ఆ లెక్కన చూస్తే, మళ్లీ ముంబైదే టైటిల్... రోహిత్ ఫ్యాన్స్ హడావుడి...

First Published Apr 15, 2021, 3:31 PM IST

సినిమాల్లోలాగే క్రికెట్ వరల్డ్‌లో కూడా కొన్ని సెంటిమెంట్స్ బలంగా ఉంటాయి. అలా ఇప్పుడో సెంటిమెంట్‌, ముంబై ఇండియన్స్ అభిమానులను సంబరాలు చేసుకునేందుకు ఉసి గొల్పుతోంది. గత 9 సీజన్లలో తొలి మ్యాచ్ ఓడుతూ వస్తున్న ముంబై ఇండియన్స్, రెండో మ్యాచ్‌లో గెలిచిన ప్రతీసారి టైటిల్ కైవసం చేసుకుంది.

ఐపీఎల్ 2021 సీజన్‌లో మొదటి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో 2 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది ముంబై ఇండియన్స్...
undefined
ఆ మ్యాచ్‌లో కూడా 160 పరుగుల లక్ష్యచేధనతో బరిలో దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చచ్చీ చెడీ ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది ఊపిరి పీల్చుకుంది.
undefined
ఆ తర్వాత కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, ఊహించని విధంగా కమ్‌బ్యాక్ ఇచ్చి విజయాన్ని సొంతం చేసుకుంది.
undefined
ముంబై ఇండియన్స్‌ను 152 పరుగులకే ఆలౌట్ చేసిన కేకేఆర్, ఆ లక్ష్యాన్ని చేధించలేక చతికిల పడింది. భారీ హిట్టర్లు ఆఖరిదాకా ఉన్నా కట్టుదిట్టమైన బౌలింగ్ కారణంగా రోహిత్ సేనకు 10 పరుగుల తేడాతో విజయం దక్కింది..
undefined
ఈ మ్యాచ్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ఆడిన తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు, అనుమానాలు వచ్చినా... తర్వాతి రోజున సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా స్వల్ప లక్ష్యాన్ని చేధించలేక చతికిలపడింది..
undefined
చెన్నైలోని చెపాక్ స్టేడియం పిచ్ కారణంగానే బ్యాట్స్‌మెన్ రెండో ఇన్నింగ్స్‌లో పరుగులు చేయడానికి తెగ ఇబ్బంది పడుతున్నారని తేటతెల్లం అయ్యింది...
undefined
అయితే ఎలాగోలా రెండో మ్యాచ్‌లో గెలిచిన ముంబై ఇండియన్స్, ఇక టైటిల్ సొంతం చేసుకోవడమే తరువాయి అని అంటున్నారు రోహిత్ శర్మ అభిమానులు...
undefined
ఐపీఎల్ కెరీర్‌లో తొలి మ్యాచ్‌లో ఓడి, రెండో మ్యాచ్‌లో గెలిచిన ప్రతీసారి టైటిల్ సొంతం చేసుకుంది ముంబై ఇండియన్స్... ఇప్పటికే ఐదు టైటిల్స్ గెలిచిన ముంబై, ఈసారి టైటిల్ గెలిస్తే చరిత్ర క్రియేట్ చేస్తుంది...
undefined
వరుసగా మూడు సీజన్లలో టైటిళ్లు సొంతం చేసుకున్న జట్టుగా, వరుసగా మూడు సీజన్లలో ఛాంపియన్‌గా నిలిచిన ఏకైక జట్టుగా చరిత్ర తిరగరాస్తుంది ముంబై ఇండియన్స్...
undefined
అయితే 2021 సీజన్‌లో అన్ని జట్లు బలంగా కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా మొదటి రెండు మ్యాచుల్లోనూ ముంబై ఇండియన్స్ స్థాయికి తగిన పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయింది. దీంతో ఈసారి ముంబై టైటిల్ గెలవడం కష్టమే అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు...
undefined
click me!