Mumbai Indians: హార్దిక్ అవుట్.. సూర్య దూరం.. ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా మళ్లీ రోహిత్ శర్మ!

Published : May 06, 2026, 09:15 PM IST

Mumbai Indians : ముంబై ఇండియన్స్ జట్టులో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. హార్దిక్ పాండ్యా, సూర్య కుమార్ యాదవ్ దూరం కావడంతో ఆర్‌సీబీతో మ్యాచ్‌కు రోహిత్ శర్మ మళ్లీ కెప్టెన్ అయ్యే అవకాశం ఉంది.

PREV
15
ముంబై ఇండియన్స్ షాకింగ్ డెసిషన్

ఐపీఎల్ 2026లో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ పరిస్థితి ఇప్పుడు అస్సలు బాలేదు. ఈ సీజన్‌లో కనీసం ఐదు విజయాలు కూడా అందుకోలేక చతికిలపడింది. ఈ క్రమంలో ఆదివారం (మే 10) రాయ్‌పూర్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో జరగనున్న మ్యాచ్ ముంబైకి చాలా కీలకం.

అయితే ఈ మ్యాచ్‌కు ముందే టీమ్ మేనేజ్‌మెంట్‌లో పెద్ద అలజడి మొదలైంది. రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అందుబాటులో లేకపోవడం, సూర్యకుమార్ యాదవ్ కూడా వ్యక్తిగత కారణాలతో దూరం కావడంతో ముంబై పగ్గాలు మళ్లీ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ చేతికి వెళ్లనున్నాయనే వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

25
హార్దిక్ పాండ్యాకు గాయం.. టీమ్‌తో లేని కెప్టెన్

లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా ఆడలేదు. వెన్నునొప్పితో బాధపడుతున్న హార్దిక్, ఆర్‌సీబీతో జరిగే తదుపరి మ్యాచ్‌కు కూడా అందుబాటులో ఉండడని తెలుస్తోంది. ముంబై ఇండియన్స్ జట్టు రాయ్‌పూర్ బయలుదేరినప్పుడు హార్దిక్ పాండ్యా మిగిలిన ఆటగాళ్లతో కలిసి కనిపించలేదు. దీన్ని బట్టి చూస్తే ఆయన ఇంజూరీ సీరియస్‌గానే ఉందని, కోలుకోవడానికి ఇంకా సమయం పడుతుందని అర్థమవుతోంది. కెప్టెన్ లేకపోవడం ముంబైకి పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పాలి.

35
సూర్యకుమార్ యాదవ్ ఎందుకు ఆడటం లేదు?

హార్దిక్ లేని సమయంలో లక్నోపై సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించి జట్టుకు విజయాన్ని అందించాడు. కానీ ఆర్‌సీబీతో మ్యాచ్‌కు సూర్య కూడా దూరం కానున్నట్లు సమాచారం. దీనికి కారణం క్రికెట్ కాదు, ఒక గుడ్ న్యూస్ ఉంది. సూర్య భార్య దేవిషా శెట్టి త్వరలో తల్లి కాబోతున్నారు. ఈ కీలక సమయంలో తన భార్య దగ్గర ఉండాలని సూర్య నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయన ఈ మ్యాచ్‌కు సెలవు తీసుకునే అవకాశం ఉంది. అయితే దీనిపై ముంబై ఇండియన్స్ లేదా బీసీసీఐ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

45
రోహిత్ శర్మ మళ్ళీ కెప్టెన్?

ఒకవేళ హార్దిక్, సూర్య ఇద్దరూ అందుబాటులో లేకపోతే ముంబై జట్టుకు కొత్త కెప్టెన్ కావాలి. ఈ రేసులో అందరి కంటే ముందున్న పేరు రోహిత్ శర్మ. ఐపీఎల్ 2026లో ముంబై ప్రదర్శన చాలా పేలవంగా ఉంది, దాదాపు ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకుంది. 

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో జట్టును గాడిలో పెట్టాలంటే 5 సార్లు ట్రోఫీ అందించిన పాత కెప్టెన్ రోహిత్ శర్మనే సరైన ఆప్షన్ అని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. రోహిత్ నాయకత్వంలో ముంబై అద్భుతాలు చేసింది, కానీ హార్దిక్‌కు పగ్గాలు ఇచ్చాక టీమ్ గ్రాఫ్ పడిపోయింది. దీంతో మళ్లీ రోహిత్‌ను కెప్టెన్ చేయాలనే డిమాండ్ అభిమానుల నుంచి బలంగా వినిపిస్తోంది.

55
తిలక్ వర్మకు ఛాన్స్ దక్కుతుందా?

ఒకవేళ టీమ్ మేనేజ్‌మెంట్ భవిష్యత్తు గురించి ఆలోచించి రోహిత్‌ వైపు చూడకపోతే, 23 ఏళ్ల యంగ్ ప్లేయర్ తిలక్ వర్మకు కెప్టెన్సీ ఇచ్చే ఛాన్స్ ఉంది. తిలక్ వర్మ ముంబై ఇండియన్స్‌లో నిలకడగా రాణిస్తున్నాడు. భవిష్యత్తులో ముంబై కెప్టెన్ అయ్యే సత్తా ఉన్న ఆటగాడిగా అతనికి మంచి పేరు ఉంది. సీనియర్ల మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తల నేపథ్యంలో, యువ రక్తం వైపు మొగ్గు చూపినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి ఆదివారం మ్యాచ్‌లో ముంబైని ఎవరు నడిపిస్తారో చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories