా హీరోయిన్ శిల్పాశెట్టి వివాదాల్లో ఇరుక్కుని, ఐపీఎల్ నుంచి తప్పుకుంది.
undefined
ప్రీతి జింటా సొంత జట్టు కింగ్స్ ఎలెవన్ పంజాబ్... ఇప్పటిదాకా ఐపీఎల్ టైటిల్ గెలవలేకపోయింది. అయితే క్రిస్‌గేల్, కెఎల్ రాహుల్ వంటి స్టార్లు ఉండడంతో క్రికెట్ ఫ్యాన్స్‌కి కావాల్సినంత మజాను అందిస్తోంది పంజాబ్.
undefined
దీంతో వచ్చే సీజన్‌లో అదనంగా ఒకటి లేదా రెండు జట్లను చేర్చాలనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్టు వార్తాలు రాగానే బాలీవుడ్, సౌత్ స్టార్ హీరోలు ఫ్రాంఛైజీల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారట.
undefined
దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక జట్లకు సొంత జట్లు ఉండగా, తెలుగు రాష్ట్రాలకు సన్‌రైజర్స్ హైదరాబాద్ రిప్రెజెంట్ చేస్తోంది... కేరళ సొంత జట్టు కొచ్చి మాత్రం నిధుల కొరతతో అర్ధాంతరంగా లీగ్ నుంచి నిష్కమించింది.
undefined
డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ కూడా ఇలాగే ఐపీఎల్ నుంచి నిష్కమించింది. అయితే దాన్ని రిప్లేస్ చేస్తూ సన్‌రైజర్స్ హైదరాబాద్ వచ్చింది.. కానీ కేరళ విషయంలో మాత్రం అలా జరగలేదు...
undefined
దాంతో కేరళ నుంచి ఐపీఎల్‌లో ప్రాతినిధ్యం వహించే జట్టును తేవాలని చూస్తున్నాడట మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్. ఆన్‌లైన్ లెర్నింగ్ యాప్ ‘బైజూస్’తో మోహన్‌లాల్ ఐపీఎల్ ఫ్రాంఛైజీని కొనుగోలు చేసేందుకు చూస్తున్నట్టు టాక్.
undefined
మరోవైపు బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ జట్టు కోల్‌కత్తా నైట్‌రైడర్స్, ఐపీఎల్ కెరీర్‌లో రెండు సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. ఐపీఎల్‌లో అత్యధిక లాభాలు ఆర్జిస్తున్న జట్లలో ఒకటిగా నిలుస్తోంది కేకేఆర్.
undefined
దీంతో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా ఓ ఐపీఎల్ ఫ్రాంఛైజీ కొనుగోలుకి ఆసక్తి చూపిస్తున్నాడట. సల్మాన్‌కి సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌లో జట్టు ఉంది. వచ్చే అహ్మదాబాద్ పేరుతో ఓ కొత్త ఫ్రాంఛైజీని తేవాలని చూస్తున్నట్టు టాక్ వినబడుతోంది. దీన్ని కొనుగోలు చేసేందుకు సల్మాన్ భాయ్ బాగా ఆసక్తిగా ఉన్నాడట.
undefined
click me!