T20 World Cup: విరాట్, రోహిత్ కాదు.. డేల్ స్టెయిన్ ను బాగా ఇబ్బంది పెట్టింది అతడేనట..

First Published Nov 10, 2021, 2:04 PM IST

Dale Steyn: ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ లో కామెంట్రీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న డేల్ స్టెయిన్.. మంగళవారం ట్విట్టర్ లో లైవ్ లోకి వచ్చాడు. ఈ సందర్భంగా  ఒక నెటిజన్.. ‘ఈ జనరేషన్ లో మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిన బ్యాటర్ ఎవరు..?’ ప్రశ్నించాడు.

టీ20 ప్రపంచకప్ కు కొద్ది కాలం ముందే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన దక్షిణాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ప్రపంచంలో ఎందరో అగ్రశ్రేణి బ్యాటర్లను తన బౌలింగ్ తో ముప్పుతిప్పలు పెట్టిన స్టెయిన్.. తనను ఇబ్బంది పెట్టింది ఎవరో తెలిపాడు. 

ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ లో కామెంట్రీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న డేల్ స్టెయిన్.. మంగళవారం ట్విట్టర్ లో లైవ్ లోకి వచ్చాడు. అభిమానులతో టీ20 ప్రపంచకప్, తన కెరీర్, బయోబబుల్ వంటి పలు విషయాలను ముచ్చటించాడు. 

ఈ సందర్భంగా  ఒక నెటిజన్.. ‘ఈ జనరేషన్ లో మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిన బ్యాటర్ ఎవరు..?’ ప్రశ్నించాడు. అయితే అందరూ భారత వన్డే, టెస్టు సారథి విరాట్ కోహ్లి పేరో లేదంటే టీ20 సారథి రోహిత్ శర్మ పేరో చెప్తారని ఊహించారు.

కానీ స్టెయిన్ మాత్రం అందుకు భిన్నంగా సమాధానమిచ్చాడు. రెండే అక్షరాలతో తనను ఇబ్బంది పెట్టిన బ్యాటర్ పేరు చెప్పేశాడు. అతడెవరో కాదు.. కెఎల్ రాహుల్.. 

సదరు అభిమాని ప్రశ్నకు స్టెయిన్ సూటిగా సుత్తి లేకుండా.. ‘KL’ అని రిప్లై ఇచ్చేశాడు. పలు అంతర్జాతీయ వేదికలతో పాటు ఐపీఎల్ లో కూడా స్టెయిన్.. రాహుల్ కు బౌలింగ్ చేశాడు. 

ఇక ఈ ప్రపంచకప్ లో మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అయ్యేదెవరన్న ప్రశ్నకు కూడా స్టెయిన్ సమాధానమిచ్చాడు. పాకిస్థాన్ సారథి బాబర్ ఆజమ్.. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డుకు ఎంపికవుతాడని స్టెయిన్ అభిప్రాయపడ్డాడు. 

కాగా.. ఇటీవల ఇంగ్లాండ్ తో  అర్థాంతరంగా ముగిసిన టెస్టు సిరీస్ లో కెఎల్ రాహుల్ అద్భుతంగా రాణించాడు. నాలుగు టెస్టులలో కలిపి 315 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. 

అంతేగాక కొద్దిరోజుల క్రితమే ముగిసిన ఐపీఎల్ లో కూడా రాహుల్ అద్భుతంగా రాణించాడు.  గత సీజన్ లో 626 పరుగులతో టాప్-3లో ఉన్నాడు. ఇక టీ20 ప్రపంచకప్ లో  తొలి రెండు మ్యాచుల్లో విఫలమైన రాహుల్.. తర్వాత మూడు మ్యాచుల్లో మాత్రం రెచ్చిపోయి ఆడాడు. అఫ్గానిస్థాన్ తో 69 పరుగులు చేసిన రాహుల్.. స్కాట్లాండ్ పై 54, నమీబియాపై 50 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. 

click me!